Latest Post

Kalki2898AD Trailer on June 10th

 గెట్ రెడీ: కల్కి 2898 AD ట్రైలర్ జూన్ 10న రిలీజ్ది వెయిట్ ఈజ్ ఫైనల్లీ ఓవర్! అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె & దిశా పటానీ నటించిన సైన్స్ ఫిక్షన్ మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' ట్రైలర్ 10 జూన్ 2024న రిలీజ్ కానుంది. అమెజాన్ ప్రైమ్‌లో బి&బి బుజ్జి & భైరవ  ప్రిల్యూడ్ విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులుఈ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజా ట్రైలర్  కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


బుధవారం ఉదయం ట్రైలర్ లాంచ్‌ను అనౌన్స్ చేస్తూ, సినిమా అఫీషియల్ హ్యాండిల్ ఈ న్యూస్ ని షేర్ చేసింది.


“ ఏ న్యూ వరల్డ్ అవైట్స్  

#Kalki2898AD Trailer on June 10th.”


https://x.com/kalki2898ad/status/1798210288849940678?s=46&t=td36fd1VqvQ20yDywt6_9Q


ట్రైలర్ రిలీజ్ డేట్ ని కొత్త పోస్టర్‌తో అనౌన్స్ చేశారు. పోస్టర్ లో మనం భైరవను చూడవచ్చు. ప్రభాస్ పర్వత శిఖరంపై నిలబడి ఆకాశం వైపు చూస్తూ కనిపించిన పోస్టర్ అదిరిపోయింది. పోస్టర్ పై రాసిన “ Everything is about to change” క్యాప్షన్ మరింత క్యురియాసిటీని పెంచింది.


విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో విజువల్ వండర్ గా రూపొందిన 'కల్కి 2898 AD' లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఈ మూవీ అద్భుతమైన కథాంశం, హై ప్రొడక్షన్ వాల్యూస్ తో ఇండియన్, ఇంటర్ నేషనల్ మార్కెట్లలో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది.


వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం 2024 జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.


Music Director Chaitan Bharadwaj Interview About Harom Hara

హరోం హర' యాక్షన్ తో పాటు హై ఎమోషన్స్ వున్న మ్యాసీవ్ ఎంటర్ టైనర్. చాలా గూస్ బంప్ మూమెంట్స్ వున్నాయి. థియేట్రికల్ గా ఆడియన్స్ కి గ్రేట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది: మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్

 


హీరో సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'హరోం హర'. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌కి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి. టీజర్, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ హైప్ క్రియేట్ చేశాయి. జూన్ 14న హరోం హర గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ విలేకరుల సమావేశంలో మూవీ విశేషాలని పంచుకున్నారు.  ఇప్పటివరకూ చాలా లవ్ స్టొరీస్ చేశారు కదా.. హరోం హర లాంటి యాక్షన్ సినిమా చేయడం ఎలా అనిపించింది ?

-ఇన్ని రోజులు చేసిన మూవీస్ లో ఇలాంటి కైండ్ అఫ్ కలర్ రాలేదు. ఆర్ఎక్స్ 100 లో కూడా రా రస్టిక్ కలర్ వుంటుంది. అయితే ఇంత హార్డ్ కోర్ యాక్షన్ డ్రివెన్ వున్న మూవీ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇదే నా స్ట్రెంత్.  హరోం హర లో యాక్షన్ తో పాటు కోర్ ఎమోషన్స్ వుంటాయి. ఎమోషనల్ మ్యూజిక్ చేయడానికి కూడా స్కోప్ దొరికింది. మంచి విజువల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే  చాలా పెక్యులర్ జోనర్ ఇది . సౌండ్ పంచ్ ఆడియన్స్ కి మంచి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ వుంటాయి.  


ఈ కథ మీ దగ్గరికి రావడానికి కారణం ?

-డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక సేహరి టైం నుంచి పరిచయం. నా మీద కోర్ లెవెల్ ట్రస్ట్ పెట్టారు. మా మధ్య మంచి వేవ్ లెంత్ కుదిరింది.


ఈ సినిమాకి మీరు చేసిన రీసెర్చ్, ఎక్స్పరిమెంట్ ఏమిటి ?

-1989లో జరిగే కథ ఇది. ఇప్పుడున్న యూత్ కు అప్పుడున్న ఓ జీవితాన్ని ప్రజెంట్ చేస్తున్నారు డైరెక్టర్. ఆ రెట్రో కల్చర్ ని ఇన్ కార్పరేట్ చేస్తూ మ్యాసీ అటెంప్ట్ ఇందులో చేశాం. డెఫినెట్లీ ఇది ఠఫ్ జాబ్. అయితే నాకు మొదటి నుంచి ఛాలెంజస్ ఇష్టం. దీన్ని కూడా ఒక ఛాలెంజ్ తీసుకొని చేశాను. నాకు రెట్రో జోనర్ ఇష్టం. ఆడియన్స్ థియేటర్స్ లో చాలా ఎంజాయ్ చేశారు. సినిమా మేము అనుకున్నట్లు వచ్చింది. సుధీర్ బాబు గారు, డైరెక్టర్, అందరూ చాలా హ్యాపీగా వున్నారు. ఇందులో విజువల్ చాలా గ్రాండ్ గా వుంటుంది. విజువల్ కి తగ్గట్టే మ్యూజిక్ కూడా చాలా గ్రాండియర్ గా చేయడం జరిగింది. సౌండ్ డిజైన్ అద్భుతంగా వుంటుంది.


ఇందులో మీకు ఛాలెంజింగ్ గా అనిపించిన ఎలిమెంట్ ఏమిటి ?

-కొత్తగా మ్యాసీవ్ గా చేయాలని ముందే డిసైడ్ అయ్యాం. సౌత్ ఇండియన్ నాటు కలర్ ని స్టయిలీష్ డ్రివెన్ గా పట్టుకెళ్ళడం ఛాలెంజింగ్ గా అనిపించింది. ఇందులో హెవీ యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు ఎమోషన్స్ కూడా వున్నాయి. అది కూడా అగ్రెసివ్ గా వుంటుంది. ఈ రెండిటి మధ్య ట్రాన్సిషన్ చూపించడం ఛాలెంజింగ్ గా అనిపించింది.


ఇప్పటి వరకూ విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కనులెందుకో లాంటి మరో మెలోడీ ఇందులో వుందా ?

 

-నెక్స్ట్ రాబోతున్న సాంగ్స్ ఎమోషన్స్ తో లింక్ అప్ అయ్యే సాంగ్స్.  అందులో ఎమోషన్ ఎక్కువగా వుంటుంది.  ఇందలో చాలా మంచి ఎమోషనల్ సాంగ్ వుంది. ఆ పాట కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నాను. అందులో సబ్జెక్ట్ వుంటుంది. సినిమా రిలీజ్ తర్వాత ఆ పాట లాంచ్ వుంటుంది.


-హరోం హర పాట కళ్యాణ్ చక్రవర్తి అద్భుతంగా రాశారు. ఆలాగే నారిని విడిచే పాట రాబోతుంది. ఈ పాటకు కూడా ఆయనే లిరిక్స్.  కనులెందుకో పాట వెంగీ చాలా ఛాలెంజింగ్ గా రాశారు. భరద్వాజ్, హర్ష చెరో పాట రాశారు. ఈ రెండు పాటలు కూడా వండర్ ఫుల్ గా వచ్చాయి.


సుధీర్ బాబు గారి సినిమాకి మ్యూజిక్ చేయడం ఎలా అనిపించింది ?

-సుధీర్ బాబు గారి డైనమిక్ యాక్టింగ్, ప్రజెన్స్, డైరెక్టర్ విజువల్ గా అద్భుతంగా హ్యాండిల్ చేసిన విధానం ఇన్ని ఫ్యాక్టర్స్ నాకు హెల్ప్ అవ్వడం వలనే నా నుంచి మ్యుజికాలిటీ ఆర్గానిక్ గా ట్రిగర్ అయ్యిందని నమ్ముతాను. ఈ మూవీలో ప్రతి క్యారెక్టరైజేష్ కి ఒక స్పెషిఫిక్ థీమ్ లా డెవలప్ చేసుకున్నాం.


హరోం హర నిర్మాతల సపోర్ట్ గురించి ?

