Latest Post

Baby Director Sai Rajesh Launched Romantic Song From Nenu-Keerthana

 "బేబి" స్థాయిలో "నేను-కీర్తన" 

మంచి బ్లాక్ బస్టర్ కావాలి!!!

సంచలన దర్శకనిర్మాత

సాయి రాజేష్
చిమటా రమేష్ బాబు హీరోగా, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన "నేను కీర్తన" ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు సంచలన దర్శకుడు - నిర్మాత సాయి రాజేష్. ఈ చిత్రంలోని "సీతాకోకై ఎగిరింది మనసే" గీతం లిరికల్ వీడియోను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ... "నేను - కీర్తన"లో సక్సెస్ కళ కనబడుతోంది. కులుమనాలిలో చిత్రీకరించిన పాట చాలా బాగుంది. చిమటా రమేష్ బాబుకి దర్శకుడిగా, హీరోగా ఉజ్వల భవిష్యత్ ఉందనిపిస్తోంది" అన్నారు!!


చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు ("సి.హెచ్.ఆర్")ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) - రిషిత - మేఘన హీరోహీరోయిన్లుగా... చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన చిత్రం "నేను-కీర్తన" !!


"ఎంతో బిజీ షెడ్యూల్ లో సైతం తమ కోసం సమయాన్ని కేటాయించిన సాయి రాజేష్ కు హీరో కమ్ డైరెక్టర్ చిమటా రమేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. "నేను - కీర్తన" చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని" చిత్ర కథానాయకుడు - దర్శకుడు చిమటా రమేష్ బాబు అన్నారు!!


మల్టీ జోనర్ ఫిల్మ్ గా తెరకెక్కి సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉన్న "నేను కీర్తన" చిత్రానికి బిజినెస్ పరంగానూ మంచి క్రేజ్ ఏర్పడింది.  కులుమనాలిలో చిత్రీకరించిన పాటలతోపాటు... ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది. ఈ చిత్రం విడుదల తేది అతి త్వరలో ప్రకటించనున్నారు!!


సంధ్య, జీవా, విజయరంగ రాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, డి.ఐ: భాను ప్రకాష్, వి.ఎఫ్.ఎక్స్: నవీన్, ఎస్.ఎఫ్.ఎక్స్: ఎ. నవీన్ రెడ్డి, పోరాటాలు: నూనె దేవరాజ్, నృత్యాలు: అమిత్ కుమార్ - సి.హెచ్.ఆర్, పాటలు: సి.హెచ్.ఆర్ - అంచుల నాగేశ్వరరావు - శ్రీరాములు, సంగీతం: ఎం.ఎల్.రాజా, ఛాయాగ్రహణం: కె. రమణ, కూర్పు: వినయ్ రెడ్డి బండారపు, సమర్పణ: చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ), నిర్మాత: చిమటా లక్ష్మికుమారి, రచన - దర్శకత్వం: చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్.)!!

NBK109 Birthday Spl Glimpse Unveiled

 నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 'NBK109' నుండి ప్రత్యేక గ్లింప్స్ విడుదలనందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే తెలుగునాట ఉండే సందడే వేరు. 'న్యాచురల్ బోర్న్ కింగ్' గా, 'గాడ్ ఆఫ్ మాసెస్' గా తెలుగునాట తిరుగులేని ఫాలోయింగ్ ఆయన సొంతం. ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నో చిత్రాలను, పాత్రలను బాలకృష్ణ అందించారు. ముఖ్యంగా మాస్ ని మెప్పించే సినిమాలను అందించడంలో ఆయన దిట్ట. ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ, తన 109వ చిత్రం 'NBK109'తో మాస్ ని అలరించడానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లితో చేతులు కలిపారు.


తెలుగు చిత్రసీమలో అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తోంది. జూన్ 10వ తేదీన బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక గ్లింప్స్ ను విడుదల చేశారు నిర్మాతలు. "జాలి, దయ, కరుణ లాంటి పదాలకు అర్థం తెలియని అసురుడు" అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో బాలకృష్ణ పాత్రను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంది.

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 8న 'NBK109' నుండి ఇప్పటికే చిత్ర బృందం ఫస్ట్‌ గ్లింప్స్ ను విడుదల చేయగా విశేష స్పందన లభించింది. ఇక ఇప్పుడు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక గ్లింప్స్ మరింత ఆకర్షణగా ఉంది. 


రచయిత, దర్శకుడు బాబీ తన సినిమాల్లో హీరోలను కొత్తగా, పవర్ ఫుల్ గా చూపిస్తుంటారు. అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు మెచ్చేలా ఆయన హీరోల పాత్రలను మలిచే తీరు మెప్పిస్తుంది. 'NBK109'లో బాలకృష్ణ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని గ్లింప్స్ ని బట్టి అర్థమవుతోంది. చూడటానికి స్టైలిష్ గా ఉంటూ, అసలుసిసలైన వయలెన్స్ చూపించే పాత్రలో బాలకృష్ణను చూడబోతున్నాం. అభిమానులు, మాస్ ప్రేక్షుకులు బాలకృష్ణను ఎలాగైతే చూడాలి అనుకుంటారో.. అలా ఈ గ్లింప్స్ లో కనిపిస్తున్నారు.


సంచలన స్వరకర్త ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గ్లింప్స్ లో వారి పనితనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయ్ కార్తీక్ విజువల్స్ కట్టి పడేస్తున్నాయి. ఎస్.థమన్ నేపథ్య సంగీతం గ్లింప్స్ ని మరోస్థాయిలో నిలబెట్టింది. 


నిరంజన్ ఎడిటింగ్ బాధ్యత నిర్వహిస్తున్న ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు.


సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు.

Silver Screen Cinemas LLP Production No1 Movie Launched Grandly

ఘనంగా ప్రారంభమైన

సిల్వర్‌స్క్రీన్‌ సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి ప్రొడక్షన్‌ నెం.1యువ కథానాయకుడు అవినాష్‌ తిరువీధుల, సిమ్రాన్‌ చౌదరి జంటగా సిల్వర్‌స్క్రీన్‌ సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ప్రముఖ రచయిత సాయిమాధవ్‌ బుర్రా స్క్రిప్ట్‌ సూపర్‌విజన్‌`డైలాగ్స్‌తో కార్తి దర్శకత్వంలో శాంతనూపతి, ఆలపాటిరాజా, అవినాష్‌బుయాని, అంకిత్‌రెడ్డిలు నిర్మిస్తున్న ‘ప్రొడక్షన్‌నెం.1’ చిత్రం హైదరాబాద్‌లోని సారధి స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయింది. హీరో, హీరోయిన్‌లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత టి.జి. విశ్వప్రసాద్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా, ప్రముఖ దర్శకుడు బాబీ ఫస్ట్‌షాట్‌కు దర్శకత్వం వహించారు. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమీషనర్‌ శ్రీనివాసరెడ్డి క్లాప్‌ కొట్టారు.


అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతల్లో ఒకరైన శాంతనూపతి మాట్లాడుతూ...

మంచి సినిమా తీయాలనే కోరికతో అమెరికా నుంచి వచ్చాము. దాదాపు 4 సంవత్సరాలకుపైగా ప్రయత్నం చేస్తున్నాం. మధ్యలో కరోనా వల్ల చాలా టైం వేస్ట్‌ అయ్యింది. దాదాపు 30 కథలు దాకా విన్నాము. మా రైటర్‌ విశ్వజిత్‌ చెప్పిన ఈ లైన్‌ బాగా నచ్చింది. దీనికి తోడు సాయిమాధవ్‌ బుర్రాగారు మా సినిమాకు డైలాగ్స్‌ రాయడం మరింత ప్లస్‌ అవుతుంది. మంచి హిట్‌ సినిమాకు కావాల్సినవి అన్నీ ఇందులో ఉన్నాయి. మంచి టెక్నీషియన్స్‌ కుదిరారు అన్నారు.


దర్శకుడు కార్తి మాట్లాడుతూ...

ఇది నాకు తొలి సినిమానే అయినా మంచి కథ, ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్‌లు దొరకడం వల్ల చాలా నమ్మకంగా ఉన్నాను. ఫస్ట్‌ సినిమాకే టాప్‌ టెక్నీషియన్స్‌ సెట్‌ అవడం నా లక్‌గా భావిస్తున్నా. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఇది ట్రీట్‌లాంటిది. 10వ తేదీ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. మొత్తం 3 షెడ్యూల్స్‌ ఉంటాయి. నన్ను నమ్మి ఇంతమంచి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్‌ అన్నారు.


హీరో అవినాష్‌ మాట్లాడుతూ...

సినిమాలంటే నాకు చాలా పిచ్చి. నేను చదువుకు కేటాయించిన సమయం కన్నా.. సినిమాల్లో గడిపిన సమయమే ఎక్కువ. నిర్మాతలు నాకు చాలా క్లోజ్‌ ఫ్రెండ్స్‌. మంచి కథ సెట్‌ అవడం, దానికి టాప్‌ టెక్నీషియన్‌లు పని చేస్తుండడం మా యూనిట్‌ అదృష్టంగా భావిస్తున్నా. తప్పకుండా హిట్‌ ఫిల్మ్‌ ఇస్తాం అన్నారు.


హీరోయిన్‌ సాక్షి చౌదరి మాట్లాడుతూ...

మరో మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్‌. నా క్యారెక్టర్‌కు నటనకు మంచి స్కోప్‌ ఉంది అన్నారు.


రచయిత విశ్వజిత్‌ మాట్లాడుతూ...

ఈ లైన్‌ ఓకే అవ్వగానే సినిమా స్టార్ట్‌చేయలేదు. రియాల్టీ చెక్‌కోసం 6 జిల్లాల నుంచి వివిధ వర్గాలకు చెందిన దాదాపు 150 మందిని సెలక్ట్‌చేసి, వారికి కథచెప్పగా అందరూ చాలాబావుంది అని ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చారు. ఆ తర్వాత పలు వర్క్‌షాప్‌లు నిర్వహించి కాన్ఫిడెంట్‌గా షూటింగ్‌కు వెళ్తున్నాం అన్నారు.


ఈకార్యక్రమానికి నిర్మాతలు అంబిక కృష్ణ, దామోదర ప్రసాద్‌, తుమ్మలపల్లి, తాండూర్‌ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్‌నాయుడులతో పాటు పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు హాజరయ్యారు. 


అవినాష్‌, సిమ్రాన్‌ చౌదరి, నందు, శివాజీరాజా, సత్య, హర్షవర్ధన్‌, టార్జాన్‌, హర్ష, భాషా, ఆమని, ఈటీవీ ప్రభాకర్‌, సమ్మెట గాంధీ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


స్క్రిప్ట్‌ సూపర్‌విజన్‌, డైలాగ్స్‌: సాయిమాధవ్‌ బుర్రా, కెమెరా: ఎ. విశ్వనాథ్‌, కథ, స్క్రీన్‌ప్లే:విశ్వజిత్‌ పూరేటి, సంగీతం: వివేక్‌సాగర్‌, ఎడిటర్‌: చోటా కె. ప్రసాద్‌, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: తోలేటి యువ కృష్ణ, ప్రొడక్షన్‌ డిజైనర్‌: నాగేంద్ర తంగళ్ల, ఆర్ట్‌: కె.వి. రమణ, అడిషినల్‌ డైలాగ్స్‌: నిఖిల్‌ టాగూర్‌, ధర్మా(ఎస్‌.డి.టి), పి.ఆర్‌.ఓ: సురేష్‌ కొండేటి,  లైన్‌ ప్రొడ్యూసర్‌: రాంబాబు కుంపట్ల, నిర్మాతలు : శాంతనూపతి, ఆలపాటిరాజా, అవినాష్‌బుయాని, అంకిత్‌రెడ్డి, దర్శకత్వం: కార్తీ. 

