Home » » Simbu Maanaadu Telugu Teaser Release by Raviteja

Simbu Maanaadu Telugu Teaser Release by Raviteja

 


వెంకట్ ప్రభు దర్శకత్వంలో

"శింబు-కల్యాణి ప్రియదర్శన్'ల

125 కోట్ల భారీ బడ్జెట్ 

బహు భాషా చిత్రం "మానాడు" టీజర్ రిలీజ్ చేస్తున్న మాస్ మహారాజ రవితేజ


భారతీరాజా-ఎస్.ఏ.చంద్రశేఖర్-ఎస్.జె.సూర్య-కరుణాకరన్ నటిస్తున్న వినూత్న కథాచిత్రం!!


     తెలుగులోనూ సుప్రసిద్ధుడైన సూపర్ స్టైలిష్ తమిళ్ స్టార్ శింబు-కల్యాణి ప్రియదర్శన్ జంటగా... క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో.. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత 'సురేష్ కామాచి" 125 కోట్ల భారీ బడ్జెట్ తో హిందీ-తమిళ్-తెలుగు-కన్నడ-మలయాళ భాషల్లో నిర్మిస్తున్న బహుభాషా చిత్రం "మానాడు" ఫస్ట్ లుక్ మాస్ మహరాజా రవితేజ రిలీజ్ చేయనున్నారు. ఫిబ్రవరి 3, మధ్యాహ్నం 2.34 నిమిషాలకు రవితేజ 'మానాడు'  టీజర్ రిలీజ్ చేయనున్నారు  పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు ముస్లింగా నటిస్తుండడం గమనార్హం.

     సుప్రసిద్ధ దర్శకులు భారతీరాజా, ఎస్.ఏ.చంద్రశేఖర్, ఎస్.జె.సూర్య, కరుణాకరన్ ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం. తమ చిత్రం 'మానాడు' తెలుగు టీజర్... తాజాగా 'క్రాక్'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ విడుదల చేయనుండడం పట్ల దర్శకనిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు!!


Share this article :