Home » » ICON STAR Allu Arjun to Launch PUSHPAKA VIMANAM Trailer on Oct 30th

ICON STAR Allu Arjun to Launch PUSHPAKA VIMANAM Trailer on Oct 30th

 ఈ నెల 30న 'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్ రిలీజ్ చేయనున్న ఆనంద్ దేవరకొండ

"పుష్పక విమానం" ట్రైలర్




యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం "పుష్పక విమానం" ట్రైలర్

ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ నెల 30న "పుష్పక

విమానం" సినిమా ట్రైలర్ విడుదల వేడుక హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుంది.

ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరవుతున్నారు అల్లు అర్జున్. బన్నీ చేతుల

మీదుగా ట్రైలర్ రిలీజ్ అవడం "పుష్పక విమానం" యూనిట్ మొత్తానికి

సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో టీమ్ అంతా కలిసి థాంక్యూ బన్నీ

అన్నా అంటూ సెలబ్రేట్ చేసుకున్నారు.


"పుష్పక విమానం" సినిమా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సురేష్

ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్, ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలింస్ సంస్థలు ఈ

చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి.


"పుష్పక విమానం" చిత్రాన్ని నూతన దర్శకుడు దామోదర తెరకెక్కించారు.

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని 'కింగ్ అఫ్ ది

హిల్' ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా

నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ మట్టపల్లి ,ప్రదీప్

ఎర్రబెల్లి లు నిర్మాతలు


టెక్నికల్ టీమ్: సమర్పణ : విజయ్ దేవరకొండ, పి.ఆర్.వో: జి.ఎస్.కె

మీడియా,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అనురాగ్ పర్వతనేని, సినిమాటోగ్రఫీ:

హెస్టిన్ జోస్ జోసెఫ్, ఆర్ట్ డైరెక్టర్ : నీల్ సెబాస్టియన్, ఎడిటర్ :

రవితేజ గిరిజాల, మ్యూజిక్: రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్

దాసాని, కాస్టూమ్స్ : భరత్ గాంధీ, నిర్మాతలు:  గోవర్ధన్ రావు దేవరకొండ,

విజయ్ మట్టపల్లి , ప్రదీప్ ఎర్రబెల్లి, రచన-దర్శకత్వం: దామోదర.



Share this article :
 
Copyright © 2015. TeluguCinemas.in | Telugu Cinemas - All Rights Reserved
Thank You Visit Again