Home » » Agent Anand Santosh Trailer Launched Grandly

Agent Anand Santosh Trailer Launched Grandly

ఏజెంట్‌ ఆనంద్ సంతోష్‌ను అందరూ సపోర్ట్ చేయండి.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో షణ్ముఖ్ జశ్వంత్



షణ్ముఖ్ జశ్వంత్ హీరోగా అలంకృత, వైశాలీ హీరోయిన్లుగా ఏజెంట్ ఆనంద్ సంతోష్ రాబోతోంది. ఇన్‌ఫినిటం నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఆహాలో జూలై 22న రాబోతోంది. సుబ్బు కథను అందించగా.. అరుణ్ పవార్ దర్శకత్వం వహించారు. ఇది వరకు విడుదల చేసిన పోస్టర్లు, టీజర్‌కు విశేషమైన స్పందన లభించింది. శుక్రవారం నాడు ఏజెంట్ ఆనంద్ సంతోష్  ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం


ఇన్‌ఫినిటం అధినేత వందన మాట్లాడుతూ.. ‘మా దగ్గరికి ఈ కథ ఎప్పుడో వచ్చింది. కానీ సరైన పర్సన్ కోసం ఎదురుచూశాం. షణ్ముఖ్ మాకు ఎప్పటి నుంచో తెలుసు. అతను ఎదిగిన తీరు చూసి ఆశ్చర్యమేస్తుంది. సోషల్ మీడియా, డిజిటల్ స్టార్‌గా ఎదిగారు. మిస్టర్ షన్ను, సూర్య మీకు ఎలా నచ్చాడో మా ఏజెంట్ కూడా అంతే నచ్చుతాడు. సుబ్బు ఈ కథను మాకు చెప్పాడు. ఆయన ఒక్కసారి ఏదైనా స్క్రిప్ట్ చెబితే.. మళ్లీ మళ్లీ వినాల్సిన అవసరం లేదు. అంత పర్ఫెక్ట్‌గా చేస్తాడని మాకు నమ్మకం. దర్శకుడు అరుణ్ పవార్ గురించి అందరూ చెప్పారు. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే.. ఆయన అందరితో ఈజీగా కలిసిపోతారు. ఎంత కష్టమైన పనైనా కూడా సులభంగా చేసేస్తారు. హీరోయిన్లను కేవలం గ్లామర్ కోసమే తీసుకోలేదు. వారి పాత్రలు బాగుంటాయి. కెమెరామెన్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా అందరికీ థ్యాంక్స్. ఇది కచ్చితంగా నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ ఆహాలోకి రాబోతోంది. ఈ ప్రాజెక్ట్‌కి బ్యాక్ బోన్ అయిన ఎస్‌డీ గారికి థ్యాంక్స్’ అని అన్నారు.


ఇన్‌ఫినిటం ఎండీ ఎస్‌డీ మాట్లాడుతూ.. ‘ఈ ప్రాజెక్ట్ కోసం పని చేసిన గిరీష్‌కు, టీం మొత్తానికి థ్యాంక్స్. ఆహా లేకపోతే ఇదంతా జరిగేది కాదు. ఆహా టీంకు థ్యాంక్స్. అజిత్‌తో నాకు మంచి ఫ్రెండ్. ఆహాతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. షన్ను గురించి మీ అందరికీ చెప్పాలి. మా ఇద్దరిదీ ఒకే కాలేజ్. మాకు పదేళ్ల గ్యాప్ ఉంది. మేం ఇద్దరం కూడా బ్యాక్ బెంచ్ స్టూడెంట్లమే. షన్ను డ్యాన్సులు వేసేవాడు. నేను వేయించేవాడిని. యంగ్ ఏజ్‌లోనే ఈ క్రియేటివ్ వరల్డ్‌లోకి రావాలని అనుకున్నాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. ఈ స్థాయికి వచ్చాడు. ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. అరుణ్ అంటే సూర్య. సూర్య అనేది షన్ను బెస్ట్ వెబ్ సిరీస్.అలా ఈ ఇద్దరి అభిరుచులు కలిశాయి. ఇలాంటి వాళ్లు కలిసి పని చేస్తే రిజల్ట్ ఇంకా బాగా వస్తుంది. అరుణ్ కొంత చిలిపితనం ఉన్నా కూడా క్యూట్‌గా పని చేస్తాడు’ అని అన్నారు.


