Home » , » Shadow Review -Telugucinemas.in

Shadow Review -Telugucinemas.in


 షాడో –  ఈ సినిమా విక్టరీ వెంకీ ఫామిలీ  ప్రేక్షకులను నిరాశ  పరిచింది 
వెంకటేష్ సినిమా అంటే కుటుంబాలు కుటుంబాలు చక్కగా వెళ్లి చూద్దాం  అనుకుంటారు చూస్తారు కానీ అటువంటివారిని ఈ సినిమా పెద్దగా  అలరించదు అని చెప్పాలి 
ఈ సినిమా కి దర్శకుడు : మెహర్ రమేష్ నిర్మాత : పరుచూరి శివ రామ్ ప్రసాద్
 సంగీతం : ఎస్.ఎస్ థమన్ 
నటీనటులు : వెంకటేష్, తాప్సీ, శ్రీ కాంత్. మధురిమ 
Telugucinemas.in రేటింగ్ 2/5
వెంకటేష్ ఈ పేరు వినగానే మంచి ఫామిలీ సినిమా లు చేస్తాడు అని అంటారు 
ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే విక్టరీ వెంకటేష్   రూట్  మార్చి  కొత్త లుక్ తో అంటే పొడుగాటి జుట్టు గడ్డం తో ప్రేక్షకుల  ముందికి  ఓ మాస్ పాత్ర తో   ‘షాడో’ గా  వచ్చారు  ఈ సినిమాలో శ్రీ కాంత్, మధురిమ కీలక పాత్రల్లో నటించారు. సుమన్ అతిధి పాత్రలో నటించారు ఈ సినిమా లో వెంకటేష్ తో  తప్సీ జతకట్టింది  
మాఫియా నేపధ్యం లో ఈ సినిమా నడుస్తుంది ఈ సినిమా లో సెంటిమెంట్ పాళ్ళు  ఎక్కువగానే వున్నాయి కొన్ని సన్నివేశాలు నవ్వు రాకపోగా నీరసం తెప్పిస్తాయి సినిమా ప్రారంభం లో బాగానే వుంది అని పిస్తుంది రానురాను విశ్వరూపం చూపిస్తుంది వెంకటేష్ గబ్బర్ సింగ్ గ కనిపించి అంతాక్షరి ఆడిస్తారు అది కాస్త ప్రేక్షకుడికి ఉపిరి పోస్తుంది ఆనందాని ఇస్తుంది 

ఈ సినిమా లో బాగున్నా విషయాలు 
హీరో ని స్టైలిష్ గ చూపించడం లో మెహెర్ రమేష్  తరవాతే ఎవరయినా ఈ సినిమా లో వెంకటేష్ ని చాల స్టైలిష్ గ చూపించారు వెంకటేష్ తన నటనతో అలరించారు ముఖ్యం గ కొన్ని హాస్య సన్నివేశాలలో వెంకటేష్ నటన బాగుంది 
ఈ సినిమా లో ప్రతాప్ వేషం వేసిన శ్రీకాంత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు అయన నటన కూడా బాగుంది 
ఇతర నటులు ఎం.ఎస్ నారాయణ,జయప్రకాష్ రెడ్డి వారి పాత్రలకు తగిన న్యాయం చేసారు 
ఈ సినిమా కి పాటలు మెయిన్ హైలైట్ 

మైనస్ పాయింట్స్ :
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఏ గ్లూకోజ్ ఓ తాగక పోతే సెకండ్ హాఫ్ చూడలేము ఏమో అని పిస్తుంది 
ఎక్కువ సినిమాలు చూసే అలవాటు ఉన్నవారికి  ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతుంది  స్క్రీన్ ప్లే బాగా మైనస్ అని చేపుకోవాలి ఈ సినిమా పాత  సార  కొత్త సీసాలో అన్న చందాన  వుంది వరస ప్రయజయలతో సావాసం చేస్తున్న డైరెక్టర్ చేయాల్సిన సినిమా కాదు 
ఈ సినిమా లో వెంకటేష్ చిన్న పిల్లోడి మనస్తత్వం తో కొన్ని సన్నివేశాలలో నటిస్తారు అయన 25 ఇయర్స్ సినిమా చరిత్రలో ఇంత మైనస్ రోల్ చేసి వుండరు నవ్వు రాకపోగా నీరసం వస్తుంది ఆ దృశ్యాలు చూస్తే . 

అగట్లో అన్ని వున్నాయి కానీ అల్లుడు నోట్లో సేని అన్నటు ఎం.ఎస్ నారాయణ  ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కృష్ణ భగవాన్, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు ఇంత మంది నటులు వుండగా వారిని సరిగా వినుయోగించుకోలేదు అని చెప్పాలి 

దీపావళి కి టపాసుల శబ్దాలు వినిపించినట్టు మాట మాట కి బుల్లెట్లు పేల్చడం  హీరో విల్లన్ లు దీపావళి చేసుకుంటున్నారు ఏమో అనిపిస్తుంది 
డైలాగ్స్ కూడా పెద్ద గొప్ప గ లేవు సాంబ సినిమా లో నిప్పు తో పెట్టుకుంటే కాలి పోతావ్ నీటి తో పెట్టుకుంటే ముంగిపోతావ్ ఈ సాంబ తో పెట్టుకుంటే చచ్చిపోతావ్ ఈ డైలాగ్స్ గుర్తు వుందా అలాంటి  డైలాగ్స్ ఏ  ఒకటి ఇందులో కూడా వుంది గాలి ని తట్టుకోలేవ్ నిప్పుని ముట్టుకోలేవు ఈ షాడో ని పట్టుకోలేవు  ఇలా చెప్పుకుంటూ పోతే చాల వున్నాయి 

ఫైనల్ గా నేను చెప్పేది 

టైం పాస్ అవ్వకపోతే ఈ సినిమా కి వెళ్ళాలి మెహెర్ రమేష్ గారు మీరు  సినిమా లు స్టైలిష్ గ తీస్తారు  కానీ ఈ సారి  సినిమా చేస్తే కొంచం కధ తో కొత్త గ తీయండి లేక పోతే మీ సినిమా మీరే  నిర్మించుకోవలసి వస్తుంది సుమ 
ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే 

Share this article :