Akasanike Jabili Andham Lyrical Song Unveiled From Usha Parinayam

ఉషా ప‌రిణ‌యం చిత్రం నుంచి

ఆకాశానికే జాబిలి అందం.. భూగోళానికే నా చెలి అందం లిరిక‌ల్ సాంగ్ విడుద‌లతెలుగు సినీ రంగంలో ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన కె.విజ‌య్‌భాస్క‌ర్ మ‌ళ్లీ ఓ స‌రికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రానికి శ్రీ‌కారం చుట్టాడు. నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ఆయ‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఉషా ప‌రిణ‌యం  బ్యూటిఫుల్ టైటిల్‌తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

ఈ చిత్రానికి ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప‌శీర్షిక‌. విజ‌య్‌భాస్క‌ర్ క్రాఫ్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపైకె.విజ‌య్‌భాస్క‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న  ఈ చిత్రంలో విజ‌య్‌భాస్క‌ర్ త‌న‌యుడు  శ్రీ‌క‌మ‌ల్ హీరోగా న‌టిస్తుండ‌గా,   తాన్వీ ఆకాంక్ష అనే అచ్చ‌తెలుగ‌మ్మాయి ఈ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం కాబోతుంది. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంత‌ర ప‌నుల‌ను జరుపుకుంటోంది. ఇటీవ‌ల ఈ చిత్రం టీజ‌ర్‌ను విడుదల చేసింది చిత్ర‌బృందం. తాజాగా ఈ చిత్రం నుంచి ఆకాశానికే జాబిలి అందం.. భూగోళానికే నా చెలి అందం అంటూ కొన‌సాగే ఓ ప్రేమ‌గీతాన్ని ఈ చిత్రం నుంచి తొలి లిరిక‌ల్ సాంగ్‌గా విడుద‌ల చేశారు. ఆర్‌.ఆర్‌. ధ్రువ‌న్ సంగీత సార‌థ్యంలో రూపొందిన ఈ పాట‌కు అల‌రాజు సాహిత్యం అందించారు. ఆర్‌.ఆర్‌. ధ్రువ‌న్ ఈ ప్రేమ‌గీతాన్ని ఆల‌పించారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క‌, నిర్మాత విజ‌య్ భాస్క‌ర్ మాట్లాడుతూ  ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ప్రేమ‌క‌థ‌లో స‌రికొత్త‌గా వుండే విధంగా ఉషా ప‌రిణ‌యం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రం ప్రేమ‌కు నేనిచ్చే డెఫినేష‌న్‌.  ఇదొక మంచి ల‌వ్‌స్టోరి, సినిమా ల‌వ‌ర్స్‌కు విందుభోజ‌నం లా వుంటుంది. అన్ని ఎమోష‌న్స్ ఈ చిత్రంలో వున్నాయి. ఈ సినిమా సంగీతంలో ధ్రువ‌న్ విశ్వ‌రూపం చూస్తారు అన్నారు.

 శ్రీ‌క‌మ‌ల్, తాన్వి ఆకాంక్ష‌, సూర్య‌, ర‌వి, శివ‌తేజ‌, అలీ,  వెన్నెల‌కిషోర్‌, శివాజీ రాజా, ఆమ‌ని, సుధ‌, ఆనంద్ చ‌క్ర‌పాణి, ర‌జిత‌, బాల‌క్రిష్ణ‌, సూర్య, మ‌ధుమ‌ణి ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకి సంగీతం : ఆర్ ఆర్ ధ్రువ‌న్‌, డీఓపీ: స‌తీష్ ముత్యాల‌, ఎడిటింగ్‌: ఎమ్ ఆర్ వ‌ర్మ‌, ద‌ర్శ‌క‌త్వం-నిర్మాత :కె.విజ‌య్‌భాస్క‌ర్‌  


Yevam: Telangana's Oggu Katha culture to be a highlight in this thriller

 తెలంగాణ ఒగ్గుక‌థ క‌ల్చ‌ర్ హైలైట్‌గా యేవమ్ఈ పాశ్చాత్య పోక‌డ‌లో తెలుగుద‌నం వున్న సినిమాలు, తెలుగు వారి సంప్ర‌దాయాలు చూపించే సినిమాలు చాలా అరుదుగా వ‌స్తున్నాయి. స‌హ‌జ‌త్వంతో కూడిన ఈ అంశాల‌ను హైలైట్ చేస్తూ చూపించే సినిమాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు కూడా ఆద‌రిస్తున్నారు. తాజాగా యేవమ్ చిత్రంలో తెలంగాణ ఒగ్గు క‌థ క‌ల్చ‌ర్‌ని హైలైట్ చేస్తూ, తెలంగాణ సంస్కృతిలోని ముఖ్య‌మైన అంశ‌మైన ఒగ్గుక‌థ‌ను ఈ చిత్రంలో చూపించారు యేవ‌మ్ చిత్ర ద‌ర్శ‌కుడు ప్ర‌కాష్ దంతులూరి.  ఈచిత్రంలో ఓ కీల‌కమైన స‌న్నివేశం వ‌చ్చేట‌ప్పుడు ఆ స‌న్నివేశంలోని గాఢ‌త‌ను తెలంగాణ ఒగ్గుక‌థ‌తో చెబుతున్నారు. ఈ క‌థ‌లో హిందూ సంప్ర‌దాయంలోని గ్రామ దైవాల గొప్ప‌ద‌నాన్ని ఒగ్గుక‌థ‌లో   కూడా ఈ చిత్రంలో చూపించారు. ఒగ్గుక‌థ‌ను సినిమాలో

ముఖ్య అంశంగా చేర్చిన క‌మ‌ర్షియ‌ల్ సినిమా అని చెప్పొచ్చు. ఈ ఒగ్గుక‌థ‌ను కూడా రియ‌ల్‌గా ఒగ్గుక‌థ‌ల‌ను పాడే ఒగ్గుక‌థ క‌ళాకారుల చేత‌నే చెప్పించ‌డం విశేషం. ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ఈ ఒగ్గుక‌థతో క‌థ‌లోని గాఢ‌త‌ను, స‌న్నివేశంలోని సారాంశంను చెప్పించ‌డంతో ప్రేక్ష‌కులు క‌థ‌లో ఇన్‌వాల్వ్ అవ్వ‌డ‌మే కాకుండా వారికి కొత్త అనుభూతిని క‌లిగిస్తుంది. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న వ‌స్తుంది.  ఈ నెల 14న విడుద‌ల కాబోతున్న ఈ చిత్రం అంద‌ని అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కం వుంది అన్నారు.

ప్రకాష్‌ దంతులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చాందిని చౌద‌రి

దిని చైద‌రి, వ‌శిష్ట సింహా, భరత్‌రాజ్‌,ఆషు రెడ్డి  ముఖ్యతారలు. ఈ చిత్రానికి నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. గోపరాజు రమణ, దేవిప్రసాద్‌, కల్పిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్  ఎస్‌వీ విశ్వేశ్వర్‌, సంగీతం కీర్తన శేషు, నీలేష్‌ మందలపు అందిస్తున్నారు. సుజనా అడుసుమిల్లి ఎడిటర్‌గా, రాజు పెన్మెత్స ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Amala Akkineni launches the teaser of Honeymoon Express

అమల అక్కినేని చేతుల మీదుగా "హనీమూన్ ఎక్స్ ప్రెస్" సినిమా టీజర్ లాంఛ్చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న సినిమా "హనీమూన్ ఎక్స్ ప్రెస్". ఈ చిత్రాన్ని న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ప్రయోగాత్మకంగా ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీ గా దర్శకుడు బాల రాజశేఖరుని రూపొందించారు. హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా ఈ నెల జూన్ 21న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ అవుతుంది. 


ఈ నేపథ్యంలో చిత్ర టీజర్ ను అమల అక్కినేని విడుదల చేశారు. 


ఈ సందర్భంగా అమల అక్కినేని మాట్లాడుతూ, “యాక్టింగ్, స్క్రీన్ ప్లే రైటింగ్ లో ప్రొఫెసర్ గా బాల అమెరికాలో చాలా కాలం పనిచేశారు. అమెరికాలో ఉన్న, ఆయనకు ఏదో ఒకరోజు తెలుగు సినిమాకు దర్శకత్వం వహించాలని ఉండేది. ఆయన కల ఈ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమాతో నెరవేరినందుకు సంతోషంగా ఉంది. టీచింగ్ ఒక బాధ్యత అయితే ఫిల్మ్ మేకింగ్ మరో సవాలు లాంటిది. మా అన్నపూర్ణ కాలేజ్ ఫాకల్టీలు, స్టాఫ్, స్టూడెంట్స్ ను బాల  హనీమూన్ ఎక్స్ ప్రెస్ మూవీ టీమ్ లోకి తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. సినిమా టీజర్ ఫన్నీగా, రొమాంటిక్ గా ఉంది. ఈ రోజు సమాజంలోని రొమాంటిక్, వివాహ బంధాలను గురించి ఒక బలమైన కథను చూపించబోతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈరోజు పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండే సబ్జెక్ట్ ఇది. ఈ నెల జూన్ 21న, హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా ని ఆదరించి, విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. బాల, ఆయన టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను,” అన్నారు.దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ, “నా మనసులో అన్నపూర్ణ స్టూడియోస్ కు ప్రత్యేక స్థానం ఉంది. చాలాకాలం నుంచి అమెరికా లో ఉన్న నన్ను, అమల గారు, నాగార్జున గారు ఇండియాకు తీసుకొచ్చారు. అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా కు డీన్ గా బాధ్యతలు అప్పగించారు. వాళ్ల ప్రోత్సాహంతో దర్శకుడిగా నా ఫస్ట్ తెలుగు మూవీ హనీమూన్ ఎక్స్ ప్రెస్ ప్రారంభించాను. ఇందులో అన్నపూర్ణ కాలేజ్ ఫాకల్టీ, స్టూడెంట్స్ ఇతర స్టాఫ్ అన్ని డిపార్ట్‌మెంట్లలో కీలకమైన పాత్రలు వహించారు. నా మెంటార్ గా భావించే నాగార్జున గారు మా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చెయ్యడం విశేషం. అలాగే, అమల గారు టీజర్ రిలీజ్ చేస్తే బాగుంటుందని అనుకున్నాను. అక్కినేని కుటుంబం నుంచి లభిస్తున్న ఈ సపోర్ట్ కు హనీమూన్ ఎక్స్ ప్రెస్ మూవీ టీమ్ తరుపున నా కృతజ్ఞతలు. మా మూవీ నుంచి టీ సిరీస్ మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేసిన నాలుగు సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కల్యాణి మాలిక్ వీటిని కంపోజ్ చేశారు. స్ఫూర్తి జితేందర్ టైటిల్ సాంగ్ కు మ్యూజిక్ చేశారు. మంచి రొమాంటిక్ కామెడీ మూవీగా హనీమూన్ ఎక్స్ ప్రెస్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు జూన్  21న థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. సుచిన్  సినిమాస్ (Suchin Cinemas) డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారు మా చిత్రాన్ని విడుదల చేస్తున్నారు” అన్నారు.