ఆహా సీఈవో అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘అల్లు అరవింద్ గారు ఇక్కడకు రావాలని అనుకున్నారు. కానీ ఈ ఈవెంట్ గురించి ఆయనకు తెలీదు. రషెస్ చూశాను. అద్భుతంగా వచ్చింది. ఇన్‌ఫినిటం నాకు రెండో ఆఫీస్‌‌లాంటిది. ఆహాను లాంచ్ చేసే సమయంలో షన్ను రావాల్సింది. ఆయనతో ఓ వెబ్ సిరీస్ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాం. ఇప్పుడు కుదిరింది. ఆయన స్క్రీన్‌కు సూపర్ స్టార్. ఈ జానర్‌ అంటే నాకు ఇష్టం. ఫస్ట్ డే షూటింగ్ చూసి చెప్పండని అన్నారు.. అలానే ఫస్ట్ డే షూట్ చేశాను. అద్భుతంగా ఉంది. ఎస్‌డీని ఆయన ఆఫీస్‌లో కలుసుకున్నాం. కరోనా సమయంలో జూమ్‌లో మాట్లాడుకున్నాం. 18 నెలల క్రితం ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించుకున్నాం. ఇలాంటి జానర్‌కు పది ఎపిసోడ్‌లు సరిపోవు. ఇంకా మున్ముందు మరింత కొత్త కంటెంట్‌తో ఎంటర్టైన్ చేస్తాం. ఇంకో వారంలోనే మీ ముందుకు రాబోతోంది. షన్నుకి, ఆయన టీంకు మీ ప్రేమను చూపించండి’ అని అన్నారు.


దర్శకుడు అరుణ్ పవార్ మాట్లాడుతూ.. ‘పని నేర్చుకుంటూ హ్యాపీగా ఉండాలని అనుకుంటే అందరూ ఇన్‌‌ఫినిటంలో జాయిన్ అయిపోండి. రాహుల్ ఒక సీఈవోలా కాకుండా ఓ బెస్ట్ ఫ్రెండ్‌లా ఉంటాడు. నాకు అవకాశం ఇచ్చిన వ్యాండీ మేడం, ఎస్‌డీ సార్‌కు థ్యాంక్స్. ఆ ఇద్దరూ ఒక్కటే. భారతీయుడులో సీనియర్ కమల్ హాసన్ లాంటి వారు. వర్షం పడుతుంటే పిల్లల ఆనందం కోసం.. ఐదు వందల నోట్లతో పడవలు చేస్తాడు. ఎస్‌డీ గారు కూడా అంతే. సెట్‌లో ఒక్క రూపాయిని కూడా జాగ్రత్తగా ఖర్చు పెడుతుంటారు. తక్కువ బడ్జెట్‌లో మంచి అవుట్ పుట్ ఎలా తీయాలో నాకు నేర్పించినందుకు థ్యాంక్స్. ఉదయమంతా కూడా క్లాస్ పీకినా.. సాయంత్రం అయితే బర్త్ డే పార్టీలు ఉంటే.. కార్డ్ ఇచ్చి వెళ్లిపోతారు. అంత మంచివారు. నాకు షన్నుతో పరిచయం లేదు. ఇన్‌ఫినిటంలోకి వచ్చినప్పుడు చూశాను. కళ్లతోనే నటిస్తుంటాడు. ఆయనతో పని చేయాలని అనుకునేవాడిని. కానీ మొహమాటం వల్ల అడగలేకపోయాను. ఓ సారి ఎస్‌డీ సర్, వ్యాండీ మేడం ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. వారు అడిగే లోపే చేస్తాను అని చెప్పాను. ఈ అవకాశం ఇచ్చిన ఎస్‌డీ  సర్, వ్యాండీ మేడం, ఆహా టీంకు థ్యాంక్స్. ఒక్కసారైనా ఒక్క షాట్‌లోనైనా షన్నుని కరెక్ట్ చేయాలని చూశాను. కానీ నాకు ఒక్క సారి కూడా అవకాశం ఇవ్వలేదు. అన్నీ సింగిల్ టేక్స్‌లోనే చేసేశాడు. డైరెక్టర్స్ యాక్టర్. అంత మంచి నటుడు. నాకు మళ్లీ మళ్లీ ఆయనతో కలిసి పని చేయాలని ఉంది. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్’ అని అన్నారు.


