Home » » Chandoo Mondeti Interview About Karthikeya 2

Chandoo Mondeti Interview About Karthikeya 2

 ‘కార్తికేయ 2’  దర్శకుడు చందూ మొండేటి ఇంటర్వ్యూ



ప్రేమమ్, సవ్యసాచి,కార్తికేయ‌, చిత్రాలకు దర్శకత్వం  వహించి తన కంటూ మంచి గుర్తింపును తెచ్చుకొన్న దర్శకుడు  చందూ మొండేటి. తను దర్శకత్వం  వహించిన తాజా చిత్రం  "కార్తికేయ 2".. క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ‌ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ చిత్రాన్ని  టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం మళ్లీ అక్కడ మొదలైంది..ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దీనిని పొందగలం’ అంటూ అదిరిపోయే డైలాగ్స్ తో సాగే ట్రైలర్ కు ఆడియన్స్ నుండి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది  అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఆగస్ట్ 13న గ్రాండ్ గా థియేటర్స్ లలో విడుదల అవుతున్న సందర్బంగా చిత్ర దర్శకుడు చందు మొండేటి పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ 



చిన్నప్పటినుండి నాకు రామాయణం, మహా భారతం పుస్తకాలు ఎక్కువగా చదవేవాన్ని. ఆలా ఇతిహాసాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉండడం వలన కృష్ణతత్వం అనే  పాయింట్ తీసుకొని కార్తీకేయ సినిమా చేయడం జరిగింది. దేవుడు అంటే ఒక క్రమశిక్షణ.. మనం నమ్మే దంతా కూడా సైన్స్ తో ముడిపడి ఉంటుంది. శ్రీకృష్ణుడు గురించి చెప్పడం అంటే అనంతం. శ్రీకృష్ణుడు ద్వారకాలో వున్నాడా లేదా అన్నది ఒక చిన్నపాయింట్ దాన్ని బాట్టి ఈ సినిమాను తీయడం జరిగింది.అందుకు కృష్ణ తత్త్వం ను కాన్సెప్ట్ తీసుకొని ఇప్పటితరానికి అయన గొప్ప తనం గురించి చెప్పబోతున్నాము. శ్రీకృష్ణుడు ను మోటివ్ గా తీసుకొని తీసిన ఈ సినిమాలో చాలా మ్యాజిక్స్ ఉన్నాయి.శ్రీకృష్ణుడు దాని డెఫినేషన్ అంతా అర్థమయ్యేలా కొంతవరకు చూయించాను. ఈ మధ్య భక్తి సినిమాలు చూడడానికి ఎవరూ ఆలా రావడం లేదని  భక్తి తో పాటు అడ్వెంచర్ తో కూడుకున్న థ్రిల్ ఉండాలని ఈ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమాను చూసిన ఆడియన్స్ ఒక కొత్త అనుభూతితో బయటకు వస్తారు.


కార్తికేయ 1 హిట్ అవ్వడంతో  ఇప్పుడు వస్తున్న సీక్వెల్ కు  ఆడియన్స్ నుండి మంచి  పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. "కార్తికేయ 1" లో నిఖిల్ హీరో గా చెయ్యడంతో "కార్తికేయ 2" లో నటించడం చాలా ఈజీగా అయ్యింది. అందులో మెడికల్ స్టూడెంట్ గా నటిస్తే ఇందులో డాక్టర్ గా నటించాడు. శ్రీనివాస్ రెడ్డి,ప్రవీణ్, వైవా హర్ష,సత్య  వీరందరూ బిజీగా ఉన్నా ఈ కథను, కాన్సెప్ట్, నమ్మి, మాతో ట్రావెల్ అయ్యారు. "కార్తికేయ  2" లో స్వాతికి పాత్ర కు ఎక్కువ స్కోప్ లేదు.అందుకే స్వాతిని తీసుకోలేదు. అయితే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ చూడకపోయినా మీకు సెకెండ్ పార్ట్ లో అర్థమై పోతుంది లగే రహో మున్నాబాయి కంటే ముందు మున్నబాయ్ MBBS సినిమాలా క్యారెక్టరైజేషన్స్ క్యారీ చేస్తుంది. కానీ కథ మాత్రం వేరు.



కథ హిమాచల్ ప్రదేశ్ లో నడుస్తున్నందున  అక్కడి వారు అయితే బాగుంటుందని బాలీవుడ్ యాక్టర్ అనుపమ ఖేర్ ను తీసుకోవడం జరిగింది.అయన సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. దేవి పుత్రుడు సినిమాకు ఈ కథకు ఎటువంటి సంబంధాలు లేవు 



ఏ కథకైనా నిర్మాతలు కొన్ని బౌండరీస్ ఇస్తారు. దాన్ని బట్టి ఈ కథను చేయడం జరిగింది. "కార్తికేయ 2" కు బడ్జెట్ లో తీయడానికి చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయడం జరిగింది.అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిబొట్ల, మయాంక్ గార్లు మమ్మల్ని నమ్మారు. రెండు ప్యాండమిక్ స్విచ్వేషన్స్ వచ్చినా వెనుకడుగు వేయకుండా ఈ సినిమాను తెరకేక్కించారు.ఈ స్క్రిప్ట్ పైన నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు


కార్తికేయ రెండు పార్ట్స్ కూడా అడవెంచర్స్ కాన్సెప్ట్ తో నే తీయడం జరిగింది.ఇందులో కార్తీక్ ఘట్టమనేని విజువల్స్ బాగుంటాయి. కాలభైరవ మ్యూజిక్ హైలెట్ గా ఉంటుంది.అలాగే టెక్నిషియన్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. వి. యఫ్. ఎక్స్ చాలా బాగా వచ్చింది.



థియేటర్ ద్వారా ప్రేక్షకులకు గ్రాండ్ గా బిగ్ స్క్రీన్ పై మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని  తీసిన సినిమా ఇది.ఈ చిత్రాన్ని ఐదు సంవత్సరాలనుండి 15 సంవత్సరాల పిల్లలు చూస్తే నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే వారికి ఇతిహాశాలపై  ఒక అవగాహన వస్తుంది 



నేను ఇంకా చెప్పాల్సింది చాలా వుంది. ఆడియన్స్ ఈ చిత్రాన్ని రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి నెక్స్ట్ పార్ట్ చేస్తాను.ఈ సినిమా తరువాత  నెక్స్ట్ గీతా ఆర్ట్స్ లో ఉంటుంది. రెండు సినిమా కథలు వున్నాయి. ఒకటి ప్రేమకథా చిత్రమైంటే  ఇంకొకటి సోషల్ డ్రామా, ఈ రెంటిలో ఏ కథ ముందు అనేది ఫైనల్ కాలేదు. గీతా ఆర్ట్స్ తరువాత  నాగార్జున గారితో మరో చిత్రం చేయబోతున్నాను. కరోనా రాకుండా ఉంటే ఇవి సెట్స్ పై ఉండేవి అని ముగించారు.


Share this article :