Home » » Jaathiya Rahadhari Lyrical Song Launched by B Gopal

Jaathiya Rahadhari Lyrical Song Launched by B Gopal


 జాతీయ రహదారి మూడవ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన దర్శకసంచలనం బి.గోపాల్


"సమరసింహరెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర" వంటి ఇండస్ట్రీ హిట్స్ కలిగిన దర్శకసంచలనం బి.గోపాల్... "జాతీయ రహదారి" చిత్రంలోని మూడవ పాటను విడుదల చేశారు.  భీమవరం టాకీస్ పతాకంపై శతాధిక చిత్రనిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నరసింహ నంది దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

     దర్శకుడు బి.గోపాల్  మాట్లాడుతూ.. నరసింహ నంది నా దగ్గర చాలా సినిమాలకు కో డైరెక్టర్ గా పని చేశాడు. అనేక జాతీయ అవార్డు సినిమాలు తీశారు. అలాగే ఇప్పుడు తీసిన జాతీయ రహదారి  ట్రైలర్ చూశాను చాలా బాగుంది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. రామసత్యనారాయణ అలుపెరగని నిర్మాత. సినిమా వెనుక సినిమా తీస్తూనే ఉంటాడు. నాకు దర్శకుడుగా జీవితాన్ని ఇచ్చిన మా రామానాయుడు గారు 150 సినిమాలు తీశారు. ఆ బాటలోనే రామసత్యనారాయణ సినిమాలు తీస్తాడు. అందరికి అందుబాటులో ఉంటాడు ఏమి గర్వం లేదు. ఈ వయసులో కూడా అంత ఓపిక, ధైర్యం ఉండండం మాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. జాతీయ రహదారి వంటి మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న తనకు ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి" అన్నారు.


 *చిత్ర నిర్మాత తుమ్మల రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. బి.గోపాల్ గారు నెంబర్ 1 యాక్షన్ డైరెక్టర్...ఆయన చేతులు మీదుగా ఈ రోజు 3వ లిరికాల్ సాంగ్ విడుదల కావడం గర్వంగా ఉంది. ఆయన శిష్యుడు నరసింహ నంది  సెపరేట్ పంథాలో హార్ట్ టచింగ్ కథలను సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేస్తుంటాడు. గతంలో "1940 లో ఓ గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జ" లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశాడు. నేను ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు తీశాను కానీ అవార్డు వచ్చే సినిమాలు తీయలేదనే బాధ ఉండేది. ఇంత కాలానికి జాతీయ రహదారితో ఆ కోరిక తీరనుంది.  కరోనా టైంలో నా బాద్యతను కూడా తనే తీసుకొని సినిమా చేశాడు. సినిమా చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ట్రైలర్ చూసిన వి.వి.వినాయక్ గారు, విజయేంద్ర ప్రసాద్ గారు, యండమూరి వీరేంద్రనాథ్ గార్లు తనని అభినందించారు. ట్రైలర్ కూడా చూడటానికి కూడా ఇష్టపడని రాంగోపాల్ వర్మకు ఈ ట్రైలర్ నచ్చి... చాలా బాగుంది అని డైరెక్టర్ ను పిలిపించుకుని అభి నందించారు. ఇంతమంది పెద్దలు ఈ సినిమాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు అంటే ఈ సినిమా ఇప్పటికే 50 % సక్సెస్ అయ్యిందని అనుకుంటున్నాను. ఈ నెల 10వ తేదీన వినాయక చవితి కానుకగా రెండు తెలుగు రాష్ట్రాలలో 200 థియేటర్స్ లో విడుదల చేస్తున్నాం" అని అన్నారు.


నరసింహ నంది మాట్లాడుతూ... అందరూ వెళ్లే దారి లో  కాకుండా కొత్త దారిలో వెళ్ళాలి అని అనేవారు. అదే జాతీయరహదారి. గోపాల్ గారి ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉంటాయి. మల్లిక్ రాసిన పాటకు సుబ్బు స్వరాలు కూర్చారు" అన్నారు!!

 *_నటి నటులు:_* 

మధు చిట్టె, సైగల్ పాటిల్ , మమత, ఉమాభారతి, మాస్టర్  నందిరెడ్డి. ధక్షిత్ రెడ్ది, అభి, తెల్జెరు మల్లెష్, తరని, గోవిందరాజు, ఘర్షణ శ్రీనివాస్., విజయ భాస్కర్, సిద్దిపెట రవి తదితరులు.


 *సాంకెతిక వర్గం :* 

సినిమాటొగ్రఫి :- యస్ మురలి మొహన్ రెడ్డి,

సంగీతం :- సుక్కు,

పాటలు :;- మౌన శ్రీ మల్లిక్, 

ఎడీటర్ :; వి నాగిరెడ్డి, 

నిర్మాత :- తుమ్మలపల్లి రామసత్యనారాయణ.,

రచన దర్శ కత్వం :; నరసింహ నంది...

సమర్పణ.:- సంధ్య స్టూడియోస్ రవి కనగాల.

పి.ఆర్.ఓ :- మధు వి.ఆర్


Share this article :
 
Copyright © 2015. TeluguCinemas.in | Telugu Cinemas - All Rights Reserved
Thank You Visit Again