Home » » Bommala Koluvu Trailer Launched by Kona venkat and Bvs Ravi

Bommala Koluvu Trailer Launched by Kona venkat and Bvs Ravi

 ‘బొమ్మల కొలువు’ ట్రైలర్ విడుదల చేసిన కోన వెంక‌ట్, బి.వి.ఎస్‌.ర‌వి



సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన సెన్స్టేషనల్ మ్యూజిక్ కంపోజర్ అనిరుద్‌ రవిచంద్రన్ కజిన్ రిషికేశ్ . ..‘రఘువరన్ బి.టెక్‌’తో సినీ ఇండస్ట్రీ లో అరంగేట్రం చేశారు.  ఆ సినిమాలో ధ‌నుశ్ త‌మ్ముడి గా న‌టించిన రిషికేశ్ ఇప్పుడు ‘బొమ్మల కొలువు’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. రిషికేశ్‌, ప్రియాంక శ‌ర్మ‌, మాళ‌వికా స‌తీశ‌న్ హీరో హీరోయిన్లుగా సుబ్బు వేదుల ద‌ర్శ‌క‌త్వంలో పృథ్వీ క్రియేష‌న్స్‌, కిక్కాస్ స్టోరీ టెల్ల‌ర్ పతాకాల‌పై ఎ.వి.ఆర్‌.స్వామి నిర్మిస్తోన్న చిత్రం ‘బొమ్మ‌ల కొలువు’. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి కోన వెంక‌ట్, బి.వి.ఎస్‌.ర‌వి ముఖ్య అతిథులుగా హాజ‌రై ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...


హీరో రిషికేశ్ మాట్లాడుతూ ‘‘దర్శకుడు సుబ్బుగారు డిఫరెంట్‌గా తెర‌కెక్కించారు. నాపై న‌మ్మ‌కంతో రుద్ర అనే పాత్ర‌ను నాకు ఇచ్చారు. అలాగే నిర్మాత స్వామిగారికి స్పెష‌ల్ థాంక్స్‌. సినిమాలంటే ఉండే ప్యాష‌న్‌తో సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించారు. సినిమాను త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం. ఆశీర్వ‌దిస్తార‌ని భావిస్తున్నాం’’ అన్నారు.


నిర్మాత ఎ.వి.ఆర్‌.స్వామి మాట్లాడుతూ ‘‘పాండమిక్ సమయంలో ఖాళీగా ఉన్న స‌మ‌యంలో సినిమాలు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. అప్పుడు నాతో రాహు సినిమా చేసిన సుబ్బుగారితో మాట్లాడితే, ఆయ‌న సినిమా చేయ‌డానికి రెడీ అన్నారు. అలా ఈ బొమ్మ‌ల కొలువు సినిమా స్టార్ట్ అయ్యింది. దాంతో పాటు మ‌ల్లాద్రి అప్ప‌న్న‌గారి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా, భానుశ‌ర్మ‌గారి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను.. అంటే మూడు సినిమాల‌ను ఓకేసారి పూర్తి చేశాం. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే డిఫ‌రెంట్ మూవీ. క‌చ్చితంగా అంద‌రికీ న‌చ్చుతుంది. ఈ నెల‌లోనే ఈ మూడు సినిమాల‌ను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.


ద‌ర్శ‌కుడు సుబ్బు వేదుల మాట్లాడుతూ ‘‘పదేళ్ల ముందు నుంచి నాకు కోన వెంకట్‌గారు, బి.వి.ఎస్‌.ర‌విగారితో మంచి అనుబంధం ఉంది. ఇక బొమ్మ‌ల కొలువు సినిమా విష‌యానికి వ‌స్తే.. రాహు త‌ర్వాత ఆయ‌న‌తో సినిమా చేశాను. ఆయ‌న‌కు థాంక్స్. త్వ‌ర‌లోనే సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.