-ఈ మూవీ మొత్తంలో ప్రొడ్యూసర్స్ కోర్ ఫ్రీడమ్ ఇచ్చారు. డైరెక్టర్ ఎలా అయితే నామీద నమ్మకం పెట్టారో అలాంటి నమ్మకం నిర్మాతల నుంచి వచ్చింది. ఒక కొత్త అటెంప్ట్ బయటికి రావడానికి చాలా హెల్ప్ చేశారు.


నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ?

గోపీచంద్ గారు, శ్రీను వైట్ల గారి విశ్వం సినిమాకి చేస్తున్నాను.


ఆల్ ది బెస్ట్

థాంక్ యూ

 

Director Avaneendra Interview About Love,Mouli

లస్ట్ కోసం కాదు.. లవ్ కోసం చేసిన సినిమా ‘లవ్,మౌళి’: దర్శకుడు అవ‌నీంద్ర

 


సూప‌ర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ సరికొత్త అవతార్‌లో న‌వ‌దీప్  2.Oగా క‌నిపించ‌బోతున్న చిత్రం ‘లవ్,మౌళి’. ఈ విభిన్న‌మైన, వైవిధ్య‌మైన చిత్రానికి ఎస్.ఎస్. రాజమౌళి శిష్యుడు అవ‌నీంద్ర ద‌ర్శ‌కుడు. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ప్రమోషన్‌ కంటెంట్‌ సినిమాపై ఆసక్తిని పెంచగా... నైరా క్రియేషన్స్  మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో క‌లిసి టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్‌కి అడ్డాగా మారిన సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల సింగిల్‌ కట్‌ లేకుండా సెన్సారును పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెన్సార్ నుండి ‘ఏ’ సర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్‌ 7న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను దర్శకుడు అవనీంద్ర మీడియాతో పంచుకున్నారు.వైజాగ్‌లో ల‌వ్‌, మౌళి ప్రీమియ‌ర్స్‌కు ఎలాంటి స్పంద‌న వ‌చ్చింది?

- ఇటీవల వైజాగ్‌లో ‘లవ్,మౌళి’ ప్రత్యేక షో వేయడం జరిగింది. ఈ షోకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా వాళ్లకు షో వేస్తే.. అందరూ బాగుందనే అంటారు. బాలేదని ఎవరూ చెప్పలేదు. అందుకే కొంతమంది చెప్పేదే నేను నమ్ముతాను. కీరవాణిగారి బ్రదర్ కాంచీగారు ఏమున్నా ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు. అలాంటి వారి ఓపెనియన్‌ని నేను బాగా నమ్ముతాను.


విడుద‌ల‌కు మూడు రోజుల ముందే ప్రివ్యూ వేయడం రిస్క్ అనిపించ‌లేదా?

- వైజాగ్‌లో ప్రివ్యూ వేయడానికి కూడా ముందు ఆలోచించాం. టాక్ బయటికి వెళ్లిపోతుందేమో అని అనుకుని కూడా.. టెస్ట్ చేద్దామని అనుకున్నాం. అలా అనుకుని బుకింగ్ ఓపెన్ చేయడానికి.. వెంటనే అయిపోయాయి. అప్పుడర్థమైంది జనాలు కూడా సినిమా చూడడానికి ఆసక్తిగా ఉన్నారని. సినిమా చూసిన వారంతా ఎంజాయ్ చేశారు. నేను ఊహించని చోట కూడా వారు ఎంగేజ్ అయి ఎంజాయ్ చేయడం చూసి చాలా హ్యాపీగా అనిపించింది. హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.


ఈ క‌థ‌లో న‌చ్చే ఎలిమెంట్స్ ఏమిటి?

- ఈ కథలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కొంతమంది లొకేషన్స్, కొంతమంది హీరోయిన్ క్యారెక్టరైజేషన్.. ఇలా ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు.


ఇంత బోల్డ్ క‌థ‌తోనే  మీరు ద‌ర్శ‌కుడికి ప‌రిచయం కావ‌డానికి కార‌ణం ఏమిటి?

- ఈ కథ అనుకున్నప్పుడు నేను ‘ఆర్ఆర్ఆర్’ రైటింగ్‌లో ఉన్నాను. నేను ఆ సినిమాకు అసోసియేట్ రైటర్‌ని. అప్పుడే మా టీమ్ అంతా నువ్వు డైరెక్ట్ చేసే సమయం ఆసన్నమైందంటూ ప్రోత్సహించారు. అయితే నేను కమర్షియల్ కథలు ఎన్నో అప్పటికే రాసేశాను. ఏ కథ రాస్తే బాగుంటుందా? అని ఆలోచిస్తూ కొత్తగా ఏదైనా ప్రేక్షకులకు రిఫ్రెష్ అనిపించేలా ఉండాలని అనుకున్నాను. ఒకవైపు ఆర్ఆర్ఆర్ రాస్తున్నప్పుడే పేరలల్‌గా ఈ పాయింట్ అనుకున్నాను. ఆర్ఆర్ఆర్‌తో అప్పటికే ఓకే చేసిన కథలన్నీ పూర్తి చేసి ఈ కథపై కూర్చున్నా.


హీరో న‌వ‌దీప్ కోస‌మే ఈ క‌థ త‌యారు చేశారా?


 కథ రాస్తున్నప్పుడు మనం ఎవరినో ఒకరిని ఊహించుకుంటూ రాయాలి. ఈ కథకి అలా ఊహించుకోవడం చాలా కష్టం. ఈ ఒక్క కథకి ఎవరినీ ఊహించుకోకుండా ఒక నవలలా కథ రాసేశా. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలందరినీ ఈ కథకి ఊహించుకుంటూ వచ్చా. అయితే ఆ ఫొటోలలో అప్పుడు నవదీప్ ఫొటో లేదు. అప్పుడు నవదీప్ కూడా అంత యాక్టివ్‌గా సినిమాలు చేయడం లేదు. అప్పుడు నాకెందుకో నవదీప్ అయితే అనే ఆలోచన వచ్చింది. నా ఆలోచనలన్నీ అతనిపై పెట్టి.. ఆ తర్వాత వెళ్లి కథ చెప్పా. కథ వినగానే ఎగిరి గంతేశాడు. ఇలాంటి కథ కోసం ఎప్పటి నుండో చూస్తున్నా అని చెప్పాడు. నేను అనుకున్న లుక్‌కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాడు.

మార్కెట్ ఈక్వేష‌న్స్ ప‌ట్టించుకోలేదా?

అయితే మార్కెట్ అవి ఇవీ ప్రాబ్లమ్స్ ఉంటాయని అంతా అన్నారు కానీ.. ఫస్ట్ సినిమా, ఈ ఒక్క కథని నిజాయితీగా చేద్దాం అని ఫిక్సయ్యా. రిజల్ట్ తో సంబంధం లేదు.. 10 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నా.. ఫస్ట్ సినిమా నిజాయితీగా చేశానని చెప్పుకోవడానికి ఉంటుందని అనుకున్నా.


హీరో బ్రాలో మందు తాగ‌డం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది?

లో దుస్తులని పబ్లిగ్గా ఆరేయడానికి సంకోచించే మైండ్ మనది. నాకున్న స్క్రీన్‌ప్లే టైమ్‌ని దృష్టిలో పెట్టుకుని.. హీరో క్యారెక్టర్‌ ఇదని చెప్పడం కోసమే.. హీరో ఇన్నర్ దుస్తుల్లో మందు తాగడం చూపించడం జరిగింది. ఇందులో హీరోకి ఎటువంటి సెన్సిబిలిటీస్ ఉండవు. నిజంగా అలాంటి సీన్ డిస్టర్బ్‌గా అనిపిస్తే సెన్సార్ వాళ్లు చూసుకుంటారు. వైజాగ్‌లో షో‌కి 50 శాతం అమ్మాయిలే వచ్చారు. ఎవరూ ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. పోస్టర్‌లో అలా అనిపిస్తుంది కానీ.. సినిమా చూశాక అందరికీ ఆ సీన్ అర్థమవుతుంది.


-


సెన్సారు వాళ్లు ఈ సినిమాకు ఏ స‌ర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు?

 సెన్సార్ వాళ్లు యుబైఏ సర్టిఫికెట్ ఇస్తా అన్నారు కానీ 20 కట్స్ చెప్పారు. కానీ ఆ కట్స్ వల్ల కథ ఫ్లో పోతుంది. కథ కథగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి అంటే.. అయితే ‘ఏ’ ఇస్తాం అన్నారు. నేను ముందుగానే ‘ఏ’కి ప్రిపేరై ఉన్నా. ‘ఏ’ కావాలని మాత్రం అడగలేదు.. ప్రిపేర్ అయి ఉన్నా. 18ప్లస్‌కి అవసరమైన కథ ఇది.


