Home » » Jaya jaya jaya Jayahe in Telugu

Jaya jaya jaya Jayahe in Telugu

 తెలుగులో మలయాళ సంచలనం ‘జయ జయ జయ జయహే’ !!!బేసిల్ జోసెఫ్, దర్శన రాజేంద్రన్ జంటగా విపిన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన మలయాళ సినిమా ‘జయ జయ జయ జయహే’ మలయాళ  ఈ సినిమాను 5 నుంచి 6 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు లక్ష్మీ వారియర్, గణేశ్ మీనన్. అక్టోబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 40 కోట్ల వరకూ వసూలు చేసింది. 

ఈ చిత్ర కథాంశం ను పరిశీలిస్తే జయ తెలివైన మధ్యతరగతి అమ్మాయి. ఆమె తల్లిదండ్రులు కుమారుడి భవిష్యత్ కోసం ఖరీదైన స్కూల్ లో చేర్పిస్తారు. అయితే జయను మాత్రం తన ఆశలకు వ్యతిరేకంగా ఇంటి దగ్గరలో చేరుస్తారు. అందుకే తల్లిదండ్రులపై అప్పుడప్పుడు తిరుగుబాబు చేస్తూ ఉంటుంది జయ. దాంతో చదువు పూర్తి కాకముందే ఆమెకు పెళ్ళి చేయాలనుకుంటారు తల్లిదండ్రులు. పౌల్ట్రీ యజమాని రాజేష్ ను జయకు సరైన వరుడుగా నిర్ణయిస్తారు. అయితే తన చదువును కొనసాగించడానికి అంగీకరించిన తర్వాత పెళ్ళికి అంగీకరిస్తుంది జయ. పెళ్ళి తర్వాత రాజేష్ జయ చదువు వాయిదా వేస్తూ ఇంట్లో జరిగే ప్రతిదీ తన ఇష్ట ప్రకారమే జరగాలని మొండిగా ఉంటాడు. ఆ తర్వాత జయను శారీరకంగా కూడా హింసిస్తాడు. అది సర్వ సాధారణ వ్యవహారంగా మారటంతో జయ తల్లిదండ్రుల మద్దతు కోరుతుంది. కానీ వారు సర్దుకుపొమ్మని చెబుతారు. తనకు సాయం చేసేందుకు ఎవరూ రారన్న నిజాన్ని గ్రహించి తదనుగుణంగా చర్యలు తీసుకుని తన కష్టాలకు ఎలా ముగింపు పలికింది అనేది మిగతా కథ.

మే నెలలో షూటింగ్ మొదలు పెట్టి 42 రోజుల్లో పూర్తి చేసి అక్టోబరులో విడుదల చేశారు. అంటే 6 నెలల లోపు విడుదల చేశారు. ఇక ఈ సినిమాకి అంకిత్ మీనన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ డిస్నీ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. త్వరలో తెలుగులో ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతొంది. తెలుగులో ఒక పెద్ద నిర్మాణ ఈ చిత్ర థియేట్రికల్ రైట్ సొంతం చేసుకోవడం విశేషం.


Share this article :