Home » » Akruthi -Ghantasala Sathabdhi Award to Sr Actress Krishna Veni

Akruthi -Ghantasala Sathabdhi Award to Sr Actress Krishna Veni

 సీనియర్ నటి కృష్ణ వేణి కి

ఆకృతి- ఘంటసాల శతాబ్ది పురస్కారం





భారత దేశ చరిత్ర లో అందరూ గుర్తించు కొని  గర్వించ దగ్గ నటి, గాయని, నిర్మాత కృష్ణవేణి  అన్నారు తెలంగాణ ఫిల్మ్   డెవలప్మెంట్స్ కార్పోరేషన్ చైర్మన్ అనిల్ కూర్మ చలం.

 ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో శుక్ర వారం ఆకృతి- ఘంటసాల శతాబ్ది పురస్కారం ఆయన సుప్రసిద్ధ సినీ నటి, గాయని , నిర్మాత సి. కృష్ణ వేణి ప్రదానం చే సి ప్రసంగించారు..ఆమె ఎన్టీఆర్ లాంటి మహానటుడుకి తమ మనదేశం చిత్రంలో తొలి అవకాశం ఇవ్వడం మరచి పోలేని విషయం అన్నారు..ఘంటసాల శతాబ్ది పురస్కారం ఆయనను  తొలి సారి సంగీత దర్శకుని చేసిన కృష్ణ వేణి  కి ఆకృతి సంస్థ ఇవ్వడం అత్యంత ఔచిత్యం గా వుందన్నారు. ఎవరినైనా సక్సెస్ తర్వాతనే గుర్తు పెట్టు కుంటారు.. కానీ ఎంతోమంది కి సక్సెస్ ఇచ్చిన కృష్ణ వేణి కి తగినంత గుర్తింపు రాకపోవడం బాధాకరం అన్నారు. ఈ వేదిక ద్వారా ఈ మహ నీయురాలి తో పరిచయం కావడం నా అదృష్టం గా భావిస్తున్నాను అన్నారు.

విశిష్ట అతిథి గా విచ్చేసిన తెలంగాణా పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొల్లేటి దామోదర్ మాట్లాడు తూ ఘంటసాల శత జయంతి పురస్కారాన్ని కృష్ణవేణి ఇవ్వడం ఆమెకు ఆకృతి ఇచ్చిన అరుదైన గౌరవం అన్నారు. ఇప్పటి తరం సినిమా వాళ్ళ కు ఆమె జీవితం ఒక  పుస్తకంలా ఉపయోగ పడుతుంది అన్నారు..ప్రముఖ సినీ నటి రోజా రమణి కృష్ణవేణి ఒక లెజెండ్ అంటూ ప్రశంసించారు.. ఘంట సాల కోడలు ఈ కార్య క్రమం లో పాల్గొనడం అదృష్టం గా భావిస్తున్నాను అన్నారు.. పూర్వ ప్రధాని పి.. వి. మనుమరాలు అజిత స్పందిస్తూ కృష్ణ వేణి నీ చూడాలన్న నా కల ఇప్పటికి నెరవేరింది అన్నారు. కార్య క్రమా నీ కి ఆకృతి సుధాకర్ అధ్యక్షత వహించారు.. ఈ కార్య క్రమం లో ఫిక్కీ సిఎండి అచ్యుత జగదీష్ చంద్ర , నటుడు మోహన  కృష్ణ  మున్నగు వారు ప్ల్లొన్నారు..కృష్ణ వేణి   వయసు ఆరోగ్య రీత్యా కృష్ణవేణి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పత్రికా మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.



Share this article :