ఈ సినిమా బ‌డ్జెట్ లిమిట్ దాటిందా?

 లాక్‌డౌన్ టైమ్‌లో షూటింగ్ నిమిత్తం చాలా ఇబ్బందులు పడిన మాట వాస్తవమే కానీ.. దాని వల్ల బడ్జెట్ పెరగడం అంటూ ఏమీ జరగలేదు. ఎందుకంటే ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌ని కూడా నేనే. ముందుగానే అన్ని పక్కాగా ప్లాన్ చేసుకున్నా.


హీరోయిన్స్‌గా కొత్త‌వాళ్ల‌ను తీసుకున్నారు?

ఇది ఫాంటసీ బేస్ స్టోరీ.. ఒక ఆర్టిస్ట్ తన కాన్వాస్ మీద ఊహా చిత్రం వేస్తే.. అందులో నుంచి ఆ అమ్మాయి బయటికి వచ్చేస్తుంది. అందుకే కొత్త హీరోయిన్లని తీసుకోవడం జరిగింది. ఆడియన్స్ కూడా నిజంగానే వచ్చేసిందనే ఫీల్ పొందాలి. ఒకవేళ తెలిసిన హీరోయిన్ అయితే.. ఆడియన్ ఆ ఫీల్ పొందలేరు. అందుకే కొత్తవాళ్లని తీసుకున్నాం.


ప్రేమ‌క‌థ‌ల్లో ఇది సరికొత్త‌గా వుంటుందా?

- ఫాంటసీ బేస్ తర్వాత వచ్చే స్టోరీ రియల్‌గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆ పాత్రని ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతారు. యథార్థ సంఘటనల నుండి స్ఫూర్తి పొంది తీసిన చిత్రమిది. రిలేషన్‌లో ఒక జంట రెండు సంవత్సరాలు హ్యాపీగా ఉన్న తర్వాత.. వారిద్దరి మధ్య ఎందుకు అంత ప్రేమ ఉండటం లేదు. ఎందుకు ఆ రిలేషన్ బ్రేక్ అవుతుంది అన్నప్పుడు నాకో ఆలోచన వచ్చింది. ఈ పాయింట్ అందరికీ నచ్చుతుందని లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కించాను. ఇంకా చెప్పాలంటే లస్ట్ కోసం కోసం చే

సిన సినిమా కాదు లవ్ కోసం చేసిన సినిమా ఇది.


మీరు ఈ సినిమా ద్వారా ఏమి చెప్పాల‌నుకున్నారు?

- నా దృష్టిలో ప్రేమంటే నాకు నచ్చినట్టు ఉండమనడం కాదు.. నాకు నచ్చకపోయినా.. నిన్ను నీలా ఉండనీయడం ప్రేమ. అదే ఇందులో చెప్పదలచుకున్నాను


-ఈ సినిమా నేప‌థ్యం సంగీతం గురించి?

తమిళ్‌లో ‘96’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా ఇద్దరి మధ్యే ఉంటుంది. కానీ ఎమోషన్స్ మొత్తం మ్యూజిక్ క్యారీ చేస్తుంది. ఆ సినిమా నాకు బాగా నచ్చింది. అలాగే ఈ సినిమా కూడా అలాంటి మ్యూజిక్ అవసరం. అందుకే గోవింద్ వసంత్‌ తీసుకోవడం జరిగింది. టెర్రిఫిక్‌గా మ్యూజిక్ ఇచ్చారు. మా ఇద్దరి మధ్య బ్యూటీఫుల్ జర్నీ జరిగింది. ఈ సినిమా చూసిన తర్వాత పాటలు ఎక్కువగా పాడుకుంటారు.


 ఈ సినిమా తీస్తున్నాన‌ని రాజ‌మౌళికి చెప్పారా?

- విజయేంద్ర ప్రసాద్‌గారికి ఈ కథ చెప్పినప్పుడు బూతులు తిట్టారు. ఎందుకురా నీకు ఇది. కమర్షియల్‌గా వెళ్లక అని అన్నారు. మా ఇద్దరి మధ్య తండ్రీ కొడుకుల అనుబంధం ఉంటుంది. నన్ను ఆయనకి దత్తపుత్రుడు అనే వారు. అంత చనువు ఉంది ఆయన దగ్గర. కాంచీ అన్న కూడా సేమ్ రెస్పాన్స్. నా దృష్టిలో ఇది కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమాలు రాసిన అలవాటుతో ఈ కథ రాశాను. షూటింగ్ అయిన తర్వాత ఒక వీడియో ప్రసాద్‌గారికి చూపించాను. కీరవాణిగారికి చూపించాను.. ఆశ్చర్యపోయారు.  


ఈ చిత్రంలో 42 లిప్‌లాక్‌లు, బోల్డ్ సీన్స్‌, డైలాగ్స్ వున్నాయ‌ని అంటున్నారు  ఇవ‌న్నీ క‌థ‌కు అవ‌స‌ర‌మా?


ఇందులో బోల్డ్ డైలాగ్స్, లిప్ లాక్స్ బోలెడన్నీ ఉంటాయి. అవన్నీ కావాలని పెట్టినవి కాదు. కథకు అవసరమై పెట్టినవే. కమర్షియల్ మీటర్ తెలిసిన వాడిని కాబట్టి.. కథ రాసుకుంటున్నప్పుడు ఈ కథతో ఆడియన్స్‌ని రంజింపచేయడానికి అవసరమైన వన్నీ చేర్చడం జరిగింది. కరోనా తర్వాత జనాలు ప్రపంచ సినిమాను చూస్తున్నాను. టాలీవుడ్ ఇండస్ట్రీ ఇంకా ఐటమ్ సాంగ్స్ దగ్గరే ఉంది. ఈ కథకి అన్ని అలా కుదిరాయ్.

ల‌వ్‌, మౌళి టైటిల్ జ‌స్టిఫికెష‌న్ ఏమిటి?

- ప్రేమతో ప్రశాంతంగా లవ్ మూడ్ కూర్చున్న శివుడిని మౌళి అంటారు. ఈ సినిమాకు ఆ పేరు పెట్టడానికి కూడా ఓ కారణం ఉంది. అది సినిమా చూసిన తర్వాత అందరికీ తెలుస్తుంది. ఈ స్టోరీకి చాలా ప్రత్యేకత ఉంటుంది. 20 సంవత్సరాల తర్వాత కూడా ఈ స్టోరీని మార్చడానికి ఏం ఉండదు.

  మీ త‌దుప‌రి చిత్రాలు?

- నెక్ట్స్ ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా చేయడానికి ప్రయత్నిస్తా. ఆర్ఆర్ఆర్ సినిమాకు సీక్వెల్ చేసే స్కోప్ ఉంది. కథకి అయితే స్కోప్ ఉంది. చేస్తారా? చేయరా? అనేది రాజమౌళిగారి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఆర్ఆర్ఆర్ చేసేటప్పుడే తర్వాత సినిమా మహేష్ బాబుతో అని తెలుసు. మహేష్ బాబు కోసం ఎటువంటి సినిమా చేయాలా? అని అందరినీ అడిగారు. అడ్వంచర్ సినిమా చేయాలని టీమ్ అంతా అనుకున్నాక.. స్టోరీ ప్రారంభమైంది. అంత వరకే చెప్పగలను. 

First Single 'Malle Poola Taxi' Lyrical Song Released from "Dhoom Dham

 

"ధూం ధాం" మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ 'మల్లెపూల టాక్సీ..' లిరికల్ సాంగ్ విడుదలచేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. "ధూం ధాం" సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.


