Home » » Megastar Chiranjeevi Birthday Celebrations Held Grandly at Chiranjeevi Blood Bank

Megastar Chiranjeevi Birthday Celebrations Held Grandly at Chiranjeevi Blood Bank

 చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఘనంగా బర్తడే వేడుకలు 



తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవి అనే పేరుకున్న ప్రస్థానం వేరు. సినీనటుడిగా ఆయనకు అభిమానుల గుండెల్లో ఎంతటి క్రేజ్, ప్రేమాభిమానాలు ఉన్నాయో.. ఒక మంచి మనిషిగా ప్రపంచం ఆయనకిచ్చే గౌరవమర్యాదలు కూడా ఎల్లప్పుడూ గొప్పస్థాయిలోనే ఉంటాయి. టాలీవుడ్‌లో మెగాస్టార్ అంటే.. ఫ్యాన్స్‌లో వచ్చే ఉత్సాహాన్ని, ఊపును ఎవ్వరూ ఆపలేరు. అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసే పేరే చిరంజీవి అలియాస్ కొణిదెల శివశంకర వరప్రసాద్.


ప్రపంచానికి మెగాస్టార్‌గా.. అభిమానులకు అండగా నిలిచే అన్నగా.. ఎదుటివారి ఎంతటివారైనా, ఎలాంటివారైనా ఆపదలో ఉన్నారంటే ఆదుకునే ఆపద్భాంధవుడిగా.. సామాన్య జనాల కోసం బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు.. ఇలా ప్రతి విషయంలో ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలుస్తూ వస్తున్నారు చిరంజీవి. ఓవైపు ఇండస్ట్రీ అభివృద్ధికి, సినీ కార్మికుల సంక్షేమానికి ముందుంటూ.. మరోవైపు ప్రజలకు నిరంతరం రక్తదానం, నేత్రదానం, ఇతర సేవా కార్యక్రమాలకై కృషి చేస్తున్నారు. 


తెలుగు జనులంతా ప్రేమించే మెగాస్టార్ పుట్టినరోజు అంటే ఫ్యాన్స్ అందరికి పండగే అని చెప్పాలి. ప్రతియేటా ఎంతో ఘనంగా మెగాస్టార్ బర్త్ డే వేడుకలు జరుపుతుంటారు ఫ్యాన్స్. అయితే.. ఈసారీ కూడా చాలా గ్రాండ్‌గా ఆయన పుట్టినరోజు వేడుకలు జరిపారు. పుట్టినరోజుకు వారం రోజుల ముందునుండే అంటే.. ఆగష్టు 15 నుంచి బర్త్ డే రోజు వరకూ.. ఒక్కోరోజు ఒక్కో సేవాకార్యక్రమాన్ని చేపట్టారు. 


ఇందులో భాగంగా చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్‌లో పుట్టినరోజు వేడుకుల ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా దర్శకుడు మెహర్ రమేశ్ హాజరయ్యారు.  అభిమానులు రక్తదానం చేశారు. చిరు పుట్టిన రోజు సందర్భంగా కేక్‌ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. 


ఇక బ్లడ్ బ్యాంక్‌లో బర్తే డే వేడుకల్లో వివిధ రంగాలలో విశేష సేవలు చేసిన వారిని ఘనంగా సత్కరించారు. అదే విధంగా ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ సీ.ఎఫ్‌.ఓ శేఖర్‌గారు, సీ.ఓ.ఓ ఆర్ స్వామి నాయుడు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పవన్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. ప్రతిసంవత్సరం మెగాస్టార్‌ను కలిసి ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాంకాంక్షలు తెలిపాలని అనేక రాష్ట్రాలను అనేక మంది తరలివస్తారు. వారందరికీ బ్లడ్ బ్యాంక్‌లో సదుపాయలు కల్పించి... వేడుకల్లో భాగం చేయడం జరిగింది.


*ఈ సందర్భంగా  దర్శకుడు మెహర్ రమేశ్ మాట్లాడుతూ....* మెగాస్టార్ పుట్టినరోజున ఈ సేవాకార్యక్రమాల్లో పాల్గొనడం నా అదృష్టం. సినిమా  చేయడం దాన్ని బ్లాక్ బస్టర్ చేయడం ఆయనకు కొత్త కాదు. గత నలుబై ఏళ్లుగా ఆయన చేస్తున్నదే. కానీ సంపాదించిన డబ్బుని సేవకార్యక్రమాల్లో ఖర్చు చేయడం, లక్షల మందిలో స్ఫూర్తి నింపడం అది ఒక్కరికే సాధ్యమైంది. అది అన్నయ్య గారికే. పక్కన ఉండే వారికి సాయం చేయడం అన్నయ్య లక్షణం. 275 కోట్ల రూపాయాలను  సైరా నర్సింహ రెడ్డి సినిమా ఆయన తీస్తే... సినిమా తీస్తే షూటింగ్‌లో ఉంటే జూనియర్ మా దగ్గరకు వచ్చి... చాలా సాయం చేశారు. సీసీసీ స్థాపించి ఎంతో మందికి సాయమందించారు. వీఆర్‌ఆల్ మెగా సోల్జర్స్. మెగా సోల్జర్స్ అంటే ప్రాణాలు పెట్టే వాళ్లు కాదు.. ప్రాణాలు నిలబెట్టే మెగా సోల్జర్స్. ఎక్కడ ఆపద ఉంటే అక్కడ ఎంతో సాయం చేశారు. సేవ చేయడానికి కావాల్సింది డబ్బు కాదు.. గుండె కావాలి. మనకు తెలియంది చాలా చేశారు. ఆయన సేవ ఆయన బ్లడ్‌లో ఉంది. 


*నటుడు నాగ మహేష్ మాట్లాడుతూ...* ఇవాళ నేను సినిమా నటుడిగా మీ ముందు మాట్లాడుతున్నానంటే.. అన్నయ్య పెట్టిన బిక్ష.  ఖైదీ 150 నంబర్ షూటింగ్‌లో నేను అక్కడికి వెళ్లాను. నేను మీ సినిమాలో ఒక చిన్న పాత్ర చేస్తాను అనగానే అన్నయ్య వినాయక్‌ గారికి చెప్పారు. మూడురోజుల్లో నాకు వేషం వచ్చింది. అందులో నాకు ఇన్‌స్పెక్టర్ పాత్రను ఇచ్చారు. ఈ సందర్భంగా అన్నయ్యకు నా కృతజ్ఞతలు చెబుతున్నాను. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను.


Share this article :