సమర్పణ : ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ (యు ఎస్ ఎ) (NRI Entertainments (USA))

బ్యానర్ : న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (New Reel India Entertainments Pvt Ltd)

చిత్రం పేరు : హనీమూన్ ఎక్స్‌ప్రెస్


నటీనటులు : చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ, తదితరులు


సంగీతం : కళ్యాణి మాలిక్  

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ఆర్ పి పట్నాయక్

లిరిక్స్ : కిట్టూ విస్సాప్రగడ

ఆర్ట్, సినిమాటోగ్రఫీ : శిష్ట్లా  వి ఎమ్ కె

ఎడిటింగ్ : ఉమా శంకర్ జి (యు ఎస్ ఎ), శ్రీ కృష్ణ అత్తలూరి

ఆడియో : టి సిరీస్

పి ఆర్ ఓ : పాల్ పవన్

డిజిటల్ పి ఆర్ ఓ : వంశి కృష్ణ (సినీ డిజిటల్)

రచన, దర్శకత్వం : బాల రాజశేఖరుని 

Tom & Jerry Review

Review: Tom & Jerry


Check out the Review of 'Tom & Jerry' directed by Jaysree Sivan Produced by  Venkat Palepu Released in theaters this week. Let's find out what the film is about.  

Story:

Lucky (Amalan Daas) is a happy going  person  who carries his laziness as his asset . As a consequence of an incident involving him, he ends up sharing his flat with Bhanumathi (Harman Deep Kaur) who is a IT employee. Bhanumathi has a dream of settling in USA. 

As they both share flat Tom and Jerry things begin between them 


Performances 

In this segment we must appreciate the budding actors who played in lead roles. Their  chemistry  is good Harman Deep Kaur looks hot in some scenes.Her Performance is Good .Lucky (Amalan Daas) performance is perfect Rupa plays Pooja shd Justified her role 

Chandra Mahesh plays the hero's father he has done decentwork as friendly Father. Srimani plays the hero's mother  she is decent in her role Thota Venu Gopal and  Sujatha plays the heroine's parents 


Comedian Ravi Teja Entertained  as Nikkar Satthi,. Indu and Rest of the cast has done 


 Technical Departments:

In this segment we must appreciate producers for thier Production values Venkot Palepu is successful as Producer 

Siva Nirmala  dialogues are authentic .  SB Uddhav Editing is Top notch cinematography by SK is Perfect. Director Tried his best to engage audiences 


Verdict:

on whole  Tom & Jerry is a Entertaining film pre-wedding intimacy and ego clashes between the lead pair will Entertain Audiences 

Rating 3/5 

Vishnu Manchu’s Kannappa Teaser On June 14th

జూన్ 14న విష్ణు మంచు  ‘కన్నప్ప’ టీజర్డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ నుంచి మోస్ట్ అవెయిటెడ్ అప్డేట్ రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి మహామహులు నటిస్తున్న సంగతి తెలిసిందే.


కన్నప్ప టీజర్‌ను కేన్స్ ఫెస్టివల్‌లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ది వరల్డ్ ఆఫ్ కన్నప్పను చూసి కేన్స్‌కు వచ్చిన అతిరథమహారథులు ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఇక ఇండియన్ ఆడియెన్స్ ఈ టీజర్‌ను చూసే టైం వచ్చింది. జూన్ 14న కన్నప్ప టీజర్ రాబోతోందని మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు వదిలిన పోస్టర్‌ అందరిలోనూ మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. గుర్రం మీద విష్ణు కూర్చున్న తీరు, చుట్టూ కనిపిస్తున్న అటవీ ప్రాంతాన్ని చూస్తుంటే సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతాన్ని చూడబోతున్నామనే ఫీలింగ్ కలిగేలా ఉంది.


అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద మోహన్ బాబు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన కన్నప్ప ఫస్ట్ లుక్ పోస్టర్, ఇచ్చిన అప్డేట్లతో ఆడియెన్స్‌లో మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ విజువల్ వండర్ కోసం దేశవిదేశాల నుంచి ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

A Masterpiece Teaser Launched

"ఏ మాస్టర్ పీస్" మనం గర్వంగా చెప్పుకునే సూపర్ హీరో మూవీ అవుతుంది - టీజర్ లాంఛ్ లో హీరో అరవింద్ కృష్ణ
'శుక్ర', 'మాటరాని మౌనమిది' వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్  రూపొందిస్తున్న కొత్త సినిమా "ఏ మాస్టర్ పీస్". మనీష్ గిలాడ, అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్, అషు రెడ్డి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ప్రతిష్టాత్మక ఫిల్మ్ ప్రొడక్షన్ స్టూడియో మెర్జ్ ఎక్స్ ఆర్ తో కలిసి సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ  "ఏ మాస్టర్ పీస్" సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కలిసిన ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్సీపిరియన్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది.  ఈ రోజు హైదరాబాద్ లో "ఏ మాస్టర్ పీస్" సినిమా టీజర్ విడుదల కార్యక్రమాన్నిఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా


సినిమాటోగ్రాఫర్ శివరామ్ చరణ్ మాట్లాడుతూ - "ఏ మాస్టర్ పీస్" సినిమాకు వర్క్ చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు సుకు పూర్వజ్ గారికి థ్యాంక్స్. ఈ సినిమాతో అరవింద్ కృష్ణ మరో లీగ్ లోకి వెళ్లాలని కోరుకుంటున్నా. మనీష్ గారు సెట్ లో ఉంటే చాలా పాజిటివ్ వైబ్స్ ఉండేవి. ఆయన ఉంటే మేమంతా హ్యాపీగా ఉండేవాళ్లం. విలన్ గా ఎంట్రీ ఇస్తున్న మనీష్ గారికి ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నా. సినిమాటోగ్రాఫర్ గా నా బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాను. "ఏ మాస్టర్ పీస్" సినిమా టాలీవుడ్ లో ఒక అరుదైన చిత్రంగా పేరు తెచ్చుకుంటుంది. అన్నారు.

 

నటుడు, నిర్మాత మనీష్ గిలాడ మాట్లాడుతూ - ముందుగా మూడ్ ఆఫ్ ది నేషన్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారికి కంగ్రాట్స్ చెబుతగున్నా. నేను  ఆయన అభిమానిని. ఎంతో ప్యాషన్ తో రాజకీయాల్లోకి పవన్ గారు వచ్చారు. ఎపీ ఎన్నికల్లో ఆయన అద్భుత విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉంది. 17 ఏళ్ల ఎఫర్ట్స్ తర్వాత నేను మీ ముందు ఇలా వేదిక మీద నిలుచుని మాట్లాడుతున్నా. ఇందుకు మా పేరెంట్స్ కు థ్యాంక్స్ చెబుతున్నా. ఇప్పటిదాకా మంచి ఫాదర్ గా, మంచి సన్ గా , మంచి ఫ్రెండ్ గా, మంచి బిజినెస్ మెన్ గా ఉన్నాను. ఇప్పుడు నటుడిగా తెరంగేట్రం చేస్తుంది. "ఏ మాస్టర్ పీస్" సినిమాలో విలన్ గా నటిస్తుండటం సంతోషంగా ఉంది. విలన్ రోల్ లో మిమ్మల్ని మెప్పిస్తాననే ఆశిస్తున్నాం. ఈ మాస్టర్ పీస్ మాస్టర్ క్లాస్ గా ఉంటుంది. అరవింద్ కృష్ణ నా బెస్ట్ ఫ్రెండ్. మేము కలిసే చదువుకున్నాం. దర్శకుడు సుకు పూర్వజ్ ఒక గొప్ప విజన్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మా అందరి కెరీర్ లో గుర్తుండిపోయే "ఏ మాస్టర్ పీస్" మూవీ అవుతుందని ఆశిస్తున్నాం. మా కాస్ట్ అండ్ క్రూ అంతా కలిసి ఒక అద్భుతమైన సినిమాను రూపొందించాం. అన్నారు.


దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ - మనం వరల్డ్ సినిమాలోని ఎన్నో సూపర్ హీరోల సినిమాలను చూశాం. నాకూ చాలా సూపర్ హీరోల సినిమాలు ఇష్టం. ఆ సూపర్ హీరో క్యారెక్టర్ కు మన పురణాల నేపథ్యాన్ని జోడిస్తే మన నేటివ్ సూపర్ హీరో ఫిల్మ్ చేయొచ్చనే ఐడియాతో "ఏ మాస్టర్ పీస్" సినిమాను ప్రారంభించాను. ఇందులో మన మైథాలజీ సోల్ ఉంటుంది. భాగవతంలోని జయ విజయుల నేపథ్యంతో హీరో, విలన్ క్యారెక్టర్స్ ను డిజైన్ చేశాం. మైథాలజీని, సైన్స్ ఫిక్షన్ ను కలిపేందుకు శివుడి పాత్రను సంధానంగా తీసుకున్నా. ఇది పురాణాల్లో ఉండదు. కల్పిత పాత్రగా రాసుకున్నా. అందుకే మా పోస్టర్ లో మిథ్స్ రీఇమాజిన్ డ్ అని రాశాం. చిన్న ప్రాజెక్ట్ గా "ఏ మాస్టర్ పీస్" మూవీ మొదలైంది. సినిమా షూటింగ్ ప్రాసెస్ బిగ్ స్కేల్ కు వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు మనీష్ గిలాడ, సినిమా బండి ప్రొడక్షన్స్ శ్రీకాంత్  నిర్మాణంలో యాడ్ అయ్యారు. హాలీవుడ్ మూవీస్ కు పోస్ట్ ప్రొడక్షన్ చేసే మెర్జ్ ఎక్స్ ఆర్ మా టీమ్ లో జాయిన్ అయ్యింది. వాళ్లు చేసిన వీఎఫ్ఎక్స్ మీకు అద్భుతమైన ఫీల్ కలిగిస్తాయి. ఈ జర్నీలో హీరో అరవింద్ కృష్ణ, నిర్మాత మనీష్ గిలాడ, ప్రొడ్యూసర్ శ్రీకాంత్, మెర్జ్ ఎక్స్ ఆర్ ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. మనీష్ గిలాడ లేకుంటే ఈ ప్రాజెక్ట్ ఈ స్కేల్ లో వచ్చేది కాదు. అరవింద్ కృష్ణ నాకు బ్రదర్ లాంటివాడు. సూపర్ హీరో సినిమా మరో పెద్ద హీరోను ట్రై చేయొచ్చు కదా అని కొందరు అన్నారు. అరవింద్ లాంటి పర్సనాలిటీ ఉన్న హీరోనే సూపర్ హీరోగా ఇమాజిన్ చేసుకున్నాను. నా వైఫ్ జ్యోతి పూర్వజ్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. ప్రస్తుతం క్లైమాక్స్ మినహా షూటింగ్ పూర్తయింది. పది రోజుల పాటు క్లైమాక్స్ షూట్ చేయబోతున్నాం. మేకింగ్ లో నా టీమ్ అంతా ఎంతో సపోర్ట్ చేశారు. ఇది ఫస్ట్ పార్ట్ మూవీ. రిలీజ్ అప్డేట్ ను త్వరలో వెల్లడిస్తాం. అన్నారు.