ఈ రోజు "ధూం ధాం" సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ 'మల్లెపూల టాక్సీ..' రిలీజ్ చేశారు. మల్లెపూల టాక్సీ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా..గోపీ సుందర్ క్యాచీ బీట్ తో కంపోజ్ చేశారు. గాయని మంగ్లీ ఈ పాటను ఎనర్జిటిక్ గా పాడటమే కాదు లిరికల్ వీడియోలో స్టెప్స్ వేసి ఆకట్టుకుంది. పెళ్లి నేపథ్యంగా ఈ పాటను కలర్ పుల్ గా పిక్చరైజ్ చేశారు. 'నూటొక్క జిల్లాల అందగాడే మా ఇంటి పిల్లకు నచ్చినాడే...ఎన్నెల్లో ముంచిన చందురుడే మా పిల్ల కోసమే పుట్టినాడే..బుగ్గ చుక్క పెట్టుకున్న అందాల చందాల బంతిరెక్క ఎరికోరి సరైనోడినే ఎంచుకున్నాదే ఎంచక్కా.. పెండ్లి పిల్ల, పిల్లగాడి జోడి అదిరెనే...ఈ ఇద్దరి జంట చూసినోళ్ల కళ్లు చెదిరెనే..నువ్వు మల్లెపూల టాక్సీ తేరే మల్లేశా..పిల్లదాన్ని అత్తింటికి తీసుకపోరా మల్లేశా..' అంటూ సాగుతుందీ పాట.


నటీనటులు - చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు


టెక్నికల్ టీమ్


డైలాగ్స్ - ప్రవీణ్ వర్మ

కొరియోగ్రఫీ - విజయ్ బిన్ని, భాను

లిరిక్స్ - సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి

ఫైట్స్ - రియల్ సతీష్

పబ్లిసిటీ డిజైనర్స్ - అనిల్, భాను

ఆర్ట్ డైరెక్టర్ - రఘు కులకర్ణి

ఎడిటింగ్ - అమర్ రెడ్డి కుడుముల

సినిమాటోగ్రఫీ - సిద్ధార్థ్ రామస్వామి

మ్యూజిక్ - గోపీ సుందర్

స్టోరీ స్క్రీన్ ప్లే - గోపీ మోహన్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - శివ కుమార్

పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా

ప్రొడ్యూసర్ - ఎంఎస్ రామ్ కుమార్

డైరెక్టర్ - సాయి కిషోర్ మచ్చా


Kajal Aggarwal Interview About Satyabhama

"సత్యభామ" లాంటి ఎమోషనల్ యాక్షన్ మూవీ నేను ఇప్పటిదాకా చేయలేదు - క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్రెండు దశాబ్దాల కెరీర్ లో స్టార్ హీరోలకు జంటగా ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు చేసింది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. సౌత్ ఇండస్ట్రీతో పాటు హిందీలోనూ నటించి పేరు తెచ్చుకుంది. 60 సినిమాల్లో వైవిధ్యమైన క్యారెక్టర్స్ తో నటించి 'క్వీన్ ఆఫ్ మాసెస్' గా ప్రేక్షకుల అభిమానం పొందిన కాజల్...ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లాంటి కెరీర్ ను మొదలుపెట్టింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో “సత్యభామ”గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషించారు. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. ఈ నెల 7న “సత్యభామ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తో పాటు తన కెరీర్ విశేషాలు తెలిపింది కాజల్ అగర్వాల్.


- “సత్యభామ” మూవీ నా పర్సనల్ లైఫ్ తోనూ రిలేట్ చేసుకోవచ్చు. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ లా ..నిజ జీవితంలో నేనూ సమాజంలో ఏదైనా జరిగితే స్పందిస్తుంటా. బయటకు వచ్చి ర్యాలీలు చేయకున్నా..ఆ ఘటన గురించి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. డిస్ట్రబ్ చేస్తుంటాయి. అందరిలాగే సొసైటీలో జరిగేవాటి గురించి నాకూ కొన్ని వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉంటాయి.


- నేను ఇప్పటివరకు ఎన్నో క్యారెక్టర్స్ చేశాను గానీ సత్యభామ సినిమా లాంటి ఎమోషనల్ మూవీ చేయడం ఇదే తొలిసారి. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా చేశాను. ఈ చిత్రంలో నటిస్తుంటే ఇప్పటిదాకా ఫీల్ కాని కొన్ని ఎమోషన్స్ అనుభూతిచెందాను. అవన్నీ మీకూ  రియలిస్టిక్ గా అనిపిస్తాయి.


- నన్ను చాలాకాలం టాలీవుడ్ చందమామ అని పిలిచేవారు. ఇప్పుడు సత్యభామ అని పిలిచినా సంతోషిస్తాను. నాకు రెండూ కావాలి. చందమామ బ్యూటిఫుల్ నేమ్, సత్యభామ పవర్ ఫుల్ నేమ్. నాకు రెండూ ఇష్టమే. ఈ కథ చెప్పినప్పుడు ఇన్ స్టంట్ గా ఓకే చెప్పాను. అంతలా నచ్చిందీ స్టోరి.


- శశికిరణ్ మంచి డైరెక్టర్. ఆయన సినిమాలు చూశాను. ఈ సినిమాకు డైరెక్షన్ ఎందుకు చేయడం లేదని శశిని అడిగాను.  ఆయన తను ఈ మూవీకి స్క్రీన్ ప్లే ఇస్తూ ప్రెజెంటర్ గా ఉంటున్నానని చెప్పారు. మనం ఎప్పుడూ ఒకే పనిచేయనక్కర్లేదు. డిఫరెంట్ జాబ్స్ ఎక్స్ ప్లోర్ చేయాలి. శశి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించా. ఆయన ఈ ప్రాజెక్ట్ ను అన్ని విధాలా బాగా వచ్చేలా చూసుకున్నారు.


- దర్శకుడు సుమన్ చిక్కాల ఫస్ట్ టైమ్ డైరెక్షన్ చేస్తున్నా..ఎంతో కన్విక్షన్ తో వర్క్ చేశారు. ఆయనకు చాలా క్లారిటీ ఉంది. తను అనుకున్న స్క్రిప్ట్ అనుకున్నట్లు రూపొందించాడు. సుమన్ చిక్కాలతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మా ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్లైనా తమ ఫస్ట్ మూవీని ఓ బేబిని చూసుకున్నట్లు చూసుకున్నారు. ప్రతి రోజూ సెట్ లో ఉంటూ అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యేవారు. తొలి సినిమాను ఎంతో జాగ్రత్తగా ప్రొడ్యూస్ చేశారు. ఈ టీమ్ తో నాకు మంచి వర్కింగ్ ఎక్సీపిరియన్స్ దక్కింది. అందుకే అవురమ్ ఆర్ట్స్ నా సొంత బ్యానర్ అని చెప్పా.


- గతంలో జిల్లా సినిమాలో పోలీస్ గెటప్ లో కనిపించా. అయితే అది సీరియస్ నెస్ ఉన్న రోల్ కాదు. సత్యభామలో మాత్రం ఎమోషన్, యాక్షన్ ఉన్న పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తా. పోలీస్ రోల్స్ గతంలో ఎంతోమంది హీరోయిన్స్ చేసి ఉంటారు. కానీ ఇది నాకు కొత్త. నా తరహాలో  పర్ ఫార్మ్ చేశాను. మీకు నచ్చుతుందనే ఆశిస్తున్నా.


- యూత్, బెట్టింగ్ తో పాటు ఓ రిలీజియన్ గురించి సత్యభామలో కీ పాయింట్స్ ఉంటాయి. అయితే ఏ మతానికి పాజిటివ్ గా నెగిటివ్ గా ఏదీ చెప్పడం లేదు. జస్ట్ ఆ అంశం కథలో ఉంటుంది అంతే. మీరు ట్రైలర్ చూసిన దాని కంటే ఎన్నో ట్విస్ట్ లు, టర్న్స్ మూవీలో ఉంటాయి. అవన్నీ మూవీలో చూసి మీ రెస్పాన్స్ కు చెబుతారని కోరుకుంటున్నా.


- సత్యభామలో యాక్షన్ సీక్వెన్సుల కోసం ఎంతో కష్టపడ్డా. ఆ ఫైట్స్ అన్నీ రియలిస్టిక్ గా ఉంటాయి. నేను రామ్ చరణ్ లా వంద మందిని కొడితే ప్రేక్షకులు నమ్మరు. నా ఇమేజ్ కు ప్రేక్షకులు ఇష్టపడేలా స్టంట్స్ ఉంటాయి. సుబ్బు యాక్షన్ సీక్వెన్సులు కొరియోగ్రాఫ్ చేశారు.


- మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల తన బెస్ట్ ఎఫర్ట్స్ సత్యభామ కోసం పెట్టాడు. మా ఇద్దరికీ రాక్ మ్యూజిక్ అంటే ఇష్టం. మేము ఆ పాటల గురించి, మ్యూజిక్ గురించి మాట్లాడుకునేవాళ్లం.