షణ్ముఖ్ జశ్వంత్ మాట్లాడుతూ.. ‘ఇదంతా నాకు కొత్తగా ఉంది. 2015లో హైద్రాబాద్‌కు వచ్చినప్పుడు ఇదంతా ఊహించలేదు. నాకంటూ ఇలా ఉంటుందని, టీజర్, ట్రైలర్, ఈవెంట్ ఉంటుందని అస్సలు ఊహించలేదు. ఇదంతా ఓ కలలా ఉంది. వైవా నుంచి నా సొంత చానెల్ మొదలుపెట్టి.. ఇన్‌ఫినిటంలో జాయిన్ అయి.. ఆహా వరకు రావడం పెద్ద ప్రయాణం అని అనుకోవచ్చు. నాకు ఎంతో నేర్పించింది ఈ ప్రయాణం. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. ఈ ప్రయాణంలో నాకు సుబ్బు బ్యాక్ బోన్‌లా ఉన్నాడు. 2015నుంచి మేం స్నేహితులం. రూమ్ మేట్స్‌మి కూడా. అతనికి థ్యాంక్స్ చెప్పాలి. నన్ను నమ్మి నాకు సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీకి థ్యాంక్స్. నన్ను భరిస్తున్నందుకు ఇన్‌ఫినిటంకు థ్యాంక్స్. నాకు, సుబ్బుకు మాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. మీరే మార్గం చూపించారు. మీరు ఎప్పటికీ గుర్తుంటారు. ఆహా టీంకు థ్యాంక్స్. మీ అందరితో పని చేయడం ఆనందంగా ఉంది. ఆహాలో పని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సుబ్బుతో నాకు అలవాటైంది. అరుణ్ పవార్ ఎలా ఉంటారో అనుకున్నారు. అరుణ్ పవార్ పేరు సింకేశ్. ఎవరితోనైనా సరే అలా సింక్ అయిపోతాడు. నేను స్క్రీన్ మీద అలా కనిపించడానికి టీం చాలా కష్టపడింది. అరుణ్‌కు థ్యాంక్స్. సుబ్బు తరువాత నాకు అరుణ్ మీదే ఎక్కువ నమ్మకం కలిగింది. అలంకృత తన పాత్రకు కరెక్ట్‌గా సెట్ అయింది. ఆమె చక్కగా నటించింది. వైశాలీ గారితో నాకు ఎప్పుడూ గొడవలు అవుతూనే ఉంటాయి. స్క్రిప్ట్‌లో కూడా అలానే ఉంది. డాన్, పృథ్వీ అందరూ బాగా నటించారు. పృథ్వీకి నా గురించి అంతా తెలుసు. నన్ను భరిస్తుంటాడు. నా ఏడుపు సీన్లంటే వాడు కూడా డార్క్ రేూంలో ఉంటాడు. మా డీఓపీ ధనుష్ గారు అద్భుతంగా చూపించారు. అది నేనేనా? అనుకున్నా. ఆయన అద్భుతంగా చూపించారు. బాలు గారు అద్భుతంగా సెట్‌లు వేశారు. గీతం నుంచి హరిప్రియ నాకు మంచి ఫ్రెండ్. మంచి క్యాస్టూమ్స్ ఇచ్చారు. నాకు చాలా బాగా నచ్చాయి. కార్తీక్ బాగా ఎడిట్ చేశారు. అజయ్ ఇచ్చిన ట్రాక్ వింటూ జిమ్‌లో వర్కవుట్లు చేశాను. ఏదో కవర్ సాంగ్‌లు చేసుకుంటూ ఉండే నాలాంటి వాడికి ఓ బ్యాక్ గ్రౌండ్ స్కోరా? అని అనుకున్నాను. ఎంతో బాగుంది. మా ఫైట్ మాస్టర్‌కి థ్యాంక్స్. ఇంత వరకు నేను పరిగెత్తలేదు. సుబ్బు ఆ చాన్స్ ఇవ్వలేదు. మోహన్ రావ్ పాత్రలో బాలకృష్ణ గారు అద్భుతంగా చేశారు. ఇక్కడకు వచ్చిన ఇంఫ్లూయెన్సర్స్‌ అందరికీ థ్యాంక్స్. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. నేను ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. మీరు నాకు సపోర్ట్‌గా ఉంటూనే వస్తున్నారు. నాకు చేయాలని ఉంటుంది. మీరిచ్చే ప్రోత్సాహంతోనే ఇంకా ఇంకా బాగా నటించాలని అనుకుంటున్నాను. ఏజెంట్‌ ఆనంద్ సంతోష్‌ను అందరూ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ లేకపోతే ఇక్కడ ఇలా ఉండను.. ఇలా స్టేజ్ మీద నిల్చోలేను. మైక్ పట్టుకోలేను. అందరికీ థ్యాంక్స్’ని అన్నారు.


