Home » » Manchi Rojulu Vachayi Special Show in Bhimavaram on Prabhas Fans Request

Manchi Rojulu Vachayi Special Show in Bhimavaram on Prabhas Fans Request

 ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక మేరకు భీమవరంలో 'మంచి రోజులు వచ్చాయి' సినిమాకు స్పెషల్ ప్రీమియర్స్..



యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా వరస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా మంచి రోజులు వచ్చాయి. దీపావళి సందర్భంగా నవంబరు 4న మంచి రోజులు వచ్చాయి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మధ్యే విడుదలైన రిలీజ్ ట్రైలర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు.  తాజాగా ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ పై అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే వైజాగ్, ఏలూరు, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు తదితర నగరాల్లో పేయిడ్ ప్రీమియర్ ఏర్పాటు చేశారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్ పై భీమవరంలో కూడా షో వేస్తున్నారు. 

ఈ స్పెషల్ ప్రీమియర్ బుకింగ్ ఓపెన్ అయిన వెంటనే టికెట్స్ అన్నీ అయిపోయాయి. మిగిలిన చోట్ల కూడా పేయిడ్ ప్రీమియర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. వీటితో పాటు హైదరాబాద్, కడపలో కూడా ఎక్స్ ట్రా షోలు వేస్తున్నారు. హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్ లో స్క్రీన్స్ పెంచే అవకాశం కూడా కనిపిస్తోంది. కేవలం ప్రీమియర్స్ తోనే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. రెస్పాన్స్ చాలా బాగా ఉండటంతో సినిమాకు మరింత కలిసి రానుంది. సందేశం, వినోదం కలిపి ఇవ్వడంలో దర్శకుడు మారుతి ఆరితేరిపోయారు. దానికి తోడు మహానుభావుడు లాంటి సూపర్ హిట్ తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను వి సెల్యులాయిడ్ SKN నిర్మిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్ కి సూపర్ రెస్పాన్స్ రావడంతో పాటు బుకింగ్స్ కు కూడా అద్భుతమైన స్పందన వస్తుంది. దాంతో భారీ అంచనాల మధ్య దీపావళికి మంచి రోజులు వచ్చాయి విడుదలవుతుంది. 


నటీనటులు: సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్, అజయ్ ఘోష్ తదితరులు..


టెక్నికల్ టీం: 

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: మారుతి

నిర్మాత: వి సెల్యూలాయిడ్ SKN 

బ్యానర్స్: యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్

సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్

సంగీతం: అనూప్ రూబెన్స్

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్


Share this article :