Home » » Dharmachakram First Look Launched

Dharmachakram First Look Launched

'ధర్మచక్రం' ఫస్ట్ లుక్ విడుదల..



సంకేత్ తిరుమనీడి, మౌనిక చౌహాన్ జంటగా పద్మ నారాయణ ప్రొడక్షన్ బ్యానర్ లో నాగ్ ముంతా దర్సకత్వం లో తెరకెక్కిస్తున్న సినిమా ధర్మచక్రం. సందేశాత్మక కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. తాజాగా "ధర్మచక్రం" ఫస్ట్ లుక్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఆనంద్ మరుకుర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు.. ప్రణయ్ రాజపూటి సంగీతం అందిస్తున్నారు. 


దర్శకుడు నాగ్ ముంతా మాట్లాడుతూ.. ' ధర్మచక్రం మెసేజ్ ఓరియెంటెడ్ గా తెరకెక్కిస్తున్నాము. సమాజంలో ఆడవాళ్ళపై జరుగుతున్న అఘాయిత్యాలు, ఆకృత్యాల నేపథ్యంలోనే ఈ చిత్ర కథ ఉంటుంది. అమ్మాయిల స్వీయ రక్షణ ఎలా ఉండాలో ఈ సినిమాలో చూపిస్తున్నాము. హీరోయిన్ మోనిక చౌహన్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీ అనౌన్స్ చేస్తాము..' అని తెలిపారు.


నటీనటులు: 


సంకేత్ తిరుమనీడి, మౌనిక చౌహాన్, చైతన్య, ప్రవీణ్ కుమార్, ధృవ, జానీ ఫీవర్ మైలవరం, నరసింహా రావు తదితరులు..


టెక్నికల్ టీమ్:


దర్శకుడు: నాగ్ ముంతా

నిర్మాత: జిపి రెడ్డి

సినిమాటోగ్రఫర్: ఆనంద్ మరుకుర్తి

సంగీతం: ప్రణయ్ రాజపూటి

యాక్షన్: హంగామా కృష్ణ బమ్మిడి

పి ఆర్.ఓ : లక్ష్మీ నివాస్


Share this article :