Home » » Producer Bellamkonda Suresh Congratulated and Thanked Sithara Entertainments for Swathimuthyam Success

Producer Bellamkonda Suresh Congratulated and Thanked Sithara Entertainments for Swathimuthyam Success

 స్వాతిముత్యం లాంటి మంచి క‌థ‌తో గ‌ణేష్ న‌టుడ్ని చేసి స‌క్సెస్ ఇచ్చిన‌ సితార ఎంట‌ర్‌ టైన్‌మెంట్ వారికి ధ‌న్య‌వాదాలు- బెల్లంకొండ సురేష్‌


 



ఫార్చ్యూన్ ఫోర్ సినిమాతో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం 'స్వాతిముత్యం'. గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యారు. విభిన్న కథాంశంతో వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి మంచి విజ‌యాన్ని చ‌విచూసింది. ఈ సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల‌కు, చిత్ర‌నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తూ సోమ‌వారంనాడు ప్ర‌ముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ చిత్ర టీమ్‌తో విలేక‌రుల స‌మావేశం వేర్పాటు చేశారు.


 


బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ, ద‌స‌రా పండుగ‌నాడు విడుద‌లై మొద‌టి రెండు రోజు క‌లెక్ష‌న్లు మంద‌కొడిగా వున్నా మూడోరోజు శుక్ర‌వారం నుంచి నేడే విడుద‌ల అన్నంత రేంజ్‌తో అనూహ్యంగా క‌లెక్ష‌న్లు పెరిగాయి. అలా రోజురోజుకూ పెరుగుతూ వుండ‌డం చాలా ఆనందంగా వుంది. మంచి క‌థ వుంటే ప్రేక్ష‌కులు ఆదరిస్తార‌నేందుకు ఈ సినిమానే నిద‌ర్శ‌నం. ఇటువంటి సినిమాను నిర్మించిన సితార ఎంట‌ర్‌ టైన్‌మెంట్స్ వంశీగారికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. ఒక‌వైపు వ‌ర్షాలు, మ‌రోవైపు పెద్ద హీరోల చిత్రాల న‌డుమ స్వాతిముత్యం విడుద‌ల‌యినా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొంద‌డం అదృష్టంగా భావిస్తున్నాను.


 


ఈ సినిమాలో మంచి క‌థ‌, సీనియ‌ర్ న‌టీన‌టులు చేయ‌డం లాభించింది. మా అబ్బాయి గ‌ణేష్ మొద‌టి సినిమా అయినా సీనియ‌ర్స్‌తో చేయ‌డం అందులోనూ మంచి క‌థ‌తో రావ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. నేను నిర్మాత‌యినా ఇంత మంచి క‌థ‌ను తీయ‌లేనేమో. అలాంటి చిన్న‌బాబు, నాగ‌వంశీ సితార‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌లో తీసి స‌క్సెస్ ఇచ్చారు. మా గురువులు మోహ‌న్‌బాబు త‌ర్వాత ఈ సినిమా నిర్మాత‌ల‌కు జీవితాంతం రుణ‌ప‌డి వుంటాను. ద‌ర్శ‌కుడు చిన్న ఎమోష‌న్స్‌ను హిలేరియ‌స్ కామెడీగా చూపించారు. న‌టుడు గోప‌రాజు క్ల‌యిమాక్స్‌లో `పిల్ల‌లు లేని వారికి తెలుసురా ఆ బాధేమిటో.. ఆ స‌రోగ‌సీఏమిటో..` అంటూ డైలాగ్ ఎమోష‌న్‌ తో క‌ట్టిప‌డేశాడు.ద‌ర్శ‌కుడు దానిని బాగా తీయ‌గ‌లిగాడు. ఈ సంద‌ర్భంగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు, ఓవ‌ర్‌సీస్‌వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను. సెకండ్ వీక్ నుంచి క‌లెక్ష‌న్లు పెర‌గ‌డం జ‌రిగింది. ఈ విజ‌యం జ‌న్మ‌లో మ‌ర్చిపోలేను అని తెలిపారు.


