Home » » Sridevi Soda Center Naalo innaluga song Released

Sridevi Soda Center Naalo innaluga song Released

శ్రీదేవి సోడా సెంటర్" నుంచి నాలో ఇన్నాళ్ళుగా కనిపించని ఎదో ఇది  అంటున్న సూరిబాబు

 


 

క‌థ‌ల‌కి మాత్ర‌మే ప్రాధాన్య‌త ఇచ్చే హీరోల్లో సుధీర్ బాబు ఒక‌డుగు ముందే వుంటారు. ఈ సారి సుదీర్‌బాబు శ్రీదేవి సోడా సెంట‌ర్ అనే స‌రికొత్త కాన్సెప్ట్ చిత్రం తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. ఈ చిత్రం లో శ్రీదేవి గా  ఆనంది ప్రధాన పాత్రల్లో  న‌టిస్తుంది. ఈ సినిమాని పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి  ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, సూరిబాబు, శ్రీదేవి గ్లింప్స్ లు సూప‌ర్  రెస్పాన్స్ అందుకున్నాయి.  అలాగే మణిశర్మ అందించిన మందులోడా ఓరి మాయ‌లోడా అనే సాంగ్ నెటిజ‌న్స్ ని వూపేస్తుంది. దీని మీద రీల్స్‌, క‌వ‌ర్ సాంగ్స్ ని యూత్ సోష‌ల్ మీడియాలో చేస్తున్నారు. మ‌రి సూరిబాబు, శ్రీదేవి ల మ‌ద్య ల‌వ్ అండ్ రొమాంటిక్ మూమోట్స్ వుండాలిగా.. అందుకే  మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ గారికి తొడుగా ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్ట్రి గారు త‌మ క‌లాన్ని క‌లిపారు. ఇద్ద‌రు లెజెండ్స్ క‌లిసాక ఆ పాట‌కి అందం రాకుండా ఎలావుంటుంది. ఈ పాట‌ని ప్ర‌ముఖ సింగ‌ర్స్ దిన‌క‌ర్‌, ర‌మ్య బెహ్ర లు ఆల‌పించారు. ఇంత మంచి  పాటకి ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. . సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతమైన సాహిత్యం ఈ పాటను మరో స్థాయికి చేర‌డ‌మేకాకుండా  శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ విజువ‌ల్స్ ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి.  ఈ సినిమాకి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.


"నాలో ఇన్నాళ్ళుగా కనిపించని ఎదో ఇది…


లోలో కొన్నాళ్లుగా నాతో ఎదో అంటున్నది


అదో ఇబ్బందిగా అనిపించినా



 

అది కూడా బానే ఉంది


మరే కన్నెర్రగా కసిరేసినా…చిరునవ్వులా ఉందే…


తానా తందానా మహదానందనా…మనసే చిందేయ్యగా


తానే అందేనా ఏంతో దూరాన…ఉండే ఆ తారక


నాలో ఇన్నాళ్ళుగా కనిపించని ఎదో ఇది…


లోలో కొన్నాళ్లుగా నాతో ఎదో అంటున్నది


కొంచెం గమనించదేం దరిదాపులోనే తారాడినా


వైనం గురుతించడేం కనుబొమ్మతోనే కబురంపినా


ఎలా చెప్పాలో వయసెమందో


ఎలా చూపాలో రహస్యం ఏదో


ఇదేమి చిక్కో…నువ్వే కనుక్కో


తెగిస్తా…వరిస్తా


మరెందుకి పరాకానీ


లేపే కిరణాల పిలుపే తొలిమెలు



 

కోలుపై నను గిల్లాగా…


తానా తందానా…మహదానందనా


మనసే చిందేయ్యగా…


నాలో ఇన్నాళ్ళుగా కనిపించని ఎదో ఇది


లోలో కొన్నాళ్లుగా నాతో ఎదో అంటున్నది


పోన్లే పాపం అని దరిదాటి రానా నది హోరుగా


సర్లే కానిమ్మని చుట్టేసుకోనా మహాజోరుగా


ఆలా కాకుంటే మరో దారుందా


ఇలా రమ్మంటే కలే రానంద


తయారైయుందా తధాస్తు అందాం


అటైనా ఇటైనా చేరే వీడి హడావిడి



 

తరిమే తోలి వాన చినుకు మురిపాల


మునకో నను అల్లగా…


తానా తందానా మహదానందనా


మనసే చిందేయ్యగా…


తానే తందానే తానే తననానే తానే తననానే నా


తానే తందానే తానే తననానే తానే తననానే నా"




నటీనటులు:

సుధీర్ బాబు, ఆనంది , ప‌వెల్ న‌వ‌గీత‌మ్‌,న‌రేష్‌, ర‌ఘుబాబు, అజ‌య్‌, స‌త్యం రాజేష్, హ‌ర్హ వ‌ర్ద‌న్‌, స‌ప్త‌గిరి, క‌ళ్యణి రాజు, రొహిణి, స్నేహ గుప్త త‌దిత‌రులు



టెక్నికల్ టీం:

ర‌చ‌న‌-దర్శకత్వం: కరుణ కుమార్

నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి

బ్యానర్: 70mm ఎంటర్టైన్మెంట్స్

ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: శ్యామ్ దత్ సైనుద్దీన్

సంగీతం: మణిశర్మ

ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్‌ప.. రామ‌కృష్ణ‌- మౌనిక‌

క‌థ‌.. నాగేంద్ర కాషా

కొరియొగ్రాఫ‌ర్స్‌.. ప్రేమ్ ర‌క్షిత్‌, విజ‌య్ బిన్ని, య‌శ్వంత్‌

యాక్ష‌న్‌.. డ్రాగ‌న్ ప్ర‌కాష్‌, కె ఎన్ ఆర్ (నిఖిల్‌) , రియ‌ల్ స‌తీష్

లిరిక్స్‌.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి, క‌ళ్యాణ చ‌క్ర‌వ‌ర్తి, కాస‌ర్ల శ్యామ్‌


పి ఆర్ ఓ: ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్‌


 


Share this article :