T Series Bhadrakali Pictures Prabhas 25 Spirit Announced

 T సిరీస్, భ‌ద్ర‌కాళీ పిక్చ‌ర్స్ బ్యానర్స్ పై సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా రెబల్ స్టార్ ప్రభాస్ 25వ సినిమాగా రానున్న‌ 'స్పిరిట్'.. 

 


గత కొన్ని రోజులుగా రెబల్ స్టార్  ప్రభాస్ 25వ సినిమా గురించి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పుడు దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. రెబల్ స్టార్ ప్రభాస్ తన 25వ సినిమాను పాన్ ఇండియన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయబోతున్నారు. దీనికి 'స్పిరిట్' అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన దర్శక నిర్మాతల నుంచి విడుదలైంది. అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి.. ఆ తర్వాత అదే సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో రీమేక్ అక్కడా సంచలన విజయం అందుకున్నారు. ఇప్పటి వరకు రెబెల్ స్టార్ ప్రభాస్‌ను అభిమానులు కనీసం ఊహించనటువంటి కొత్త పాత్రలో సందీప్ రెడ్డి వంగా చూపించబోతున్నారు. పాన్ ఇండియన్ స్థాయిలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రాబోతుంది. టి సిరీస్, భ‌ద్ర‌కాళీ పిక్చ‌ర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు.  ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో బిజీగా ఉన్నారు.  ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

Post a Comment

Previous Post Next Post