Home » » Taraka Ratna-Madhu Shalini interview about 9 Hours Web series

Taraka Ratna-Madhu Shalini interview about 9 Hours Web series

 డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ "9 అవర్స్" వెబ్ సిరీస్ మిమ్మల్ని

ఆకట్టుకుంటుంది - హీరో తారకరత్న, హీరోయిన్ మధు షాలినీ




ప్రముఖ దర్శకుడు క్రిష్ షో రన్నర్ గా వ్యవహరిస్తున్న వెబ్ సిరీస్ "9

అవర్స్". డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీ ఈ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ను

స్ట్రీమింగ్ కు తీసుకొస్తోంది. తారకరత్న, అజయ్, వినోద్ కుమార్, మధు

షాలినీ, రవి వర్మ, ప్రీతి అస్రానీ తదితరులు కీలక పాత్రల్లో

నటిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి

వై, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ కు నిరంజన్ కౌషిక్,

జాకోబ్ వర్గీస్ దర్శకత్వం వహించారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ

వెబ్ సిరీస్ జూన్ 2 తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ వెబ్

సిరీస్ విశేషాలను హీరో తారకరత్న, హీరోయిన్ మధు షాలినీ తెలిపారు.


తారకరత్న మాట్లాడుతూ...9 అవర్స్ వండరఫుల్ వెబ్ సిరీస్. ఒక రోజులో 9

గంటల్లో ఏం జరిగింది అనేది ఎపిసోడ్ వైజ్ చూపిస్తున్నాం. ఈ వెబ్ సిరీస్ ను

హీరోలా ఒక పాత్ర లీడ్ చేయదు. ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి

పాత్రలో ఒక భావోద్వేగం కనిపిస్తుంది. ఈ అంశాలు నాకు బాగా నచ్చాయి.

బ్యాంక్ దొంగతనం అనేది దీంట్లో ఒక భాగం మాత్రమే. కథలో ఇంకా కొత్త విషయాలు

ఉంటాయి. దర్శకులు నిరంజన్, జాకోబ్ ఇద్దరిలో మంచి ప్రతిభ ఉంది. వాళ్లతో

పనిచేయడాన్ని ఎంజాయ్ చేశాను. నా పాత్ర నుంచి ఎలాంటి ఎమోషన్ కావాలో వాళ్లు

బాగా రాబట్టుకున్నారు. ఈ పాత్రలో నటించేందుకు నాకెలాంటి చాలెంజ్ ఎదురు

కాలేదు. స్క్రిప్టు పక్కాగా ఉంది, దర్శకుల్లో క్లారిటీ ఉంది కాబట్టి

నటుడిగా నా పని సులువైంది. ఈ వెబ్ సిరీస్ లో ఎక్కడా అసభ్యత ఉండదు,

కుటుంబమంతా కలిసి చూడొచ్చు. ఒకేసారి మొత్తం వెబ్ సిరీస్ చూసేంత

ఆసక్తికరంగా ఉంటుంది. మహేష్ బాబు త్రివిక్రమ్ చిత్రంలో నేను

నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆ సినిమాలో అవకాశం వస్తే

అదృష్టంగా భావిస్తా. అన్నారు.



మధు షాలినీ మాట్లాడుతూ...ఈ వెబ్ సిరీస్ లో నేను చిత్ర అనే జర్నలిస్ట్

పాత్రలో నటిస్తున్నాను. ఈ కథ 80 దశాబ్దం నేపథ్యంలో సాగుతుంది. అప్పట్లో

మహిళా జర్నలిస్టులు చాలా తక్కువ. ఆ కాలంలో అమ్మాయి జర్నలిస్ట్ అంటే ఎలా

చూసేవారో ఊహించుకోవచ్చు. నా క్యారెక్టర్ తనకు అనిపించింది మొహమాటం

లేకుండా చెప్పేస్తుంది. అలాంటి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి జర్నలిస్ట్

అయితే కెరీర్ లో తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఇలాంటి అంశాలు నా పాత్రను

బ్యూటిఫుల్ గా మార్చాయి. పీరియాడిక్ కథలో నటించడం కొత్త అనుభవాన్ని

ఇచ్చింది. అప్పట్లో మన జీవన శైలి, అనుబంధాలు ఇలా ఉండేవి కావు. వాటిని

ప్రతిబింబించేలా నటించాను. దర్శకుడు నిరంజన్ కూడా గతంలో ఒక జర్నలిస్టుగా

పనిచేశారు. ఆయన అనుభవాలు నాకు చెప్పారు. రిపోర్టర్ ఎలా పనిచేస్తారో

తెలుసుకున్నాను. క్రిష్ గారి సినిమాలు ఎంతో బాగుంటాయి. ఆయనతో పనిచేయాలని

ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఈ వెబ్ సిరీస్ కోసం ఆయన దగ్గర నుంచి పిలుపు

వచ్చినప్పుడు నమ్మలేకపోయాను. ఈ కథను ఆయన ఎంతో సహజంగా రాశారు. అన్నారు.


Share this article :