 


చిత్ర ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ, స్వాతిముత్యం ప్రీమియ‌ర్ నుంచి అంద‌రూ బాగా స‌పోర్ట్ చేశారు. ముఖ్యంగా ప్రేక్ష‌కులు థియేట‌ర్‌కు వ‌చ్చి చూస్తున్నారు. కుటుంబంతో చూడ‌డం విశేషం. అందుకే వారంద‌రికీ థ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. బ‌య‌ట వ‌ర్షాలున్నా థియేట‌ర్‌కు రావ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. త్రివిక్ర‌మ్ గారు సినిమా చూసి, రిపీట్ ఆడియ‌న్స్ వ‌స్తారు అంటూ ఆయ‌న చెప్పిన మాట నిజ‌మ‌యింది. బెల్లంకొండ సురేష్‌గారు నా క‌థ‌విన్నాక నువ్వే చేయ‌గ‌ల‌వ‌ని నీకు ఆ స‌త్తావుందంటూ నేను తీసిన షార్ట్ ఫిలిం చూసి మెచ్చుకోవ‌డ‌మేకాక‌, తెలిసిన‌వారంద‌రికీ నా షార్ట్ ఫిలిం గురించి చెప్ప‌డం నాకు మ‌రింత ధైర్యం క‌లిగించారు. ముందుగా ఈ క‌థ‌పై పూర్తి న‌మ్మ‌కంతో నాగ‌వంశీగారు వున్నారు. ఆయ‌న అనుకున్న‌ట్లే హిట్ అయింది. చిన్న‌బాబుగారు మెచ్చుకున్నారు. అందుకే నేను రెండో సినిమా కూడా సితార బేన‌ర్‌లోనే చేస్తున్నాను అని చెప్పారు.


 


గ‌ణేష్ మాట్లాడుతూ, మీడియా కూడా మంచి రివ్యూల‌తో ఎంక‌రేజ్ చేసింది. మంచి సినిమా తీస్తే ప్రేక్ష‌కులు చూస్తార‌ని నిరూపించారు. పెద్ద సినిమాల మ‌ధ్య‌లో మా చిన్న సినిమానూ చూసి మెచ్చుకున్నారు. నటుడిగా పేరు వ‌చ్చింది. ఈ అవ‌కాశం ఇచ్చిన సితార ఎంట‌ర్‌ టైన్‌మెంట్స్ బేన‌ర్‌కూ, నాగ‌వంశీగారికి, చిన్న‌బాబుగారికి, ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్‌ కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. భ‌విష్య‌త్‌ లో మంచి క‌థ‌ల‌తోపాటు అన్ని త‌ర‌హా క‌థ‌ల‌ను   చేయాల‌నుకుంటున్నాను అన్నారు.


 


అనంత‌రం ప‌లు ప్ర‌శ్న‌ల‌కు బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ, నేను నిర్మాత అయినా ఇలాంటి సినిమా తీయ‌లేను. అందుకే స్వాతిముత్యం విడుద‌ల తేదీలో నేను ఎటువంటి జోక్యం చేసుకోలేదు. మంచి క‌థ వుంటే బెల్లంకొండ శ్రీ‌నివాస్‌తో క‌లిసి గ‌ణేష్ చిన్న పాత్ర అయినా న‌టించే అవ‌కాశం వుంటుంది. అదేవిధంగా ఇప్ప‌టి ట్రెండ్‌ను బట్టి రిరిలీజ్‌గా చెన్న కేశ‌వ‌రెడ్డి విడుద‌ల చేస్తే మంచి క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. అదేవిధంగా ఎన్‌.టి.ఆర్‌.తో ఆది సినిమాను సంద‌ర్భానుసారంగా రిలీజ్ చేసే ఆలోచ‌న వుంద‌ని తెలిపారు.


Share this article :