మెరామెన్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ‘నాకు తెలుగు అంతగా రాదు. నేను భాషను చంపాలనుకోవడం లేదు. నేను చెప్పదల్చుకున్నది అందరికీ అర్థమయ్యేలా చెబుతాను. అరుణ్ టెక్నికల్‌గా ఎంతో బ్రిల్లియంట్. ముందు ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చినప్పుడు అసలేంటి అనేది తెలియదు. ఆ తరువాత కథ నాకు తెలిసింది. మొదటి రోజు లైట్ సెట్ చేశాను. కానీ ఏదో మిస్ అయినట్టు అనిపించింది. కానీ షన్ను అడుగుపెట్టాక అర్థమైంది.. మిస్ అయింది అతనే అని. అంతకు ముందు ఆయన నటించిన కొన్ని కొన్ని సీన్లు చూశాను. ఇది చాలా గ్రేట్ టీం. ఆయన నటనను చూసి ఫిదా అయ్యాను. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉంది’ అని అన్నారు.


ఎడిటర్ కృష్ణకార్తీక్ మాట్లాడుతూ.. ‘నేను షన్నుతో మూడేళ్ల నుంచి ట్రావెల్ అవుతూ వస్తున్నాను. సాఫ్ట్‌వేర్ డెవ్‌లవ్‌పర్ నుంచి పని చేస్తున్నాను.  ఈ ప్రాజెక్ట్‌కు పిలుస్తారా? లేదా? అని అనుకున్నాను. కానీ చివరకు పిలిచారు. ఆహాలో ఇది నాకు మొదటి ప్రాజెక్ట్. ఇంకా మరిన్ని ప్రాజెక్ట్‌లు చేయాలని అనుకుంటున్నాను’ అని అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ మాట్లాడుతూ.. ‘నేను సూర్య వెబ్ సిరీస్‌కు పని చేశాను. ఇందులో అయితే పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చేస్తున్నాం. మ్యూజిక్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని అన్నారు.


బిగ్ బాస్ విశ్వ మాట్లాడుతూ.. ‘కొన్ని పోస్టర్లు చూస్తుంటే షన్ను నాకు సూర్యలా కనిపిస్తున్నాడు. బిగ్ బాస్ ఇంట్లో కలిసి ప్రయాణం చేశాం. షన్ను ఎంతో మెచ్యూర్డ్ అయ్యాడు. షన్నుని ఇలా చూడటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.


బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘బాలాదిత్య వల్ల నేను ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను. షణ్ముఖ్ అద్భుతంగా నటించాడు. ఇందులో నా పాత్ర చుట్టే కథ అంతా తిరుగుతుంది. మీ ఏజెంట్ షన్నుయే కాదు నేను కూడా ఉన్నాననే గుర్తు పెట్టుకోండ’ని అన్నారు.


హీరోయిన్ వైశాలీ మాట్లాడుతూ.. ‘ఈ ప్రాజెక్ట్‌లో నాకు అవకావం ఇచ్చిన ఎస్.డీ సార్‌కు థ్యాంక్స్. షణ్ముఖ్ ఎంతో సహకరించారు. కెమెరా ముందు ఎలా ఉండాలి.. ఎలా నటించాలి అని సలహాలు ఇచ్చారు. నాకు యాక్టింగ్ నేర్పించిన గురువు బాలరాజ్ గారు. ఆయన వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. ధనలక్ష్మీ పాత్రలో నన్ను త్వరలోనే మీరు చూస్తారు’ అని అన్నారు.


హీరోయిన్ అలంకృత మాట్లాడుతూ.. ‘నేను ఓ ఈవెంట్‌ చేస్తుంటే.. కౌశిక్ గారు నన్ను చూసి ఈ పాత్రకు బాగుంటానని అనుకున్నారు. కౌశిక్, ఆదిత్య గారి వల్ల ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను. ఇందులో కూడా నా పాత్ర పేరు కూడా అలంకృత. షణ్ముగా గారితో నటించాలా? అని ముందు చాలా  భయపడ్డాను. కానీ ఆయన ఎంతో సహకరించారు. నాకు ఈ పాత్రను ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్’ అని అన్నారు.


Share this article :