నిర్మాత శ్రీకాంత్ కండ్రేగుల మాట్లాడుతూ - "ఏ మాస్టర్ పీస్" సినిమా ప్రారంభమైనప్పుడు సుకు ఒక్కడే ఉన్నాడు. ఆ తర్వాత నేను ప్రాజెక్ట్ లోకి వచ్చాను. తెలుగులో మా సినిమా బండి బ్యానర్ మీద ఒక ప్రాపర్ సూపర్ హీరో సినిమా చేయాలని ఈ ప్రాజెక్ట్ బిగిన్ చేశాం. ఒక టైమ్ లో మూవీని మరో స్కేల్ కు తీసుకెళ్లాలని అనుకున్నప్పుడు మనీష్ చాలా సపోర్ట్ చేశాడు. అరవింద్, మనీష్ ఇద్దరూ నాకు బ్రదర్స్ లాంటి వాళ్లు. మా మూవీ టీమ్ అంతా ఒక ఫ్యామిలీలా పనిచేశాం. నేను యూఎస్ లో ఉంటూ ఈ ప్రాజెక్ట్ చూసుకోలేనని పూర్తిగా మనీష్ మీద వదిలేశాను. మనీష్ కోసమే గోవా నుంచి ఈ టీజర్ లాంఛ్ కు వచ్చాను. ఈ సినిమాకు భారీ వీఎఫ్ఎక్స్ కావాల్సివచ్చినప్పుడు మెర్జ్ ఎక్స్ ఆర్ నుంచి ప్రజయ్ జాయిన్ అయ్యారు. ఈ సినిమాలో 1500కు పైగా వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉంటాయి. మెర్జ్ ఎక్స్ఆర్ రీజనల్ హెడ్ యోగికి థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.


హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ - సీరియల్స్ ద్వారా నేను మీకు పరిచయమే. "ఏ మాస్టర్ పీస్" సినిమాతో నటిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నా. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నా పర్సనల్ లైఫ్ ఒక టర్న్ తీసుకుంది. సుకుతో నా మ్యారేజ్ జరిగింది. అప్పటినుంచి టాలీవుడ్ నా మెట్టినిల్లు అయిపోయింది. "ఏ మాస్టర్ పీస్" సినిమా టీజర్ చూశారు మీకు నచ్చిందని ఆశిస్తున్నా. దర్శకుడు సుకు నా మూవీలో నా క్యారెక్టర్ గురించి చెప్పారు. ఈ మూవీ టీమ్ అంతా ఫ్యామిలీలా మారిపోయారు. ఇక నుంచి మూవీస్ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాధవ్ మాట్లాడుతూ - "ఏ మాస్టర్ పీస్" సినిమాకు వర్క్ చేసే అవకాశం కల్పించిన మా గురువు సుకు పూర్వజ్ గారికి థ్యాంక్స్. ఆయనకు సినిమానే లోకం. ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తారు. అరవింద్ కృష్ణ ఈ సినిమా తర్వాత చాలా మంచి పేరు తెచ్చుకుంటాడు. మనీష్ గారు లేకుంటే ఈ ప్రాజెక్ట్ ఇంత బాగా వచ్చేది కాదు. నిర్మాత శ్రీకాంత్ గారికి జ్యోతి గారికి ఇతర టీమ్ మెంబర్స్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.


హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ - "ఏ మాస్టర్ పీస్" సినిమా ఆఫర్ నాకు సుకు ఇచ్చే ముందే నాకు కొడుకు పుట్టాడు. నా కొడుకుకు నేను సూపర్ హీరోలా ఉండాలని అనుకున్నా. అదే టైమ్ లో సుకు ఈ మూవీ ఆఫర్ అందించాడు. మనీష్ నేను కాలేజ్ ఫ్రెండ్స్. మమ్మల్ని ప్రిన్సిపాల్ రూమ్ లో చూసిన తర్వాత ఇదే వేదిక మీద మా పేరెంట్స్ మమ్మల్ని చూడటం. మేము ప్రయోజకులం అయ్యామని చెప్పేందుకే మా పేరెంట్స్ ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేశాం. మనీష్ గురించి మాట్లాడితే నేను ఎమోషనల్ అవుతాను. నాకు జీవితంలో ప్రతిసారీ వాడే ఇస్తున్నాడు వాడే సపోర్ట్ చేస్తున్నాడు. నేను వాడికి చేసిందేం లేదు. ఇప్పుడు కూడా నాకోసమే ఈ మూవీ ప్రొడ్యూస్ చేశాడు. మనీష్ నీకోసం ఏదైనా మంచి పని చేయాలని, నువ్వు గర్వపడేలా నేను ఉండాలని అనుకుంటున్నా. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. సుకు పూర్వజ్ నాకు గురూజీ లాంటి వాడు. నేను సినిమాలు వదిలేసిన టైమ్ లో నీలాంటి హీరో ఇండస్ట్రీలో ఉండాలి, సినిమాలు చేయాలని చెప్పి ఎంకరేజ్ చేశాడు. ఆయన డైరెక్షన్ లో శుక్ర మూవీ చేశాను. సుకుకు రీసెంట్ గా మ్యారేజ్ అయ్యింది. అయితే ఆయన నాతో మూవీ డిస్కషన్స్ లో ఉన్న టైమే ఎక్కువ. జ్యోతికి ఇది కోపం వచ్చే విషయమే. కొద్ది రోజులు అయితే మీ ఆయనను మీకు ఇచ్చేస్తాం. ఆత్మవిశ్వాసంతో మూవీ ఔట్ పుట్ చూసి చెబుతున్నాను. "ఏ మాస్టర్ పీస్" సినిమా మనం గర్వంగా చెప్పుకునే సూపర్ హీరో మూవీ అవుతుంది. అన్నారు.నటీనటులు - మనీష్ గిలాడ, అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్, స్నేహ గుప్త, అర్చనా అనంత్, జయప్రకాశ్, తదితరులు


టెక్నికల్ టీమ్


సినిమాటోగ్రఫీ- శివరామ్ చరణ్

సంగీతం- ఆశీర్వాద్

ఎడిటర్ - సుకు పూర్వజ్ ,మనోజ్ కుమార్. బి, శివ శర్వాని

కాస్ట్యూమ్స్ - ఉదయశ్రీ  పూర్వజ్, సలీనా విలియమ్స్( యూకే)

స్టంట్స్ - రాజ్ కుమార్ గంగపుత్ర

పీఆర్వో - జీఎస్ కే మీడియా

బ్యానర్స్ - సినిమా బండి, మెర్జ్ ఎక్స్ ఆర్

నిర్మాత - శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ , ప్రజయ్ కామత్

రచన, దర్శకత్వం - సుకు  పూర్వజ్
 

Amitabh Bachchan Kalki 2898 AD Poster

కౌంట్‌డౌన్ బిగిన్స్ ! ‘కల్కి 2898 AD’ న్యూ పోస్టర్‌లో అశ్వత్థామగా యుద్ధానికి సిద్ధమైన అమితాబ్ బచ్చన్మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’ భారీ అంచనాలతో కూడిన ట్రైలర్ విడుదలకు కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, మేకర్స్ మూవీపై వున్న ఎక్సయింట్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెలుతున్నారు. ఈరోజు, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన అశ్వత్థామ అవతార్ లోఉన్న కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో లాంచ్ చేశారు. అమితాబ్ యుద్దభూమి మధ్యలో నిలబడి, అస్త్రాన్ని పట్టుకుని, నుదిటిపై ఒక దివ్య రత్నాన్ని ధరించి, యుద్ధానికి సిద్ధంగా వున్నట్లుగా కనిపించారు. అతని వెనుక ఒక లైఫ్ సైజు వెహికిల్ తో పాటు కొంతమంది వ్యక్తులు నేలపై పడివుండటం గమనించవచ్చు.


“అతని నిరీక్షణ ముగుస్తోంది... మూడు రోజుల్లో #Kalki2898AD ట్రైలర్, జూన్ 10న విడుదల” అని సోషల్ మీడియాలో షేర్ చేశారు మేకర్స్.  


https://www.instagram.com/p/C75-X9BvxdL/?igsh=MWx3NG1qM3Jkdmw5aQ==


అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్ర మధ్యప్రదేశ్‌లోని నెమావార్, నర్మదా ఘాట్ వద్ద ఒక మ్యాసీవ్ ప్రొజెక్షన్ ద్వారా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నెమవార్, నర్మదా ఘాట్‌ల ఎంచుకోవడం గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంది, ఎందుకంటే అశ్వత్థామ ఇప్పటికీ నర్మదా మైదానంలో నడుస్తాడని నమ్ముతారు. ఈ మూవీ, తన పాత్ర కోసం అభిమానుల్లో మరింత ఎక్సయిట్మెంట్ పెంచింది.


'కల్కి 2898 AD' లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.  మల్టీలింగ్వెల్, మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్  సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ఫ్యూచర్ లో సెట్ చేయబడింది. ఈ చిత్రం 2024 జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

 

Introducing Ananthika Sanilkumar As Shuddhi Ayodhya From 8 Vasanthalu

 మైత్రీ మూవీ మేకర్స్, ఫణీంద్ర నర్సెట్టి '8 వసంతాలు' నుంచి శుద్ధి అయోధ్యగా అనంతిక సనీల్‌కుమార్‌ పరిచయం  మోస్ట్ సక్సెస్ ఫుల్ పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బిగ్ స్టార్లతో హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లను నిర్మించడమే కాకుండా కంటెంట్-రిచ్ మూవీలను రూపొందిస్తోంది. గోవా, ఖాట్మండు మోఫిల్మ్ ఫెస్టివల్స్ లో రెండుసార్లు ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకుని విమర్శకుల ప్రశంసలు పొంది 'మను'తో దర్శకుడిగా డెబ్యు చేసి దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టితో కాన్సెప్ట్ బేస్డ్ మూవీ '8 వసంతాలు'ను నిర్మిస్తున్నారు.  


MAD ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ హీరోయన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆమె పాత్రను శుద్ధి అయోధ్యగా పరిచయం చేశారు మేకర్స్. చెమ్మగిల్లిన కళ్లతో కదులుతున్న కవితలా, నవ్వుతూ కనిపించారు. కళ్లకు మాస్కరా, చెవిపోగులు, నోస్ రింగ్ ఆమెను మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేశాయి.


ఆమె సెన్సిబుల్ డాటర్, మంచి స్నేహితురాలు, అన్ కండీషనల్ లవర్, ఇంటెన్స్ మార్షల్ ఆర్ట్స్ స్టూడెంట్, ఇన్స్పైరింగ్ రైటర్, గ్రేస్ ఫుల్ హ్యూమన్ బీయింగ్. శుద్ధి అయోధ్య 19 ఏళ్ల నుండి 27 ఏళ్ల యువతి వరకు 8 సంవత్సరాల వ్యవధిలో విభిన్నమైన వ్యక్తులు, భావోద్వేగాలు, ప్రదేశాలను ఎక్స్ ప్లోర్ చేయడంలో8 వసంతాల ట్రాన్స్ ఫర్మేషన్ జర్నీని ప్రజెంట్ చేస్తోంది.  


ఆమె వ్యక్తిత్వం ఆమె పేరు శుద్ధిని ప్రతిబింబిస్తుంది, ఆమె జీవితంలోని ప్రతి అంశంలో 'స్వచ్ఛత' గా వుంటుంది. ఆమె మాటలు, ఆలోచనలు, పనులు,  దయ, డిగ్నిటీ ని ప్రజెంట్ చేస్తాయి. ఒక లైన్ లో చెప్పాలంటే  SHE IS POETRY IN MOTION.


ఆకట్టుకునే కోట్స్‌తో పాటు పోస్టర్‌లతో దర్శకుడు తన పొయిటిక్ సైడ్ ని చూపించాడు. టైటిల్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తూ అనంతిక ఫస్ట్-లుక్ పోస్టర్ 8 వసంతాల వరల్డ్ చూడాలని కోరుకునేలా చేస్తుంది.


నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వనాథ్ రెడ్డి డీవోపీ కాగా, నరేష్ కుమారన్ సంగీతం అందిస్తున్నారు. అరవింద్ ములే ప్రొడక్షన్ డిజైనర్ కాగా, శశాంక్ మాలి ఎడిటర్. బాబాసాయి కుమార్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.


ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.


తారాగణం: అనంతిక సనీల్‌కుమార్


సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: ఫణీంద్ర నర్సెట్టి

నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్

బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్

సీఈవో: చెర్రీ

సంగీతం: నరేష్ కుమారన్

డీఓపీ: విశ్వనాథ్ రెడ్డి

ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మ్యూల్

ఎడిటర్: శశాంక్ మాలి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబాసాయి కుమార్ మామిడిపల్లి

యాక్షన్ కొరియోగ్రఫీ: వింగ్ చున్ అంజి

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షో


The Birthday Boy Title Glimpse Unveiled

 ది బ‌ర్త్‌డే బాయ్ టైటిల్ గ్లింప్స్ విడుద‌లఇప్పుడు రొటిన్ క‌థ‌ల‌కు కాలం చెల్లింది. అందుకే ఇప్పుడు కొత్త వాళ్లు కొత్త కంటెంట్‌తో వైవిధ్య‌మైన అప్రోచ్‌తో సినిమాలు తీస్తూ కంటెంట్ ఈజ్ కింగ్ అని నిరూపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా అదే కోవ‌లో మ‌రో విభిన్న‌మైన ఎంట‌ర్‌టైన‌ర్ రాబోతుంది. ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌క‌న‌కాల  ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం ది బ‌ర్త్‌డే బాయ్‌. బొమ్మ బొరుసా ప‌తాకంపై నిర్మాణం జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి విస్కి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌ను శుక్ర‌వారం విడుద‌ల చేశారు మేక‌ర్స్‌.. ఇద్ద‌రూ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్న ఫ‌న్ని సంభాష‌ణ‌తో ఈ టైటిల్ గ్లింప్స్ ప్రారంభ‌మై చిత్రంలో పాత్ర‌ల‌ను ప‌రిచయం చేస్తూ ఓపెన్ అవుతుంది. ద‌ర్శ‌కుడు చిత్ర విశేషాల‌ను తెలియ‌జేస్తూ ఇదొక కామెడీ డ్రామా. చిత్రంలోని ప్ర‌తి పాత్ర ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ఎం.ఎస్ చ‌ద‌వ‌డానికి విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు ఐదుగురు  చిన్న‌నాటి స్నేహితుల‌కు జ‌రిగిన సంఘ‌ట‌న ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం. ఈ సినిమా స‌హ‌జ‌త్వం కోసం సింక్ సౌండ్ వాడాం.  కంటెంట్‌తో పాటు మంచి టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రం వుండ‌బోతుంది. ఒక మంచి క్వాలిటీ సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌డానికి ప్ర‌య‌త్నించాం. త‌ప్ప‌కుండా చిత్రం అంద‌రికి న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం వుంది అన్నారు.

ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌క‌న‌కాల, ప్ర‌మోదిని, వాకా మ‌ని,  రాజా అశోక్‌, వెంక‌టేష్, సాయి అరుణ్‌, రాహుల్ త‌దిత‌రులు ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఐ.భ‌ర‌త్‌,

డీఓపీ : సంకీర్త్ రాహుల్‌,  సంగీతం: ప్ర‌శాంత్ శ్రీ‌నివాస్, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: ఏఆర్ వంశీ.జి, ఎడిట‌ర్‌: న‌రేష్ ఆడుపా, సింక్ సౌండ్ డిజైన్‌:

సాయి మ‌ణిధ‌ర్ రెడ్డి, సౌండ్ మిక్సింగ్‌: అర‌వింద్ మీన‌న్‌, మేక‌ప్ చీఫ్‌:

వెంక‌ట్ రెడ్డి, డిజిటల్ మార్కెటింగ్‌: ఫ‌స్ట్ షో, పీఆర్ ఓ: ఏలూరు శ్రీ‌ను, మ‌డూరి మ‌ధు

Matka New Shooting Schedule Begins from 19th June

 మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కరుణ కుమార్, వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా మూవీ 'మట్కా' కొత్త షూటింగ్ షెడ్యూల్ జూన్ 19 నుంచి ప్రారంభం- హైదరాబాద్‌లో మ్యాసీవ్ సెట్‌ నిర్మాణంమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మేడిన్ పాన్-ఇండియన్ మూవీ మట్కా. పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో రజనీ తాళ్లూరి  SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఈ మూవీని హ్యుజ్ కాన్వాస్‌పై హైబడ్జెట్, టాప్ టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిస్తున్నారు.


జూన్ 19 నుంచి మట్కా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ కోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మ్యాసీవ్ సెట్‌ను నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ 4 డిఫరెంట్ గెటప్‌లలో కనిపించనున్న ఈ చిత్రంలో మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు, యావత్ దేశాన్ని కదిలించిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా కథ డిఫరెంట్ టైమ్స్ లో సెట్ చేయబడింది. త్వరలో మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌లు మేకర్స్ తెలియజేస్తారు.


వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఓపెనింగ్ బ్రాకెట్ టీజర్ విడుదల చేయగా దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. టీజర్ సినిమా ప్రిమైజ్ ని అద్భుతంగా చూపింది. నవీన్ చంద్ర, పి రవి శంకర్ వంటి కొన్ని ముఖ్యమైన పాత్రలను కూడా పరిచయం చేసింది.


ఈ చిత్రానికి ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రాఫర్, జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.


తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన నోరా ఫతేహి,  మీనాక్షి చౌదరి నటిస్తున్నారు.


తారాగణం: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు


సాంకేతిక సిబ్బంది:

కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్

నిర్మాతలు: డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి

బ్యానర్లు: వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్

సంగీతం: జివి ప్రకాష్ కుమార్

డీవోపీ: A కిషోర్ కుమార్

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్

సీఈఓ: ఈవీవీ సతీష్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్కే జానా, ప్రశాంత్ మండవ, సాగర్

కాస్ట్యూమ్స్: కిలారి లక్ష్మి

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా


OC movie Review

 

Check out the Review of OC movie starring Harish Bompelli, Manya Saladi, Royal Shree, Lakshmi Kiran and others. Directed by Vishnu Bompelli Produced by BVS under Kaundinya Productions. Music composed by Bhole Shivali and Satya Master done choreography 


Story


This 'OC' is the story of Basti boys who think only cinema is their life. Rock (Harish Bompelli), Magnet (Royal Shree) and Kamal Haasan (Lakshmi Kiran) are three best friends in a slum in the process of becoming cinema actors they will enter in that problem ? What is that problem how they come out ?did their dream come true forms the rest of the story

Performance 

In this segment we must appreciate Harish Bompelli who is the newcomer to the silver screen impressed with his acting skills he Acted very maturely. Particularly in action and emotional scenes he has done his best 

Royal Shree and Lakshmi Kiran who acted as the hero's friends has given their best 

Manya Saladi has got good potential role she has given her best and rest has cast has done as per the requirement 


Technical aspects:

In this segment we should appreciate producers for their production values .Director Vishnu has done his job perfectly he tried his best to engage audiences Cinematography is good music has played vital role to elevate the music 


On whole OC is a Decent attempt with Some Entertainment 


Telugucinemas.in Rating: 3/5

"Bhaje Vaayu Vegam" Thanks Meet

 "భజే వాయు వేగం" సినిమా మా అందరి నమ్మకాన్ని నిలబెట్టింది - థ్యాంక్స్ మీట్ లో హీరో కార్తికేయ
ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన సినిమా "భజే వాయు వేగం". ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. రీసెంట్ గా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన "భజే వాయు వేగం" సినిమా అన్ని చోట్ల నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్ లో థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా


డైలాగ్ రైటర్ మధు శ్రీనివాస్ మాట్లాడుతూ -  "భజే వాయు వేగం" సినిమాకు మంచి సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. మంచి సినిమా తనను తానే నిలబెట్టుకుంటుంది. తనను తానే ప్రూవ్ చేసుకుంటుంది అనేందుకు ఈ సినిమా ఫలితమే నిదర్శనం. టీమ్ అందరికీ కంగ్రాట్స్. అన్నారు.


బీజీఎం అందించిన కపిల్ కుమార్ మాట్లాడుతూ - "భజే వాయు వేగం" సినిమా మా టీమ్ అందరికీ ఎన్నో మంచి ఎక్సీపిరియన్స్ లు మిగిల్చింది. ఈ టీమ్ లో చివరగా జాయిన్ అయ్యింది నేనే. ఆరు నెలల పాటు ఈ సినిమా బీజీఎం కోసం వర్క్ చేశాం. దర్శకుడు ప్రశాంత్ నేను రోజూ బీజీఎం ఎలా ఉండాలో డిస్కస్ చేసుకుని డిజైన్ చేశాం. ప్రశాంత్  తన కథకు బీజీఎం ఎలా ఉండాలో చాలా క్లియర్ గా చెప్పేవాడు. "భజే వాయు వేగం" సినిమాకు మ్యూజిక్ కు మంచి పేరు రావడం హ్యాపీగా ఉంది. అన్నారు.


ఎడిటర్ సత్య జి మాట్లాడుతూ - నేను, డైరెక్టర్ ప్రశాంత్ ఫ్రెండ్స్. యూవీలో రన్ రాజా రన్ నుంచి వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఎడిటర్ గా, ప్రశాంత్ డైరెక్టర్ గా సక్సెస్ ఫుల్ సినిమా చేసి ఈ వేదిక మీద నిలబడి మాట్లాడుతుండటం సంతోషంగా ఉంది. "భజే వాయు వేగం"తో డైరెక్టర్ గా ప్రశాంత్ కు హిట్ రావడం నాకు ఆనందాన్నిచ్చింది. మా అందరికీ సపోర్ట్ ఇచ్చిన యూవీ సంస్థకు థ్యాంక్స్ చెబుతున్నాం. అన్నారు.


యాక్టర్ రాహుల్ టైసన్ మాట్లాడుతూ - "భజే వాయు వేగం" సినిమాకు విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈ సక్సెస్ తో కార్తికేయ హీరోగా వంద అడుగులు ముందుకు వేశాడని భావిస్తున్నా. అతనికి మరిన్ని విజయాలు రావాలి. దర్శకుడు ప్రశాంత్ ప్రతిభకు దక్కిన చిన్న విజయమిది. ఆయన ఇంకా పెద్ద దర్శకుడిగా పేరు తెచ్చుకుంటారు. సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఆయనకు మెసేజ్ లు పంపించేవాడిని. నీలో చాలా టాలెంట్ ఉంది. దర్శకుడిగా ఎదుగుతావు అని. ఎందుకంటే ప్రతి క్రాఫ్ట్ లో అతనికి పట్టు ఉంది. చాలా కన్విక్షన్ తో మూవీ తెరకెక్కించాడు. ఈ సినిమాలో కార్తికేయ నేను ఎలాంటి బేషజాలు లేకుండా కలిసి నటించాం. అందుకే స్క్రీన్ మీద మీకు అంత సహజంగా సీన్స్ వచ్చాయి. కపిల్ మ్యూజిక్, సత్య ఎడిటింగ్, మధు శ్రీనివాస్ డైలాగ్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. నాకు ఇలాంటి మంచి మూవీలో అవకాశం ఇచ్చిన యూవీ సంస్థకు థ్యాంక్స్. "భజే వాయు వేగం" సినిమా టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.


