Home » » Surabhi 70mm (Hittu Bomma) Releasing on 18th February

Surabhi 70mm (Hittu Bomma) Releasing on 18th February

 ఆకట్టుకుంటున్న"సురభి 70 ఎంఎం(హిట్టు బొమ్మ )" ట్రైలర్, ఈ నెల 18న సినిమా విడుదల



అనిల్ కుమార్, వినోద్ నాగులపాటి, ఉషాంజలి, అక్షిత, శ్లోక, మహేష్

ఎడ్లపల్లి , చంద్రకాంత్ , యోగి , అనీష్ తదితరులు నటించిన సినిమా "సురభి

70 ఎం ఎం (హిట్టు బొమ్మ)". ఈ చిత్రాన్ని బాబీ ఫిలిమ్స్ , జె ఎస్ ఆర్

పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. కెకె చైతన్య నిర్మాణంలో దర్శకుడు

గంగాధర వై కె అద్వైత ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శేషి రెడ్డి జంగా సహ

నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "సురభి 70ఎంఎం (హిట్టు

బొమ్మ)" సినిమా ఈ నెల 18న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు

సిద్ధమవుతోంది. తాజాగా చిత్ర ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత సూర్యదేవర

నాగవంశీ విడుదల చేశారు. చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు.


సురభి 70ఎంఎం హిట్టుబొమ్మ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ప్రేమికులకు తాజ్

మహాల్ ఎలాగో ఈ సురభి 70ఎంఎం కూడా అలాగేనని చెబుతూ ట్రైలర్

ప్రారంభమైంది.ఈవెంట్ మేనేజర్ గా అక్షత శ్రీనివాస్, తండ్రితో తిట్లు తినే

నిరుద్యోగి పాత్రలో వినోద్ కనిపించారు. సురభి 70ఎంఎం థియేటర్ ను

దక్కించుకునే ప్రయత్నంలో అనుబంధం ఒకవైపు, వ్యాపారం మరోవైపు పోటీపడతాయి. ఈ

పోటీలో కథ ఆసక్తికర మలుపులు తిరిగినట్లు ట్రైలర్ లో తెలుస్తోంది. అదేంటి

అనేది ఈనెల 18న థియేటర్ లలో చూడాలి.


ట్రైలర్ విడుదల సందర్భంగా నిర్మాత కెకె చైతన్య మాట్లాడుతూ..సహజ మైన

పాత్రలతో ఫ్రెష్ ఫీల్ తో ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతుంది.అని

అన్నారు.


టెక్నికల్ టీమ్:

పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా

సినిమాటోగ్రఫీ: శేఖర్ , గోపాల్ ఎస్ ఎస్ వి , భరత్ సి కుమార్

ఎడిటర్ : నాగిరెడ్డి , కంజర్ల యాదగిరి

మ్యూజిక్: డెన్నిస్ నార్టన్

సహా నిర్మాత : శేషి రెడ్డి జంగా

నిర్మాత: కె కె చైతన్య

రచన-దర్శకత్వం: గంగాధర వై కె అద్వైత.



Share this article :