Home » » Tremendous Response for the Birth 10000bc Trailer

Tremendous Response for the Birth 10000bc Trailer

 






ది బర్త్ 10,000 బిసి ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన.. 


ప్రతాప్ రానా కథానాయకుడిగా డాక్టర్ విక్రమ్ దర్శకత్వంలో శ్రీ వినాయక మారుతి క్రియేషన్స్, లక్ష్య ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ది బర్త్ 10,000 బిసి. ఈ సినిమా ట్రైలర్ ఈ మధ్యే విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు విక్రమ్. ప్రయోగాత్మక కథను కమర్షియల్ కోణంలో చూపిస్తున్నారు విక్రమ్. ఈ ఇండియన్ హాలీవుడ్ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఈ మధ్యే సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ విడుదల చేసారు. ఆదిమానవుడిగా మొదలైన మనిషి జీవితం క్రమంగా ఎలా మారింది అనేది ఈ ట్రైలర్‌లో చూపించారు. విడుదలైన క్షణం నుంచి కూడా ఆడియన్స్ నుంచి ఈ ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన వస్తుంది. ఈ సినిమాకు జుధా సంధీ సంగీతం అందిస్తున్నారు. మహేష్ తొగట ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. ఆనంద్ సుందరీష ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతుంది ది బర్త్ 10,000 బిసి. 


నటీనటులు: ప్రతాప్ రానా 


టెక్నికల్ టీం: 

ప్రొడక్షన్ హౌజ్: శ్రీ వినాయక మారుతి క్రియేషన్స్, లక్ష్య ప్రొడక్షన్స్

దర్శకుడు: డాక్టర్ విక్రమ్

Dop: ఆనంద్ సుందరీష 

ఎడిటర్: మహేష్ తొగట

సంగీతం: జుదా సంధీ

భాషలు: కన్నడ, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లీష్

జోనర్: హిస్టారికల్ అడ్వంచర్


Share this article :