దర్శకుడు ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ - "భజే వాయు వేగం" మంచి సినిమా కాబట్టే ప్రేక్షకులు తమ మౌత్ టాక్ తో అందరికీ తెలిసేలా చేశారు. మా సినిమాకు ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్ కు థ్యాంక్స్. మూవీ షూటింగ్ లో మా డైరెక్షన్ టీమ్ ఇచ్చిన సహకారం మర్చిపోలేను. మీ అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. యూవీ వంశీ అన్న ప్రమోద్ అన్న విక్కీ అన్నకు థ్యాంక్స్. మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాననే భావిస్తున్నా. ఈ ప్రాజెక్ట్ లో ఫస్ట్ జాయిన్ అయ్యింది డైలాగ్ రైటర్ మధు శ్రీనివాస్ అన్న. స్టోరీ డిస్కషన్ నుంచి సినిమా రిలీజ్ ముందు ప్రింట్స్ పంపించే టైమ్ లో చేసిన డైలాగ్ కరెక్షన్స్ వరకు నాతో ట్రావెల్ అయ్యారు. నా ఫ్రెండ్ సత్య. ఈ సినిమాకు కొన్ని వెర్షన్స్ ఎడిట్ చేయించా. ఎంతో పేసీగా సినిమాను ఎడిట్ చేశాడు. బీజీఎఎం చేసిన కపిల్ మా టీమ్ లో చివరగా జాయిన్ అయ్యి బెస్ట్ వర్క్ ఇచ్చాడు. రాహుల్ మా టీమ్ లో యాడ్ అవడం ఎంతో అడ్వాంటేజ్ అయ్యింది. హీరోయిన్ ఐశ్వర్యను ట్రైలర్ లో ఎందుకు చూపించలేదో మీకు సినిమా చూశాక అర్థమై ఉంటుంది. ఆమె కూడా అర్థం చేసుకుని మాకెంతో సపోర్ట్ చేసింది. ఐశ్వర్యకు థ్యాంక్స్. హీరో కార్తికేయ నన్ను ఎంతో నమ్మి ఈ సినిమాలో నటించాడు. ఒక్క రోజు కూడా నన్ను క్వశ్చన్ చేయలేదు. ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ తన సపోర్ట్ ఈ మూవీకి ఎంతో ఉంది. కార్తికేయ లాంటి మంచి హీరోయిక్ పర్సనాలిటీ ఉన్నా ఆయన టోన్ డౌన్ చేసి సినిమాకు ఎంత కావాలో అంతే చూపించాను. రవిశంకర్, భరణి గారు ఇవాళ ట్రావెలింగ్ లో ఉండి సక్సెస్ మీట్ కు రాలేకపోయారు. వాళ్ల పర్ ఫార్మెన్స్ లకు మంచి పేరొచ్చింది.  కార్తికేయ లాంటి హీరో కొత్త దర్శకుడికి దొరికితే ఆ కంఫర్ట్ వేరేలా ఉంటుంది. అన్నారు.


హీరో కార్తికేయ మాట్లాడుతూ - "భజే వాయు వేగం" సినిమా నాకు హీరోగా ఎంతో సంతృప్తినిచ్చింది. ఎలాంటి సినిమా చేయాలి అని అర్థం కాని టైమ్ లో డైరెక్టర్ ప్రశాంత్ నాకు దారి చూపించడం తో పాటు విజయం అనే టార్చిలైట్ ఇచ్చాడు. ఏడాది టైమ్ లో రెండో సక్సెస్ అందుకున్నా. బెదురులంక తర్వాత "భజే వాయు వేగం" విజయాన్ని ఇచ్చింది. గతంలో నా గురించి రాసేప్పుడు మరో అపజయం అందుకున్నాడు అని రాసేవారు. ఇప్పుడు అనదర్ హిట్ అని రాస్తున్నారు. అవి చూస్తుంటే హ్యాపీగా ఉంది.  "భజే వాయు వేగం" రిలీజ్ అయ్యాక మా డైరెక్టర్ ప్రశాంత్ కలెక్షన్స్, షోస్ పెరగడం గురించి మాట్లాడుతుంటే నేను రిలాక్స్ అవుతూ ఉండేవాడిని. అవేమీ నేను పట్టించుకోలేదు. ఒక మంచి మూవీ చేశాం అనే సంతృప్తి నాకు మిగతా అన్నింటికన్నా హ్యాపీనెస్ ఇచ్చింది. ఒక మంచి సినిమా అవుతుందని మేము "భజే వాయు వేగం" మీద పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. ఇకపై నేను చేసే సినిమాలు మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటా. ఆర్ఎక్స్ 100 తర్వాత మళ్లీ మరో మంచి సినిమా చేశావంటూ నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ చెబుతున్నారు. "భజే వాయు వేగం" సినిమా ఒప్పుకున్నప్పటి నుంచి ప్రతి స్టేజ్ లో మూవీ బెటర్ అవుతూ, మా నమ్మకం పెరుగుతూ వచ్చింది. అది ఇవాళ థియేటర్స్ లో ఆదరణ రూపంలో కనిపిస్తోంది. నాతో కలిసి నటించిన ఐశ్వర్య, రాహుల్, డైరెక్టర్ ప్రశాంత్, యూవీ బ్యానర్, మా మూవీ టీమ్ మెంబర్స్ అందిరికీ థ్యాంక్స్. అన్నారు.


Sashikiran Tikka Interview About Satyabhama

 “సత్యభామ” సినిమాలో కొత్త కాజల్ ను చూస్తారు - మూవీ ప్రెజెంటర్, స్క్రీన్ ప్లే రైటర్ శశికిరణ్ తిక్క
'గూఢచారి', 'మేజర్' చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు శశికిరణ్ తిక్క. ఆయన ప్రెజెంటర్, స్క్రీన్ ప్లే రైటర్ గా వర్క్ చేసిన మూవీ “సత్యభామ”. 'క్వీన్ ఆఫ్ మాసెస్' కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది. శ్రీనివాసరావు తక్కలపల్లి, బాబీ తిక్క ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించారు. “సత్యభామ” సినిమాకు సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. రేపు ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న నేపథ్యంలో మూవీ హైలైట్స్ తెలిపారు చిత్ర సమర్పకులు, స్క్రీన్ ప్లే రైటర్ శశికిరణ్ తిక్క.


- నిన్న “సత్యభామ” సినిమా ప్రీమియర్స్ వేశాం. చూసిన వాళ్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూకేలో ఉండే మా మిత్రులు రమేశ్, ప్రశాంత్ చెప్పిన కథతో ఈ సినిమా జర్నీ మొదలైంది. ఆ పాయింట్ నచ్చి నేను, దర్శకుడు సుమన్ డెవలప్ చేశాం. అప్పుడు మేజర్ సినిమా జరుగుతోంది. అది పూర్తయ్యాక సెట్స్ మీదకు తీసుకెళ్లాలని అనుకున్నాం. కాజల్ గారికి “సత్యభామ” కథ చెప్తే ఆమెకు వెంటనే నచ్చింది. అలా ప్రాజెక్ట్ బిగిన్ అయ్యింది.


- నాకు దర్శకుడిగా చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నా స్క్రిప్ట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకే “సత్యభామ” సినిమాకు దర్శకత్వం వహించలేదు. పైగా మా అవురమ్ ఆర్ట్స్ పై మరిన్ని మూవీస్ చేయాలనుకుంటున్నాం. కాను ప్రొడ్యూసర్ గా అనుభవం కావాలి. డైరెక్షన్ ప్రొడక్షన్ తో పాటు ఎడిటింగ్ కూడా చేయాలని ఉంది.


- మూవీ ప్రెజెంటర్ గా సినిమా మేకింగ్ లో మరో కోణాన్ని చూశాను. దర్శకుడిగా నేను ప్రొడక్షన్ కాస్ట్ ను చెప్పినంతలో చేస్తాననే పేరుంది. ఇప్పుడు “సత్యభామ” నిర్మాత అనుభవాలు ఎలా ఉంటాయో తెలిసింది. ఓవరాల్ గా ప్రొడక్షన్ సైడ్ చాలా విషయాలు నేర్చుకున్నాను. సినిమా మేకింగ్ ను వైడ్ యాంగిల్ నుంచి తెలుసుకున్నా. దర్శకత్వం అమ్మలాంటి పని అయితే నిర్మాతగా ఉండటం నాన్న లాంటి బాధ్యత.


- కాజల్ గారు వెరీ యాక్టివ్. ఆమె అలసిపోయి ఉండటం ఎప్పుడూ చూడలేదు. షూటింగ్ టైమ్ లో ఆమె ఎనర్జీ మా అందరికీ ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేది. ఈ సినిమాలో కాజల్ గారు చేసిన యాక్షన్ సీక్వెన్సులు చాలా స్పెషల్. అవి ప్రేక్షకులను అలరిస్తాయి. ముఖ్యంగా ఎమోషన్ ఈ మూవీలో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఎన్నో పోలీస్ స్టోరీస్ వచ్చినా ఎమోషనల్ గా “సత్యభామ” స్పెషల్ గా ఉంటుంది. ఈ రోజు ఆడియెన్స్ కు తగినట్లు ఫ్రెష్ స్టోరీ టెల్లింగ్ తో ఉండబోతోంది.


- దర్శకుడు సుమన్ చిక్కాల, నేను, శ్రీచరణ్ పాకాల మేమంతా ఫ్రెండ్స్. కలిసే మూవీస్ చేస్తుంటాం. “సత్యభామ” సినిమాకు కూడా అలాగే టీమ్ వర్క్ చేశాం. దర్శకుడిగా సుమన్ వర్క్ ఆకట్టుకుంటుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా మా మూవీ ఉంటుంది. అయితే రెగ్యులర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ లా కేవలం కేసును క్లూలలతో పట్టుకోవడం కాకుండా కథలో ఎమోషన్ బాగా వర్కవుట్ అయ్యింది.


- ఫస్ట్ మేము రిలీజ్ చేసిన సత్యభామ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి సీన్స్ లో కొన్ని ఛేంజెస్ చేశాం. హీరోయిక్ మూవ్ మెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. అయితే అవి కావాలని పెట్టినట్లు కాకుండా సహజంగా కథ జర్నీలో భాగంగా వస్తుంటాయి. కాజల్ అరవై సినిమాల్లో నటించింది. సత్యభామలో కొత్త కాజల్ ను ప్రేక్షకులు చూస్తారు.


- “సత్యభామ” మూవీలో కాజల్ గారు కాకుండా నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్థన్, రవి వర్మ ఇలా మంచి కాస్టింగ్ కీ రోల్స్ చేశారు. వీళ్లు కాకుండా కొందరు  కొత్త వాళ్లు నటించారు. వాళ్లకు ఈ సినిమా రిలీజ్ అయ్యాకు మంచి పేరొస్తుంది. ఈ సినిమా టీమ్ వర్క్ అని చెప్పాలి, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, డైరెక్టర్, నేను, ప్రొడ్యూసర్స్ మేమంతా కలిసే పనిచేస్తూ వచ్చాం. మా మూవీని నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు రిలీజ్ చేస్తున్నారు. ఏపీలో ధీరజ్ మొగిలినేని రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్ లో సారిగమ రిలీజ్ చేస్తోంది. ఓటీటీ సహా ఓవరాల్ గా మా సినిమాకు ట్రేడ్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.