బి.వి.ఎస్‌.ర‌వి మాట్లాడుతూ ‘‘పాండమిక్ సమయంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ.. ఒక‌టి కాకుండా, మూడు సినిమాలు చేయ‌డ‌మ‌నేది గొప్ప విష‌యం. ఇది స్వామిగారికి సినిమాపై ఉన్న ప్రేమ‌, ధైర్యానికి నిద‌ర్శ‌నం. నేను కూడా సినిమా చూశాను. సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా, థ్రిల్లింగ్‌గా ఉంది. హృషికేశ్‌, ప్రియాంక‌, మాళ‌వికా స‌తీశ‌న్‌, శివ‌మ్‌ల‌కు అభినంద‌న‌లు. ట్రైల‌ర్ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంది. సినిమా చాలా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.


కోన వెంక‌ట్ మాట్లాడుతూ ‘‘సినిమా అంటే ప్యాషన్ ఉండి, అమెరికాలో నన్ను కలిసిన వాళ్లలో సుబ్బు ఒకడు. అలాగే ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు కూడా క‌లిశాడు. త‌న‌ని నేను తీసిన గీతాంజ‌లి సినిమాతో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం చేసిన సంగ‌తి తెలిసిందే. అమెరికాలో ఓ బ్యాంకుకి వైస్ ప్రెసిడెంట్‌గా ప‌నిచేస్తున్న రోజుల్లో నేను నీలో టాలెంట్ ఉందంటూ చెప్పిన కొన్ని ఇన్‌స్పిరేష‌న‌ల్ మాట‌ల వ‌ల్ల‌, త‌ను అమెరికా నుంచి వ‌చ్చేసి నాకు షాకిచ్చాడు. ఉద్యోగం వ‌దిలేశాడు. నాకే కాస్త గిల్టీగా అనిపించింది. కొన్నిరోజుల‌కు త‌ను రాహు అనే సినిమా చేశాడు. అత‌నిలోని ఫైర్ బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని తెలుసు. త‌ను అనుకున్నది సాధించాడు. ఇప్పుడు నాకు కాస్త ధైర్యంగా ఉంది. త‌ను ఈ బొమ్మ‌ల కొలువు నుంచి ముందుకు వెళ్లాల‌ని కోరుకుంట‌న్నాను. రిషికేశ్‌కు అభినంద‌న‌లు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సినిమాలు ఎలా బ‌య‌ట‌కు వ‌స్తాయో చెప్ప‌లేక‌పోతున్నాం. ఏదో ఒక మార్గంలో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌ని చెప్ప‌గ‌ల‌ను. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని భావిస్తున్నాను. అంద‌రికీ మంచి జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.


ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో హీరోయిన్స్ ప్రియాంక శ‌ర్మ‌, మాళ‌వికా స‌తీశ‌న్‌, శివ‌మ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.



నటీన‌టులు:


రిషికేశ్‌, ప్రియాంక శ‌ర్మ‌, మాళ‌వికా స‌తీశ‌న్‌, సుబ్బు, శివ‌మ్ త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం:


ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  సుబ్బు వేదుల‌

నిర్మాత‌:  ఎ.వి.ఆర్‌.స్వామి

బ్యాన‌ర్స్‌:  పృథ్వీ క్రియేష‌న్స్‌, కిక్కాస్ స్టోరీ టెల్ల‌ర్

సినిమాటోగ్ర‌ఫీ:  ఈశ్వ‌ర్‌

మ్యూజిక్‌:  ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు

ఎడిట‌ర్‌:  ఎం.ఆర్‌.వ‌ర్మ‌

పాట‌లు:  శ్రీనివాస మౌళి

ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌:  కార్తీక్ కోరుమిల్లి

పి.ఆర్‌.ఓ:  వంశీ శేఖ‌ర్‌



Share this article :
 
Copyright © 2015. TeluguCinemas.in | Telugu Cinemas - All Rights Reserved
Thank You Visit Again