Mahesh Machidi New Film Titled as Balakrishna

 సెల్ఫ్ మేడ్ హీరో మహేష్ మచిడి

తాజా చిత్రం "బాలకృష్ణ"



కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: 

"అమెరికాలో అమ్మకూచి" 

ఫేమ్ *రాధిక కొండా*  


     బహుముఖ ప్రతిభాశాలి, "మిస్టర్ ఇండియా" (కర్ణాటక) టైటిల్ విన్నర్ మహేష్ మచిడి నటిస్తున్న విభిన్న కథాచిత్రం "బాలకృష్ణ" మొదలైంది. శ్రేష్ఠ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ విభిన్న కథా చిత్రానికి "అమెరికాలో అమ్మకూచి" ఫేమ్ రాధిక కొండా దర్శకత్వం వహిస్తున్నారు. అరుణ్ కన్నా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది!!

     ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతున్న "సెల్ఫ్ మేడ్ హీరో" మహేష్ మచిడి మాట్లాడుతూ.... "రాధిక కొండా చెప్పిన కథ నాకు చాలా బాగా నచ్చింది. కథ, స్క్రీన్ ప్లే, మాటలు కూడా అమే రాసుకున్నారు. ఒక హైలీ టాలెంటెడ్ లేడి డైరక్టర్ టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అవుతున్నారని కచ్చితంగా చెప్పగలను" అన్నారు!!

Post a Comment

Previous Post Next Post