- మా మూవీ ట్రైలర్ లాంఛ్ లో బాలకృష్ణ గారు పాల్గొన్నారు. రీసెంట్ గా ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ లో ఆయన మంచి మెజార్టీతో గెలుపొందడం సంతోషంగా ఉంది. గూఢచారి  2 సినిమాకు వేరేవాళ్లు దర్శకత్వం చేయాలని నేను, శేష్ ముందే అనుకున్నాం. మహేశ్ బాబు గారు మేజర్ సినిమాలో పార్ట్ అయ్యారు. ఆయనకు సత్యభామ సినిమా చూపించాలని అనుకుంటున్నాం.


- దర్శకుడిగా నా నెక్ట్ ప్రాజెక్ట్ ను త్వరలో అనౌన్స్ చేస్తాను. బ్యాక్ టు బ్యాక్ థ్రిల్లర్స్ చేస్తున్నారనే ప్రశ్న నెక్ట్ టైమ్ మనం కలిసినప్పుడు మీరు అడగరు అని భావిస్తున్నా. మల్టీపుల్ జానర్ మూవీస్ చేస్తాను.

"Rakshana" Director-Producer Pranadeep Thakore's Interview

 ‘రక్షణ’ చిత్రాన్ని ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రియలిస్టిక్ అప్రోచ్‌తో తీశాను..  దర్శక నిర్మాత ప్ర‌ణ‌దీప్ ఠాకోర్


 
హ‌రిప్రియ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ నిర్మించిన చిత్రం ‘రక్షణ’. పాయల్ రాజ్‌పుత్ మెయిన్ లీడ్‌గా నటించిన ఈ చిత్రం జూన్ 7న విడుదల కాబోతోంది. ఇప్పటికే రక్షణ టీజర్, ట్రైలర్‌లు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ విశేషాలను పంచుకునేందుు దర్శక నిర్మాత ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ మీడియా ముందుకు వచ్చారు. ఆయన చెప్పిన చిత్ర విశేషాలివే..

‘రక్షణ’ సినిమా మొత్తం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఉంటుంది. బాధితుల కోసం పోరాడే పాత్ర, వారిని రక్షించే కారెక్టర్ కాబట్టి.. సినిమాకు రక్షణ అనే టైటిల్ పెట్టాం. దాని కంటే ముందు రక్షక్ అని తెలంగాణ పోలీసుల వాహనాల పేర్లను కూడా అనుకున్నాం. చివరకు రక్షణ టైటిల్‌ను ఫిక్స్ చేశాం. పూర్తిగా రియలిస్టిక్ అప్రోచ్‌లో సినిమా ఉంటుంది.

కథ రాస్తున్నప్పుడు ఎవ్వరినీ దృష్టిలో పెట్టుకోలేదు. అలా ఓ కారెక్టర్‌ను అనుకుని కథను రాసుకుంటూ వచ్చాను. పోలీస్ పాత్రకు తగ్గ ఫిజిక్ ఉండాలని అనుకున్నాను. ఆ టైంలో ఆర్ఎక్స్ 100 వచ్చింది. ఆమెకు ఈ పాత్ర బాగుంటుందని అనుకున్నాం. అప్రోచ్ అయ్యాం. ఆమెకు కథ బాగా నచ్చింది. అలా సినిమా స్టార్ట్ అయింది.

ఈ సినిమా షూటింగ్ మొత్తంగా 57 రోజులు జరిగింది. అందులో పాయల్ గారిది 47 రోజుల పాటు షూట్ జరిగింది. అగ్రిమెంట్ ప్రకారం ఆమె ప్రమోషన్స్‌కి రావాలి. ప్రమోషన్స్‌కి వచ్చాక బ్యాలెన్స్ అమౌంట్ ఆరు లక్షలు ఇస్తామని చెప్పాను. మంగళవారం తరువాత ఈ మూవీని ప్రమోట్ చేయాల్సింది. కానీ వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ సినిమాకు ఆమె మాత్రమే ముఖ్యం. నేను ఓ కొత్త దర్శక నిర్మాతని. నన్ను ఎవ్వరూ చూడరు. నా మాటలు ఎవ్వరూ వినరు. కాబట్టి ఆమె రావాల్సిందే అని ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేశాను. 20 లక్షలు ఇస్తే వర్చువల్‌గా ప్రమోట్ చేస్తారని ఆమె మేనేజర్ సౌరభ్ ధింగ్రా చెప్పారు.

పాయల్ తన పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ వివాదం పక్కన పెడితే.. ఆమె ప్రమోషన్స్‌కి రాకపోయినా ఆమెకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చేస్తాను. నాకు నా కథ, నా సినిమా మీద నమ్మకం ఉంది. నాకు మంచి డిస్ట్రిబ్యూటర్లు దొరికారు. సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నాను.

పాయల్ రాజ్‌పుత్‌కు ఉన్న ఇమేజ్ వేరు.. చేస్తున్న సినిమా వేరు.. అని చాలా మంది అన్నారు. కానీ కొత్త కొత్త పాత్రలు చేసినప్పుడే హీరో హీరోయిన్లను జనాలు ఆధరిస్తుంటారు. అందుకే పాయల్ ఈ పాత్రకు బాగుంటుందని అనుకున్నాను. ఆమె అద్భుతంగా నటించారు.

గుణ శేఖర్ గారి వద్ద ఒక్కడు, సైనికుడు, రుద్రమ దేవి సినిమాలకు అసిస్టెంట్, కో డైరెక్టర్‌గా పని చేశాను. ఆనంద్ రంగా ' ఓయ్ ' చిత్రానికి, బొమ్మరిల్లు భాస్కర్ ' ఆరంజ్ ' సినిమాకి కో-డైరెక్టర్‌గా పని చేశాను. ఓ పెద్ద కథను పట్టుకుని చాలా వద్దకు వెళ్లాను. కానీ వర్కౌట్ కాలేదు. అందుకే ఓ చిన్న సినిమాను నేనే తీయాలని అనుకున్నాను.

సినిమా తీయడం అనేది క్రియేటివ్ థింగ్. సినిమాను రిలీజ్ చేయడం మార్కెటింగ్ థింగ్. నేను సినిమాను బాగానే తీశాను. కానీ మార్కెటివ్ థింగ్‌లో చాలా పూర్. అందుకే సొంతంగా ఓ నిర్మాతను పట్టుకోలేకపోయాను. ఈ రోజుల్లో సినిమాను తీయడం కంటే.. రిలీజ్ చేయడమే కష్టంగా మారింది.

ఓ పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన ఘటనను స్పూర్తిగా తీసుకుని కల్పిత కథను అల్లుకున్నాను. ఈ సినిమాలో సందేశం కూడా ఉంటుంది. అలా అని సూక్తులు బోధించినట్టుగా, ఉపన్యాసాలు ఇచ్చినట్టుగా ఉండదు.

రక్షణ సినిమా తరువాత పాయల్ గారి ఇమేజ్ పూర్తిగా మారుతుంది. కొత్త పాయల్ రాజ్‌పుత్‌ను చూస్తారు. ఆమెకు ఇకపై మరింత పవర్ ఫుల్ రోల్స్ వస్తాయి.

ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ఇంకా అవ్వలేదు. ట్రైలర్, టీజర్ నచ్చితే.. మా సినిమాను థియేటర్లో మాత్రమే చూడండి.

Sharvari’s Bahubali connect in Munjya!

శర్వారి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ముంజ్యా’లో బాహుబలికి కనెక్ష‌న్‌శర్వారి ప్రధాన పాత్రలో నేష్ విజన్ బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా ‘ముంజ్యా’ అనే చిత్రం రాబోతోంది. ఈ చిత్రంలో సత్య రాజ్ ప్రముఖ పాత్రను పోషించారు. ఇక బాహుబలితో కట్టప్పగా ఫేమస్ అయిన సత్య రాజ్‌తో పని చేసిన అనుభవం గురించి శర్వారి చెబుతూ ఎంతో ఎగ్జైట్ అయ్యారు.


‘ఎస్ఎస్ రాజమౌళి అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన తీసిన బాహుబలికి వీరాభిమానిని. ఆ మూవీని ఎన్నో సార్లు చూశాను. ఇక ఈ చిత్రంలో కట్టప్పగా చేసిన సత్య రాజ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోబోతోన్నానని తెలియడంతో ఎంతో సంతోషించాను.సెట్‌లో మొదటి రోజు నుండి సత్యరాజ్ అంకితభావం, నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఆయన్నుంచి చాలా నేర్చుకున్నాను.


సత్యరాజ్ సర్‌ని సెట్‌లో చూడటంతో ప్రతిరోజూ యాక్టింగ్ వర్క్‌షాప్‌కు హాజరైనట్లుగా ఉంది. అతని బహుముఖ ప్రజ్ఞ, సహనం, పరిపూర్ణ ప్రతిభ అన్నిటినీ మించిపోయింది. అది కామిక్ సీన్ అయినా లేదా ఇంటెన్స్ మూమెంట్ అయినా, సత్యరాజ్ సర్ ఎంతో సెటిల్డ్‌గా ప్రతి సన్నివేశానికి జీవం పోశారు. ఆయనతో కలిసి మళ్లీ పని చేయాలని ఉంది. అలాంటి అవకాశం మళ్లీ వస్తుందని ఆశిస్తున్నాను' అని అన్నారు.


దినేష్ విజన్ సమర్పణలో, ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించిన ముంజ్యా చిత్రాన్ని దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. 2024 జూన్ 7న ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది.

 

'Yevam' is set to hit the marquee worldwide on June 14

హీరోయిన్ చాందిని చైద‌రి, వ‌శిష్ట సింహా, భరత్‌రాజ్‌,ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం యేవ‌మ్‌. ప్రకాష్‌ దంతులూరి . దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు.ఈ సినిమా ట్రైలర్ ని డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా.

చాందిని చౌదరి మాట్లాడుతూ: ముందుగా మీడియా కి థాంక్స్, ట్రైలర్ చూపించగానే డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు చాలా excite అయ్యి లాంచ్ చేసినందుకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను,  ‘యేవమ్’ అనేది మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా. జూన్ 14న రిలీజ్ అవుతుంది.  నేను మొదటి సారి పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నాను, సైకలాజికల్ ఎమోషన్స్ చాలా ఉంటాయి. ఏ సినిమా అయినా ప్రేక్షకులు చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని పాయింట్స్ ప్రీడిక్ట్ చేస్తారు. కాని ఈ సినిమాలో వాళ్ళు ఏం అనుకున్నా దానికి పూర్తి బిన్నంగా అవుతుంది. అవ్వన్నీ ప్రేక్షకులకి చాలా హై ఇస్తాయి, కథ వికారాబాద్ లో జరుగుతుంది, తెలంగాణ కల్చర్ కి సంబంధించిన ఎలెమెంట్స్ కూడా ఉంటాయి.