- పెళ్లయ్యాక ఒక హీరోయిన్ కెరీర్ ఎందుకు మారాలో అర్థం కాదు. అందరికీ పర్సనల్ లైఫ్ ఉంది. అలాగే హీరోయిన్స్ కు కూడా. గతంలో పెళ్లయ్యాక హీరోయిన్స్ కు అవకాశాలు తగ్గుయోమో..ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లయ్యాక ఎంతోమంది హీరోయిన్స్ అంతకముందు కంటే బిజీగా సినిమాలు చేస్తున్నారు.


- నేను నా వ్యక్తిగతమైన లైఫ్ ను కెరీర్ ను బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. ఇది కష్టమైన పనే. కానీ నటన అంటే ప్యాషన్ కాబట్టి కష్టమైన ఇష్టంగా చేసుకుంటూ వస్తున్నా. ఈ జర్నీలో మా వారి సపోర్ట్, నా ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో ఉంది. సౌత్ లో నాతో పాటు సమంత, రాశీ ఖన్నా మా ఆయనకు ఫేవరేట్ హీరోయిన్స్.


- భారతీయుడు 2 సినిమా రిలీజ్ కోసం ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నా. భారతీయుడు 3లో నా క్యారెక్టర్ ఉంటుంది. ఈ సినిమాలో నేను చాలా కొత్తగా డిఫరెంట్ రోల్ లో కనిపిస్తా.


- వైవిధ్యమైన మూవీస్ చేస్తూ నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. కొత్త దర్శకులతోనూ పనిచేస్తా. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. ఏ రంగంలోనైనా కొత్త వారిని ఎంకరేజ్ చేయాలి. ప్రస్తుతం రెండు కొత్త సినిమాలు సైన్ చేశా. వాటి డీటెయిల్స్ ప్రొడక్షన్ కంపెనీస్ అనౌన్స్ చేస్తాయి.


NVR Cinema To Release Vijay Sethupathi’s 50th Movie Maharaja

విజయ్ సేతుపతి మోస్ట్ ప్రెస్టీజియస్ 50వ మైల్ స్టోన్ మూవీ 'మహారాజ'ని ఏపీ & తెలంగాణలో గ్రాండ్ గా విడుదల చేస్తున్న ఎన్‌విఆర్ సినిమా- జూన్ 14న థియేట్రికల్ రిలీజ్మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మోస్ట్ ప్రెస్టీజియస్ 50వ మైల్ స్టోన్ మూవీ 'మహారాజ' రిలీజ్ కి రెడీ అయ్యింది. నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అనురాగ్ కశ్యప్ పవర్ ఫుల్ రోల్ లో నటించారు. విజయ్ సేతుపతికి ఇది 50వ సినిమా కావడంతో మెమరబుల్ హిట్ అందించడం కోసం దర్శకుడు చాలా కేర్ తీసుకున్నాడు. నిర్మాతలు ఈ ప్రాజెక్ట్‌ని హ్యుజ్ బడ్జెట్ తో లావిష్ గా నిర్మించారు.


ఈ సినిమా జూన్ 14న థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధమౌతున్న నేపధ్యంలో తెలుగు ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఎన్‌విఆర్ సినిమా ఈ మూవీ తెలుగు రాష్ట్రాల రైట్స్ ని దక్కించుకుంది. ఎన్‌విఆర్ సినిమా ఏపీ, తెలంగాణలలో 'మహారాజ' ని మ్యాసివ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


విజయ్ సేతుపతి తన “లక్ష్మి”ని వెదికే ఒక ఆర్డినరీ బార్బర్ గా చూపించిన ఈ మూవీ ట్రైలర్‌ను ఇటీవల మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చివర్లో, విజయ్‌ని ఎదుర్కొనేందుకు అనురాగ్ కశ్యప్ రివిల్ కావడం ఎక్సయిట్మెంట్ ని పెంచింది. ట్రైలర్‌కి గ్రాండ్‌ రిసెప్షన్‌ రావడంతో సినిమాపై హ్యుజ్ బజ్‌ క్రియేట్ అయ్యింది.


మహారాజాలో మమతా మోహన్‌దాస్, భారతీరాజా, నటరాజన్ సుబ్రమణ్యం, సింగంపులి  కల్కి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ దినేష్ పురుషోత్తమన్, మ్యూజిక్ బి అజనీష్ లోకనాథ్, ఎడిటింగ్ ఫిలోమిన్ రాజ్.


నటీనటులు: విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నట్టి (నటరాజ్), భారతీరాజా, అభిరామి, సింగంపులి, అరుల్దాస్, మునిష్కాంత్, వినోద్ సాగర్, బాయ్స్ మణికందన్, కల్కి, సచన నమిదాస్


టెక్నికల్ సిబ్బంది:

రచన & దర్శకత్వం: నితిలన్ సామినాథన్

నిర్మాతలు : సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి

అసోసియేట్ ప్రొడ్యూసర్: కమల్ నయన్

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్

తెలుగు రిలీజ్: NVR సినిమాస్

మ్యూజిక్: బి అజనీష్ లోక్‌నాథ్

ఎడిటర్: ఫిలోమిన్ రాజ్

ప్రొడక్షన్ డిజైనర్ : వి.సెల్వకుమార్

స్టంట్ డైరెక్టర్: అన్ల్ అరసు

డైలాగ్స్: నితిలన్ సామినాథన్, రామ్ మురళి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎ. కుమార్

తెలుగు డబ్బింగ్: పోస్ట్‌ప్రో వసంత్

సౌండ్ డిజైన్: అరుణ్ ఎస్ మణి (ఓలి సౌండ్ ల్యాబ్స్)

సౌండ్ మిక్సింగ్: M.R రాజకృష్ణన్ (R.K స్టూడియోస్)

కాస్ట్యూమ్ డిజైనర్: దినేష్ మనోహరన్

మేకప్ ఆర్టిస్ట్: AR అబ్దుల్ రజాక్

కాస్ట్యూమర్: S. పళని

కలరిస్ట్: సురేష్ రవి

స్టిల్స్ : ఆకాష్ బాలాజీ

సబ్ టైటిల్స్ : ప్రదీప్ కె విజయన్

స్టోరీబోర్డింగ్: స్టోరీబోర్డ్ చంద్రన్

VFX: పిక్సెల్ లైట్ స్టూడియో

DI: మంగో పోస్ట్

పబ్లిసిటీ డిజైనర్: చంద్రు (తండోరా)

పీఆర్వో(తమిళం): సురేష్ చంద్ర, రేఖ డి’వన్

పీఆర్వో (తెలుగు): వంశీ-శేఖర్

మార్కెటింగ్ టీమ్ (తెలుగు) - ఫస్ట్ షో

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : కె. శక్తివేల్, సుసి కామరాజ్

Sree Padha Creations Next Announced

 శ్రీ పాద క్రియేషన్స్ బ్యానర్ రెండో చిత్రంగా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్శ్రీ పాద క్రియేషన్స్ పతకం పై జగదీష్ కె కె దర్శకత్వంలో డాక్టర్ శ్రీనివాస్ కిషన్ ఆనాపు, డాక్టర్ రాజనీకాంత్ ఎస్, సన్నీ బన్సల్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఈ చిత్రం గురించి మరిన్ని విషయాలు జూన్ 9న తెలియజేయుచున్నారు. 

ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ కిషన్ గారు మాట్లాడుతూ 2021 లో  మా మొదటి సినిమా "కనబడుటలేదు" విడుదలై మూడు సంవత్సరాలు అయ్యింది, ఆ చిత్రం  మంచి విజయాన్ని అందించింది. ఇప్పుడు నా మిత్రులు డాక్టర్ రాజనీకాంత్ ఎస్, సన్నీ బన్సల్ తో కలిసి మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ని నిర్మిస్తున్నాము. మంచి కథ, కథనం తో మా చిత్రాని నిర్మిస్తున్నాము. 

2022 లో  చింతపల్లి అడవులు మరియు లంబసింగి లోని అందమైన లొకేషన్స్ లో అక్టోబర్, నవంబర్ మరియు డిసెంబర్ మాసల్లో చల్లటి వాతావరణంలో ప్రకృతి అందాలలో మా చిత్రాని చిత్రికరించము.


