Home » » Nivetha Pethuraj About Red

Nivetha Pethuraj About Red



 ‘మెంటల్ మదిలో’ , ‘బ్రోచేవారెవరురా’ , ‘చిత్రలహరి’ , ‘అల.. వైకుంఠపురములో.. ‘ చిత్రాల తర్వాత నివేదా పేతురాజ్ నటించిన సినిమా ' రెడ్ ' . సంక్రాంతి కి రానున్న ‘రెడ్’ మూవీ గురించి, తన గురించి  నివేదా పేతురాజ్ చెప్పిన ముచ్చట్లు :


‘బ్రోచేవారెవరురా’ స్టోరీని ఓన్లీ టెన్ మినిట్స్ విని సెకండాఫ్ చెప్పద్దు నేను చేస్తున్నాను అని చెప్పేసాను. అలాగే కిషోర్ తిరుమల చిత్రలహరి సినిమా స్టోరీ చెప్పినప్పుడు కూడా ఫుల్ స్టోరీ వెనకుండా నేను ఈ సినిమా చేస్తానని చెప్పాను. ఈ ఇద్దరి డైరెక్టర్స తో వర్క్ చేయడం నాకు కంఫర్ట్ గా ఉంటుంది.  ‘రెడ్’ సినిమాను కుడా  స్క్రిప్ట్ వినకుండానే ఓకే చేసాను. 


కిషోర్ సార్ గురించి చెప్పాలంటే.. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కి తగ్గట్టుగా నేను ఏం చేయాలో.. ఎలా చేయాలో ఫుల్ క్లారిటీతో చెబుతారు. అలా చెప్పడం వలన నాకు ఈజీ అయ్యింది. ఇక నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే.. చిత్రలహరిలో నాది చాలా మొండి క్యారెక్టర్. ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్.. కొంచెం ఇన్నోసెంట్ ఉండే క్యారెక్టర్. అయితే.. పైకి చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టు కనిపిస్తాను కానీ లోపల మాత్రం చాలా ఇన్నోసెంట్ గా ఉంటాను. 


 హీరో రామ్ గురించి చెప్పాలంటే... వెరీ వెరీ ప్రొఫెషనల్. సెన్సాఫ్ హుమర్ ఎక్కువ. రామ్ అండ్ కిషోర్ సార్ ఇద్దరూ పక్కా తమిళ్ లో మాట్లాడతారు. సెట్ లో మేము ఓన్లీ తమిళ్ లోనే మాట్లాడుకునే వాళ్లం. నేన తెలుగు నేర్చుకుంటున్నాను. రెడ్ మూవీలో నేను డబ్బింగ్ చెప్పాను. అది కూడా నాలుగు రోజుల్లోనే చెప్పేసాను. రామ్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్ లు చేసాడు. యాక్షన్ అని చెప్పగానే... ఐదు నిమిషాల గ్యాప్ లో ఛేంజ్ అయిపోయేవాడు. వెరీ టాలెంటెడ్.


 నాకు ఫస్ట్ హీరోయినా సెకండ్ హీరోయినా అనే ఫీలింగ్ లేదు.  క్యారెక్టర్ కి సెట్ అవుతాను అనుకుంటే నేను చేస్తాను. నేను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో సీరియస్ క్యారెక్టరులు చేసాను. నేను నెక్ట్స్ చేయనున్న ‘పాగల్’ మూవీలో నవ్వుతూ ఉండే క్యారెక్టర్ చేస్తున్నాను. ‘విరాటపర్వం’ సినిమాలో ఫైట్ సీన్స్ చేస్తున్నాను.  చందు మొండేటి డైరెక్షన్ లో వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఇది ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. 


ఇప్పటి వరకు పర్ ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారక్టర్స్ చేసాను. గ్లామర్ రోల్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. టాలీవుడ్ లో నేనేంటో నిరూపించుకున్న తర్వాత బాలీవుడ్ గురించి ఆలోచిస్తాను.


Share this article :