 డైరెక్టర్ ప్రకాష్ దంతులూరి మాట్లాడుతూ: ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి క్యారెక్టర్ పోస్టర్స్ ని రిలీజ్ చేశాం, ప్రతి క్యారెక్టర్ కి ఒక్కో ట్యాగ్ లైన్ క్యారెక్టర్ కి సరిపడా ఇచ్చాం, ఈ 4 విభిన్నమైన క్యారెక్టర్స్ , వారి వ్యక్తిత్వాలు ఒక అనుకోని పరిస్థితిలో కలుసుకుని అక్కడి నుండి ప్రయాణం మొదలు పెడితే ఎమవుతుంది అనే థ్రిల్లింగ్ పాయింట్ తో నడిచే కథ. నర్రేషన్ చాలా యునిక్ గా ఉంటుంది. చాలా మంది అడిగారు ఈ కథ పేరు ‘యేవమ్’ అంటే ఏంటి? ఇది తెలుగా? హిందీ ఆ? సంస్కృతమా అని. ‘యేవమ్’ అంటే “ఇది ఇలాజరిగింది” అని. ఈ నాలుగు క్యారెక్టర్స్ జర్నీ లో కొన్ని టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. ఏది మంచి ఏదో చెడు? ఎవరు మంచి ఎవరు చెడ్డ? అనే నోటుని మేము ప్రేక్షకులకే క్లైమాక్స్ అప్పుడు వదిలేస్తున్నాం.  జూన్ 14న రిలీజ్ అవుతుంది.


హీరో భరత్ రాజ్ మాట్లాడుతూ: నేను అభిరామ్ అనే పాత్ర పోషించాను. మా ట్రైలర్ లాంచ్ చేసిన అనిల్ రావిపూడి గారికి చాలా థాంక్స్. మాది థ్రిల్లర్ కాబట్టి ఏ చిన్న విషయం భయటకి చెప్పినా కూడా కథ తెలిసే ఛాన్స్ ఉంది, అందుకని నేను ఏం చెప్పలేను ఇప్పుడు. కాని చాలా ఈ థ్రిల్లర్ లో చాలా హై వస్తుంది, ఇంటెలిజెంట్ గా ఉంటుంది, మా రొలెస్ తో మీరు తెలియకుండా ఇంటరాక్ట్ అవుతారు. అని అన్నారు.

 

Hero Navdeep Interview About Love,Mouli

ల‌వ్‌,మౌళి అంద‌రికి కొత్త అనుభూతినిస్తుంది! సూప‌ర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ సరికొత్త అవతార్‌లో న‌వ‌దీప్  2.Oగా క‌నిపించ‌బోతున్న చిత్రం ‘లవ్,మౌళి’. ఈ విభిన్న‌మైన, వైవిధ్య‌మైన చిత్రానికి ఎస్.ఎస్. రాజమౌళి శిష్యుడు అవ‌నీంద్ర ద‌ర్శ‌కుడు. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ప్రమోషన్‌ కంటెంట్‌ సినిమాపై ఆసక్తిని పెంచగా... నైరా క్రియేషన్స్  మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో క‌లిసి టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్‌కి అడ్డాగా మారిన సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల సింగిల్‌ కట్‌ లేకుండా సెన్సారును పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెన్సార్ నుండి ‘ఏ’ సర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్‌ 7న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను హీరో న‌వ‌దీప్ మీడియాతో పంచుకున్నాడు ఆ విశేషాలివి..

నా కెరీర్ ప్రారంభ‌మైన‌ప్పుడు.. మంచి జెట్‌స్పీడులో వెళ్లింది. వ‌రుస‌గా చేసుకూంటూ వెళ్లాను. ఆ తరువాత అన్ని త‌ర‌హా పాత్ర‌లు చేశాను. ఇప్పుడు జ‌నాల నా గురించి ఏమ‌నుకుంటున్నారో తెలుసుకున్నాను. వాళ్లు నా గురించి ఆలోచించే త‌ర‌హాలో మార్పు వున్న‌ప్పుడు మ‌నం కూడా మ‌రాలి అనిపించింది. అందుకే నాకు కూడా వాళ్ల ఆలోచ‌న త‌గిన విధంగా కెరీర్‌ను మార్చ‌కోవాలినిపించింది. ఆ త‌రుణంలో విన్న క‌థే ల‌వ్‌,మౌళి. ఈ సినిమా కోసం అన్ని మార్చుకున్నాను. నా త‌ప‌న కూడా నా స్నేహితుల‌కు కూడా అర్థం చేసుకుని ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.

ఈ సినిమా షూటింగ్ మొత్తం మేఘాల‌యాలోని చిరపుంజీలో చేయడం పెద్ద సాహసం అని చెప్పాలి. ఎన్నో వ్య‌య ప్ర‌యాసాల‌తో షూటింగ్  చేశాం. ఎప్పూడు వ‌ర్షం ప‌డే ఆ ప్లేస్‌లో సినిమా మీద పాష‌న్‌తో చిత్రీక‌ర‌ణ చేశాం. రెండున్న‌ర సంవ‌త్స‌రాలు నేను కూడా అదె గెట‌ప్‌లో వున్నాను. సినిమా కోసం అందరం క‌ష్ట‌ప‌డి తీశాం. ల‌వ్ మౌళి సినిమా మేకింగ్ అంతా ఓ సాహ‌సం అని చెప్పాలి.

స‌ర‌దాగా హీరో రానాకు క‌థ చెప్పాను. క‌థ బాగుంద‌ని చెప్పి ఈ సినిమాలో రానా అఘోరాగా  ఒక ముఖ్య‌పాత్ర‌ను చేశాడు. అంతేకాదు నా కోసం ఎదైనా చెయ్యాల‌ని చెప్పి రానా ఈ పాత్ర‌ను చేశాడు. నిజంగా చెప్పాలంటే రానాకు ఈ పాత్ర చేయ‌డం అవ‌స‌రం లేదు. నాతో వున్న స్నేహంతో పాటు పాత్ర చేశాడు. ఈ రోజు వ‌ర‌కు కూడా రానా ఈ చిత్రం చేశాడ‌ని రివీల్ చేయ‌లేదు. ఎందుకంటే దీనిని క‌మ‌ర్షియ‌ల్‌గా వాడుకోవడం ఇష్టం లేదు. ఈ సినిమాలో ఈ పాత్ర‌ను రానా చేయ‌క‌పోతే మా ద‌ర్శ‌కుడు చేసేవాడు.

ఇది రెగ్యుల‌ర్ ల‌వ్‌స్టోరీ కాదు. ఈ సినిమా  అంద‌రికి కొత్త అనుభూతినిస్తుంది. ఈ సినిమాలో ఏ విష‌యంలో  కూడా రొటిన్‌గా వుండ‌దు. ఈ సినిమా చూస్తున్న ప్ర‌తి ఒక్క‌రికి క‌నెక్ట్ అవుతుంది. ముఖ్యంగా యూత్‌కు ఖ‌చ్చితంగా క‌నెక్ట్ అవుతుంది. ఈ సినిమా తెలుగులో కాకుండా మ‌రో భాష‌ల్లో వ‌చ్చి వుంటే చూసే కోణంలో కూడా తేడా వుండేదెమో.. ఈ సినిమా అంద‌రికి ఎక్క‌డో ఒక ద‌గ్గ‌ర క‌నెక్ట్ అవుతుది.

ఈ సినిమా కోసం నేను, ద‌ర్శ‌కుడు సింక్‌లో వుండి ప్రిపేర్ అయ్యాం. నేను ఏ సినిమా చేసినా ఆ పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా ప్రిపేర్ అయ్యే వాడిని. ఈ సినిమాతో విజ‌యం నా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుంద‌ని అనుకుంటున్నాను.

ఈ సినిమాలో నేప‌థ్యం సంగీతం హైలైట్ అని చెప్పాలి. స‌న్నివేశానికి ఎలివెట్ చేసే విధంగా  చాలా మంచి పాట‌ల‌తో పాటు నేప‌థ్య సంగీతం ఇచ్చాడు. ఈ సినిమాకు నేప‌థ్య సంగీతం ప్రాణం పోసింది. ల‌వ్‌మౌళి ఎక్స్‌పీరియ‌న్స్ అంద‌రికి కొత్త అనుభూతిని ఇస్తుంది.


హీరోయిన్ పాత్ర కోసం చాలా మందిని చూసి పంకూరిని సెల‌క్ట్ చేశాం. చిత్రం క్యారెక్ట‌ర్‌కు ఆ అమ్మాయి బాగా కుదిరింది. ద‌ర్శ‌కుడు త‌ను అనుకున్న పాత్ర కోసం స‌రైన ఆర్టిస్ట్ దొరికే వ‌రకు ఎక్కడా రాజీప‌డ‌లేదు. కొత్త అమ్మాయిని కాకుండా సీనియ‌ర్ హీరోయిన్ పెట్టే పాత్ర కాదు. ఈ రోజు సినిమాకు పంకూరి ఎంతో ప్ల‌స్ అయ్యింది.


ప‌ర్స‌న‌ల్‌గా న‌న్నున‌న్నుగా వుండ‌నిచ్చే అమ్మాయి నాకు కావాల‌నిపిస్తుంది.

నేను పూర్తిగా ద‌ర్శ‌కుడికి న‌మ్మాను. సినిమా మొత్తం ఆయ‌న విజ‌నే వ‌దిలేశాను. కేవ‌లం నా గెట‌ప్ పాత్ర గురించి మాత్ర‌మే నేను కేర్ తీసుకున్నాను. ఇది ప్రేమ‌లో వున్న మ‌నిషికి నిజ‌మైన ప్రేమ గురించి వెతికే పాత్ర నాది. ఈ సినిమాలో నా పాత్ర‌లో డిఫ‌రెంట్ ఎమోష‌న్స్ వుంటాయి.

సినిమా చూసిన క‌పుల్స్‌కు ఎక్క‌డో ఒక్క  ద‌గ్గ‌ర సినిమాకు రిలేట్ అవుతారు. కొత్త‌గా పెళ్లైన వాళ్ల‌కు, బాయ్‌ఫ్రెండ్స్ కు ఎక్క‌డో ఒక్క ద‌గ్గ‌ర త‌గులుతుంటాయి.


నా రియ‌ల్‌లైఫ్‌లో ఎన్నో ప్రేమ‌క‌థ‌లు వున్నాయి. 23 ఏళ్ల నుండి ర‌క‌ర‌కాల మ‌నుషుల‌ను ప్రేమించాను. ప‌ర్స‌న‌ల్‌గా కూడా ఈ సినిమా క‌థ నాకు ఎంతో క‌నెక్ట్ అయ్యింది.  సినిమా ద‌ర్శ‌కుడు కూడా త‌న వ్య‌క్తిగ‌త అన‌భ‌వాలు ఈ సినిమాలో వున్నాయి. అత‌ని ఆలోచ‌న‌ల‌కు ద‌గ్గ‌ర ఈ సినిమా వుంటుంది. మ‌నం ఏంటో తెలుసుకుని ప్ర‌శాంతంగా వుండి.. అవ‌త‌లి వాళ్ల‌ను కూడా ప్ర‌శాంతంగా వుంచితే.. బాగుంటుంది.


న్యూసెన్స్ 2 వెబ్‌సీరిస్‌తో పాటు త‌మిళంలో నిత్య‌మీన‌న్‌తో ఓ సినిమా చేస్తున్నాను. దీంతో పాటు మ‌రికొన్ని వెబ్‌సీరిస్‌లు రిలీజ్‌కు సిద్దంగా వున్నాయి. ఇక  నుంచి సోలో హీరోగా మంచి క‌థ‌ల‌తో రావాల‌నుకుంటున్నాను. ల‌వ్‌, మౌళికి వచ్చిన స్పంద‌న బ‌ట్టి నా త‌దుప‌రి చిత్రాల ఎంపిక ఆధార‌ప‌డి వుంటుంది. ద‌ర్శ‌కుడు అవ‌నీంద్ర‌, నా కాంబినేష‌న్‌లో కూడా మ‌రో సినిమా చేద్దామ‌ని అంటున్నారు. నాకు మాత్రం ఒక పూర్తి వినోదాత్మ‌క సినిమా చేయాల‌ని వుంది