సంగీత దర్శకుడు వంశీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మా చిత్రానికి ఊపిరి పోసింది. పాటలు చాలా అద్భుతంగా వచ్చాయి, రాహుల్ సిప్లిగంజ్, శాండీలియ మరియు హరి చరణ్ పాటలు హై లైట్ గా నిలుస్తాయి. సినిమా చాలా బాగా వస్తుంది, ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుంది" అని తెలిపారు 


బ్యానర్ - శ్రీ పాద క్రియేషన్స్

ప్రెసెంటర్ - సరయు తలశిల

దర్శకుడు - జగదీష్ కె కె

నిర్మాతలు - డాక్టర్ శ్రీనివాస్ కిషన్ ఆనాపు, డాక్టర్ రజినీకాంత్ ఎస్, సన్నీ బన్సల్

మాటలు - అరుణ్ వీర్ 

సినిమాటోగ్రఫీ - వి ఆర్ కె నాయుడు 

ఎడిటర్ - జగదీష్ కె కె 

ఆర్ట్ డైరెక్టర్ - బత్తుల శివ సాయి కుమార్ 

ప్రొడక్షన్ డిజైనర్ - శ్రీను ఇర్ల 

కొరియోగ్రాఫర్ - ఆది పొన్నస్

లిరిక్స్ - శ్రీమని, ధర్మ గూడూరు 

కాస్ట్యూమ్స్ - రేణు కియార

సౌండ్ ఇంజనీర్ - రాధా కృష్ణ

Paruvu Trailer Launched

 ZEE5 ఒరిజినల్ సిరీస్ ‘పరువు’ ట్రైలర్‌ను విడుదల చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. జూన్ 14 నుంచి స్ట్రీమింగ్


గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ మీద విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల నిర్మించిన ZEE5 ఒరిజినల్ సిరీస్ ‘పరువు’. సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకులు. ఈ మూవీలో నాగబాబు, నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి వంటి వారు ప్రముఖ పాత్రలు పోషించారు. పవన్ సాధినేని షో రన్నర్‌గా రాబోతోన్న ఈ ZEE5 ఒరిజినల్ సిరీస్ జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. మొదటి ఎపిసోడ్‌ను అందరూ ఉచితంగానే వీక్షించవచ్చు. ఇక ఈ క్రమంలో ‘పరువు’ ట్రైలర్‌ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిలీజ్ చేశారు.

ఇక ఈ ట్రైలర్‌ను చూస్తుంటే పరువు అనే టైటిల్ ఎందుకు పెట్టారో క్లియర్‌గా అర్థం అవుతోంది. ఓ ప్రేమ జంట, కులాలు అడ్డు రావడం, పారిపోయి పెళ్లి చేసుకోవడం, పరువు కోసం పేరెంట్స్ చేసిన డ్రామా.. ఆ జంటకు ఎదురైన కష్టాలు ఇలా అన్నింటిని ఎంతో ఉత్కంఠభరితంగా ఈ ట్రైలర్‌లో చూపించారు. కారు డిక్కీలో ఉన్న శవం ఎవరిది? మర్డర్ కేస్ నుంచి ఎలా బయటపడ్డారు? పరువు హత్యకు గురవుతామని భయపడ్డ వాళ్లే.. ఓ హత్యను చేయడంతో ఎదురైన కష్టాలు ఏంటి? వాటి నుంచి ఎలా బయటపడ్డారు? ఇలా అనేక ఆసక్తికరమైన ప్రశ్నలు లేవనెత్తేలా ట్రైలర్ ఉంది.

బిందు మాధవి ట్రైలర్ చివర్లో ఎంట్రీ ఇవ్వడం, నివేదా పేతురాజ్ బిందు మాధవి మధ్య వచ్చే సీన్ అదిరిపోయింది. ఇక నాగబాబు చాలా రోజులకు ఓ సీరియస్ పాత్రను పోషించినట్టుగా కనిపిస్తోంది. శ్రావణ్ భరద్వాజ్ ఆర్ఆర్ ట్రైలర్‌లో అదిరిపోయింది. చింతా విద్యా సాగర్ సినిమాటోగ్రఫీ ఎంతో నేచురల్‌గా ఉంది.


 ZEE5 గురించి...

జీ5 భార‌త‌దేశ‌పు యంగ‌స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్ల‌ర్‌గా ప్ర‌సిద్ధి పొందింది. మిలియ‌న్ల కొద్దీ అభిమానుల‌ను సంపాదించుకుంది. గ్లోబ‌ల్ కంటెంట్ ప‌వ‌ర్ హౌస్ జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్‌) నుంచి శాఖ‌గా మొద‌లైంది జీ5. అత్య‌ద్భుత‌మైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్ర‌రీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజిన‌ల్స్, 5 ల‌క్ష‌ల‌కు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాష‌ల్లో (హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్‌, మ‌రాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజ‌రాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజిన‌ల్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీస్‌, టీవీ షోస్‌, మ్యూజిక్‌, కిడ్స్ షోస్‌, ఎడ్‌టెక్‌, సినీ ప్లేస్‌, న్యూస్‌, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావ‌డంతో జీ5 12 భాష‌ల్లో అత్య‌ద్భుత‌మైన కంటెంట్‌ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌గ‌లుగుతోంది.


నటీనటులు :

నరేష్ అగస్త్య, నివేదా పేతురాజ్, నాగబాబు, రమేష్, సునిల్ కొమ్మిశెట్టి, ప్రణీత పట్నాయక్, రాజ్ కుమార్ కసిరెడ్డి, మోయిన్, అమిత్ తివారి, అనిల్ తేజ, బిందు చంద్రమౌళి, అఖిలేష్, బోస్ అన్నియ్య, రవితేజ మహాదాస్యం, మాధవి, సంతోష్ నందివడ తదితరులు

సాంకతిక వర్గం :

షో రన్నర్: పవన్ సాదినేని 

బ్యానర్స్- గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి. , నిర్మాతలు - విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల,  దర్శకత్వం - సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్, మాటలు,రచయిత - సిద్దార్థ్ నాయుడు, సినిమాటోగ్రఫీ - చింతా విద్యా సాగర్, మ్యూజిక్ డైరెక్టర్ - శ్రవణ్ భరద్వాజ్,  ప్రొడక్షన్ డిజైనర్ - నార్ని శ్రీనివాస్, ఎడిటర్ - విప్లస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పొట్ల లక్ష్మీ శరణ్య,  పి.ఆర్.ఒ- బియాండ్ మీడియా (నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి).

New Life Physiotherapy and Rehabilitation Center 4Th Anniversary Celebrationన్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ 4వ వార్షికోత్సవం కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. కూకట్ పల్లి హౌజింగ్ బోర్డ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్, న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ రుషిక  తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ 4వ యానివర్సరీ కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరిపారు. హీరో శ్రీకాంత్ ఇక్కడ సేవలు పొందుతున్న వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో


న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ వి .వి  రుషిక గారు  మాట్లాడుతూ - న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ 4వ యానివర్సరీ సందర్బంగా మా స్టాఫ్ అందరితో 5కే రన్ నిర్వహించాం. ఈ రోజు మా సెలబ్రేషన్స్ లో పాల్గొనేందుకు హీరో శ్రీకాంత్ గారు రావడం సంతోషంగా ఉంది. రీహాబిలిటేషన్ అంటే సాధారణంగా అందరూ స్మోకింగ్, డ్రింకింగ్ కోసం అనుకుంటారు. కానీ మా సెంటర్ లో స్పైన్ ఇంజూరీ, లెగ్ ఇంజూరీ, పెరాలసిస్ వల్ల మంచానికే పరిమితమైన వారికి ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సేవలు అందిస్తున్నాం. నెలల పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలా మేము మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ను చూసుకుంటాం. డైపర్ ఛేంజింగ్, ఫుడ్ ఫీడింగ్, వెట్ వైప్స్ తో బాడీ క్లీనింగ్ వంటివి చేస్తాం. ఒకప్పుడు మనం ఇంట్లో పెద్దవాళ్లకు పెరాలసిస్ వస్తే కుటుంబ సభ్యులే అన్ని సేవలు చేసేవారు. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో అలా చేయడం ఫ్యామిలీ మెంబర్స్ కు సాధ్యం కావడం లేదు. అలాంటి వారికి మా సెంటర్ లో సేవలు అందిస్తున్నాం. ముందు పేషెంట్ కు కౌన్సిలింగ్ చేసి చేర్పించుకుని వీలైనంత త్వరగా వారిని కోలుకునేలా చేసి ఇంటికి పంపిస్తాం. మా సెంటర్ ప్రారంభించి నాలుగేళ్లవుతోంది. ఎంతో కాంపిటేషన్ ఉన్నా నా స్టాఫ్, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ వల్ల సక్సెస్ ఫుల్ గా సెంటర్ ను నిర్వహిస్తున్నాం. త్వరలో సికింద్రాబాద్ లో కొత్త సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. హీరో శ్రీకాంత్ గారికి స్పెషల్ థ్యాంక్స్. అన్నారు


