Home » » Ksheera Sagara Madhanam Review

Ksheera Sagara Madhanam Reviewక్షీర సాగర మథనం 


మానస్,  చరిష్మా శ్రీకర్, గౌతమ్ శెట్టి, ప్రియాంత్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు   ముఖ్య పాత్రలు  పోషించిన ఈ వినూత్న కథాచిత్రాన్ని 


శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ పతాకంపై డెబ్యూ డైరెక్టర్ అనిల్ పంగులూరి నిర్మించారు సంగీతం: అజయ్ అరసాడ, ఛాయాగ్రహణం: సంతోష శానమోని,రచన-దర్శకత్వం: అనిల్ పంగులూరిమానస్ నాగులపల్లి,  నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో అక్షత సోనావని హీరోయిన్. ప్రదీప్ రుద్ర విలన్ గా నటించారు. 


కష్టాలకు భయపడి ఆగిపోతే జీవన మకరందాన్ని ఆస్వాదించలేం… జీవితంలో ఏమీ సాదించలేమనే మెసేజ్ తో వచ్చిన ఈ సినిమా  ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకుందో తెలుసుకుందాం 


కథ: రిషి(మానస్ నాగులపల్లి), ఓంకార్(సంజయ్ కుమార్) మరో ముగ్గురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను ఓ పార్టీకి పిలిచి... విలన్(ప్రదీప్ రుద్ర) వారి శరీరంలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన ఓ డివైజ్ ను అమర్చి... ఆ ఐదు మందిని మానవ బాంబులుగా మార్చి... భారీ పేలుడుకు పక్కా ప్లాన్ వేస్తాడు. ఈ ఐదుగురు కూడా వాళ్ల వాళ్ల సొంత సమస్యలతో బాధపడుతూ... వుండగా.. ఈ మానవ బాంబుగా మారిపోయామని తెలుసుకుని చివరకు ఏమి చేశారన్నదే మిగతాకథ. 


ప్లస్ పాయింట్స్ 


కథ, కథనం

దర్శకత్వం

నిర్మాణ విలువలు

సంగీతంహీరో మానస్ హీరో సంజయ్ అద్భుతమైన నటన తో ప్రేక్షకులను అలరించారు 


ఏడు పాత్రల భావోద్వేగాలతో ముడిపడిన ఈ చిత్రం..

ఆద్యంతం చాలా ఉత్కంఠగా సాగుతుంది  ప్రేక్షకుల్ని ఆలోచింప జేసేలా ముందుకు వెళుతూ వుంటుంది.  అమ్మాయిల క్యారెక్టర్ పై నేటి సమాజంలో  ఆలోచన ఎలా వుంది  నేటి సాఫ్ట్ వేర్ వుద్యోగుల పని ఒత్తిడినీ 


ఇలా రకరకాల విషయాలను ఈ సినిమా లో చూపించారు 

ఇంకా ఎన్నో విషయాలను  ఎంతో గ్రిప్పింగ్ కథ.. కథనాలతో ముందుకు నడిపించి.. ప్రేక్షకులను ఉత్కంఠతకు లోను అయ్యేలా చేశారు దర్శకుడు అనిల్ పంగులూరి. 


తను చెప్పాలనుకున్న విషయంలో ఎక్కడా డీవియేట్ కాకుండా తెరమీద చూపించడంలో సక్సెస్ అయ్యారు. ఎన్ని కష్టాలొచ్చినా... వాటిని ధైర్యంగా ఫేస్ చేసి ముందుకు సాగాలనే కాన్సెప్ట్ తో కథ.. కథనాలను నడిపించిన తీరు.. కొంత ఎంటర్టైనింగ్ గానూ... భావోద్వేగాలతోనూ నడిపించారు. 


ఫస్ట్ హాఫ్ లో కొంత ల్యాగ్ వున్న... సెకెండ్ హాఫ్ చాలా వేగంగా ముందుకు సాగుతుంది.దర్శకుడు అనిల్ ఈ చిత్రాన్ని తన సాఫ్ట్ వేర్ మిత్ర బృదం ప్రోత్సాహంతో తెరకెక్కించారు. దర్శకుడు ఎంచుకున్న కథ.. కథనాలు బాగున్నాయి. 


ఈ చిత్రం అతనికి డెబ్యూనే అయినా... మంచి గ్రిప్పింగ్ గా తెరకెక్కించారు. . దర్శకుడి ప్రతిభకు సినిమాటోగ్రఫీ.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్  అదనపు బలం. దర్శకుడి విజువలైజేషన్ కు వీరు ప్రాణం పోసారు. దాంతో సినిమా రిచ్ గా కనబడుతుంది. ఎడిటింగ్ బాగుంది. . ఖర్చుకు వెనకాడకుండా సినిమాను రిచ్ గా నిర్మించారు.ఫైనల్ గా క్షీర సాగర మథనం మీకు ఓ మంచి అనుభూతిని కలిగిస్తుంది రేటింగ్: 3.25/5


Share this article :
 
Copyright © 2015. TeluguCinemas.in | Telugu Cinemas - All Rights Reserved
Thank You Visit Again