టీఎఫ్ పీసీ సెక్రటరీ టి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ - న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ వారు గత నాలుగేళ్లుగా బెడెడ్ పేషెంట్స్ కు గొప్ప సేవలు అందిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వారికి మంచి నర్సింగ్ సేవలు ఇస్తున్నారు. పసి పిల్లల్లా తమ పేషెంట్స్ ను చూసుకోవడం వల్లే ఈ సెంటర్ కు మంచి పేరు వచ్చింది. న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ వారు ఇక్కడికి వచ్చే వారికి మరింతగా సేవ చేయాలని కోరుకుంటున్నా.అన్నారు.హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ - న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ 4వ వార్షికోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. రుషిక గారు ఈ సెంటర్ ను ఎంతో డెడికేటెడ్ గా నిర్వహిస్తున్నారు. ఇక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. పెరాలసిస్ వచ్చిన వారు, రోడ్ యాక్సిడెంట్ లో బెడ్ కు పరమితమైన వారిని చిన్న పిల్లల్లా చూసుకుంటున్నారు. నాకు ఈ సెంటర్ స్టాఫ్ ను చూస్తుంటే దేవతల్లా అనిపించారు. అంత గొప్ప సేవలు తక్కువ ధరల్లో అందిస్తున్నారు. రుషిక గారి ఆధ్వర్యంలో ఇదే అంకితభావంతో న్యూ లైఫ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సెంటర్ సేవలు అందించాలని కోరుకుంటున్నా. ఇక్కడికి వచ్చే వారందరికీ మంచి జరగాలి. అన్నారు.

న్యూ లైఫ్  ఫీజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్లో   హీరో శ్రీకాంత్ గారు  మాట్లాడుతూ  వి .వి  రుషిక    గారు  కోవిడ్  ఫస్ట్ వేవ్  లో కూడా చాలా  సేవలు చేసారు అని కొనియాడారు  . కోవిడ్   ఫస్ట్ వేవ్ లో కూడా  దాదాపు  100 -150  మందికి   ఉచితంగా   కోవిడ్    టీకాలను   పద్మజ హాస్పిటల్   నుంచి   వేయించారు అని పేర్కొన్నారు.  కోవిడ్  ఫస్ట్  వేవ్ లో  టీకా  ఉచితంగా  వెయ్యడం   అంటే  మాములు విషయం  కాదని అయన అన్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీ పై   మక్కువ తో ఆమె 

ఒక డైరెక్టర్  గా  ఉంటూ  అలాగే  ఈ  హాస్పిటల్   లో కూడా  బిజీగా  ఉండడం  చాల మంచిది.  పద్మజ గారు ఇంకా  ఉన్నత  స్థాయికి  వెళ్లాలని  శ్రీకాంత్ గారు   అన్నారు . 

Raju Yadav Success Meet Held Grandly

 'రాజు యాదవ్'కు రియల్ సక్సెస్ అందించిన ఆడియన్స్ కి కృతజ్ఞతలు : రాజు యాదవ్ సక్సెస్ మీట్ లో హీరో గెటప్ శ్రీను  బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ 'రాజు యాదవ్' తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కృష్ణమాచారి దర్శకునిగా, సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఏపీ, తెలంగాణలో గ్రాండ్ గా విడుదల చేశారు. మే 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించి థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యం చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. 


సక్సెస్ మీట్ లో హీరో గెటప్ శ్రీను మాట్లాడుతూ.. రాజు యాదవ్ సక్సెస్ మీట్ కి వచ్చేసిన అందరికీ థాంక్స్. రాజు యాదవ్ కి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా వుంది. థియేటర్స్ విజిట్ కి వెళ్ళినప్పుడు ఆడియన్స్ గుండెలు బరువెక్కాయని చెప్పడం చాలా ఎమోషనల్ గా అనిపించింది. వారి నుంచి వచ్చిన రెస్పాన్స్ రియల్ సక్సెస్ అనిపించింది. సినిమా మనసుని కదిలిస్తే అది రియల్ సక్సెస్. అలాంటి రియల్ సక్సెస్ ని అందించిన ఆడియన్స్ కి థాంక్స్. టీం తరపున ఆడియన్స్ కి శిరస్సు వంచి పాదాభివందనం చెబుతున్నాం. రాజు యాదవ్ ని ఇంత భారీ స్థాయిలో ప్రేక్షకులు వద్దకు తీసుకెళ్ళిన మా బన్నీవాస్ గారికి థాంక్స్. మ్యూజిక్ ఇచ్చిన హర్ష వర్ధన్ రామేశ్వర్, సురేష్ బొబ్బిలి, లిరిక్స్ రాసిన చంద్రబోస్ గారికి, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అంకిత చాలా చక్కగా పెర్ఫామ్ చేశారు. ఈ సినిమాలో నటించిన నటీనటులకి, అందరికీ థాంక్ యూ. దర్శకుడు కృష్ణమాచారి చాలా పాషన్ తో ఈ సినిమా చేశారు. ఈ సక్సెస్ ఆయకే వెళ్ళాలి. భవిష్యత్ లో ఆయన మరెన్నో మంచి చిత్రాలు చేయాలి. మమ్మల్ని బ్లెస్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి కృతజ్ఞతలు. అలాగే కొరటాల శివ గారు, పూరి జగన్నాథ్ గారు, బాబీ గారు, బ్రహ్మనంద గారు అందరికీ పేరుపేరునా మనస్పూర్తిగా కృతజ్ఞతలు. సినిమా విషయంలో నిర్మాతలు చాలా హ్యాపీగా వున్నారు. నాలుగో రోజే బ్రేక్ ఎవెన్ అవ్వడం ఆనందంగా వుంది. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులు మరోసారి ధన్యవాదాలు. రాజు యాదవ్ థియేటర్స్ లో వుంది. ఇంకా చూడని వారు తప్పకుండా వెళ్లి చూడండి.' అని కోరారు.


డైరెక్టర్ కృష్ణమాచారి మాట్లాడుతూ.. రాజు యాదవ్ కు ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులు మనస్పూర్తిగా ధన్యవాదాలు. సినిమాకి అన్ని చోట్ల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన చాలా ఆనందాన్ని ఇస్తోంది. ప్రేక్షకులు రాజు యాదవ్ కు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. చూసిన వారంతా చాలా బావుందని అభినందిస్తున్నారు. ఈ జర్నీలో నాకు ఎంతగానో సపోర్ట్ చేసిన శ్రీను అన్నకి థాంక్స్. అలాగే నాపై ఎంతో నమ్మకం వుంచి నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల చేసిన బన్నీవాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. సినిమా థియేటర్స్ లో వుంది. ఇంకా చూడని వారు తప్పకుండా వెళ్లి చూడండి. రాజు యాదవ్ ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తుంది' అన్నారు.  

హీరోయిన్ అంకిత మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ నాకు చాలా స్పెషల్. రాజు యాదవ్ కి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్స్. శ్రీను గారు చాలా సపోర్ట్ చేశారు. దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. మా సినిమాని సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్' తెలిపారు 

నిర్మాత ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజు యాదవ్ ని ఇంత అద్భుతంగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులు ధన్యవాదాలు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు' తెలిపారు. మూవీ టీం అంతా పాల్గొన్న ఈ సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది.

Indian2 - Chennai Audio Launch Event Held Grandly

సుభాస్కరన్ గారు పెట్టుకున్న నమ్మకమే ఈ చిత్రం.. ‘భారతీయుడు 2’ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది. జూన్ 1న చెన్నైలో సినీ ప్రముఖులు సమక్షంలో ఆడియో వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుకకు హీరో శింబు, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, నెల్సన్, నిర్మాత ఏ ఎం రత్నం, ఏసియన్ సినిమాస్ సునీల్ నారంగ్, భరత్ నారంగ్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో శృతి హాసన్, మౌనీ రాయ్, శంకర్ కూతరు అదితీ శంకర్, కొడుకు అర్జిత్ శంకర్ లైవ్ పర్ఫామెన్స్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ ఈవెంట్‌లో..


యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘28 ఏళ్ల క్రితం ఇండియన్ సినిమా టైంలో నేను శివాజీ గణేశన్ గారితో ఓ సినిమా చేయాలి. ఆ టైంలోనే శంకర్ ఇండియన్ కథతో వచ్చారు. రెండు కథలు కొంచెం దగ్గరదగ్గరగా ఉన్నాయి. అదే విషయాన్ని శివాజీ గణేశన్ గారితో చెప్పాను. ‘శంకర్ గారితోనే సినిమా చేయండి.. ఆయన ఆల్రెడీ ఓ సినిమాను తీశారు. మనం ఇప్పటికే ఎన్నో సినిమాలు కలిసి చేశాం’ అని నాతో ఆయన అన్నారు. ఆయన అన్న ఒక్క మాటతో, ఆ నమ్మకంతోనే శంకర్ గారితో ఇండియన్ సినిమా చేశాను. ఆ టైంలో నేను గానీ, శంకర్ గానీ రెమ్యూనరేషన్‌ల గురించి మాట్లాడుకోలేదు. ఏ ఎం రత్నం గారు సినిమాను అద్భుతంగా నిర్మించారు. ఆ టైంలోనే నేను శంకర్ గారితో సీక్వెల్ గురించి మాట్లాడాను. కానీ శంకర్ గారు మాత్రం కథ రెడీగా లేదని అన్నారు. మళ్లీ ఇన్నేళ్లకు అంటే 28 ఏళ్ల తరువాత ఇండియన్ 2 చేశాం. ఈ ప్రాజెక్ట్ ఇక్కడి వరకు వచ్చిందంటే లైకా అధినేత సుభాస్కరన్ గారే కారణం. ఎన్నో సవాళ్లు ఎదురైనా మాకు అండగా నిలిచారు. ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఆయన మాపై పెట్టిన నమ్మకమే ఈ చిత్రం. ఆయన నమ్మకానికి తగ్గట్టుగానే ఈ సినిమాను మేం చేశాం. మా చిత్రానికి సపోర్ట్ చేసిన ఉదయనిధి స్టాలిన్, తమిళ కుమరన్, సెంబగ మూర్తికి థాంక్స్. కాజల్, రకుల్, సిద్దార్థ్, ఎస్ జే సూర్య, సముద్రఖని ఇలా అందరూ అద్భుతమైన పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతంలో ఎప్పుడూ ఎనర్జీ ఉంటుంది. ఆయన అద్భుతమైన పాటలు ఇచ్చారు. రవి వర్మన్ నాకు అసిస్టెంట్‌ కెమెరామెన్‌గా ఉన్న టైం నుంచీ తెలుసు. ఆయన అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఇండియన్ సినిమాకు మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేసిన హాలీవుడ్ టెక్నీషియన్‌తో మళ్లీ పని చేయడం ఆనందంగా ఉంది. నాకు సహకరించిన టీం మెంబర్స్ అందరికీ థాంక్స్’ అని అన్నారు.


శంకర్ మాట్లాడుతూ.. ‘ఈ రోజే ఫైనల్ మిక్సింగ్ విన్నాను. అనిరుధ్ మ్యాజిక్ చేశాడు. సరికొత్త ఎనర్జీ వచ్చింది. ఆడియెన్స్‌కి కూడా సినిమా చూశాక అదే ఎనర్జీ వస్తుంది. ఇండియన్ టైంలోనే కమల్ హాసన్ గారు సీక్వెల్ తీద్దామని అన్నారు. కానీ అప్పుడు నా వద్ద సరైన కథ లేదు. చాలా ఏళ్లకు పేపర్స్‌లో లంచం వల్ల జరిగే ఘోరాలు, అన్యాయాలు చూసి కథ ఇలా రాద్దామా? అలా రాద్దామా? అని అనుకున్నాను. కానీ అప్పుడు నేను, కమల్ హాసన్ గారు వేర్వేరు ప్రాజెక్టుల్లో ఉండటంతో కుదర్లేదు. 2.ఓ తరువాత ఈ కథ రాసుకున్నాను. అలా ఇండియన్ 2 మొదలైంది. మొదటి రోజు షూటింగ్‌లో ఇండియన్ 2 గెటప్‌లో కమల్ హాసన్ చూసి అంతా షాక్ అయ్యాం. 28 ఏళ్ల క్రితం ఎలా అనిపించిందో.. అప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ కలిగింది. ఇండియన్ తాత మంచి వాళ్లకు మంచివాడు.. చెడ్డవాళ్లకు చెడ్డవాడు. ఇలాంటి పాత్రను చేయడం మామూలు విషయం కాదు. ఆయన 360 డిగ్రీ కంటే ఒక డిగ్రీ ఎక్కువగా నటించే సత్తా ఉన్న నటుడు. 70 రోజుల పాటు మేకప్‌తో నటించారు. ఆయనలాంటి యాక్టర్ ఈ ప్రపంచంలోనే లేరు. ఆయనతో ఇండియన్ 2, ఇండియన్ 3 చేయడం ఆనందంగా ఉంది. ఎస్ జే సూర్య డిఫరెంట్ రోల్ చేశారు. సముద్రఖని, సిద్దార్థ్, బాబీ సింహా చక్కటి పాత్రలు పోషించారు. మనోబాలా, వివేక్ గారు మన మధ్య లేరు. కానీ వాళ్ల పాత్రలు మనతో గుర్తుండిపోతాయి. కాజల్, రకుల్ అద్భుతంగా నటించారు. ఇండియన్ 2 వేరే నిర్మాతతో సినిమా చేయాలి. కానీ లైకా నుంచి సుభాస్కరన్ గారు ఫోన్ చేసి ‘నేను నిర్మిస్తాను.. నాకు ఇండియన్ సినిమా అంటే చాలా ఇష్టం. నేనే నిర్మిస్తాను’ అని అన్నారు. మాకు ఈ చిత్ర నిర్మాణ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అయినా ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. మాకు అండగా నిలిచిన సుభాస్కరణ్ గారికి థాంక్స్. ముత్తు రాజ్ గారి ఆర్ట్ వర్క్ అద్భుతంగా ఉంటుంది. ఇండియన్ ఎంత పెద్ద హిట్ అయిందో ఇండియన్ 2 అంత కంటే పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.


శింబు మాట్లాడుతూ.. ‘నాకు ఇండియన్ సినిమా చాలా ఇష్టం. ఈ విషయాన్ని శంకర్ గారితో ఎన్నో సార్లు చెప్పాను. అసలు ఆ సినిమాను ఎన్ని సార్లు చూసి ఉంటానో లెక్క పెట్టలేదు. ఓ కమర్షియల్ సినిమా ఎలా ఉండాలి? అనే దానికి ఇండియన్ సినిమా ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇండియన్ 2 అనౌన్స్మెంట్ తరువాత ఓ అభిమానిగా ఎంతో ఎగ్జైట్ అయ్యాను. కమల్ హాసన్ గారు నాకు గురువు లాంటి వారు. థగ్స్ లైఫ్ సినిమాలో ఆయనతో కలిసి నటిస్తున్నాను. ఇప్పటికీ ఆయన అదే డెడికేషన్‌తో పని చేస్తున్నారు. అందరికీ నచ్చేలా ఇండియన్ 2 ఉండబోతోంది. ఇండియన్ 2, ఇండియన్ 3, గేమ్ చేంజర్ లాంటి భారీ సినిమాలను ఒకే టైంలో తెరకెక్కించడం మామూలు విషయం కాదు. ఇది కేవలం శంకర్ గారి వల్లే సాధ్యం అవుతుంది. లైకా సుభాస్కరన్ గారు సౌత్‌లో భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. రెడ్ జెయింట్ ఈ చిత్రయూనిట్‌కు ఎంతో సహకారాన్ని అందించారు. అనిరుధ్ పాటలు బాగున్నాయి. ఇండియన్ అనే టైటిల్‌కు తగ్గ నటుడు కేవలం కమల్ హాసన్. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.


అనిరుధ్ రవిచంద్రన్ మాట్లాడుతూ.. ‘ఇండియన్ 2 సినిమాను చేసే అవకాశం ఇచ్చిన లైకా సుభాస్కరన్ గారికి థాంక్స్. శంకర్ గారు నా ఫేవరెట్ డైరెక్టర్. 3 సినిమా నాకు మొదటి ప్రాజెక్ట్. ఈ మూవీ నాకు 33వ ప్రాజెక్ట్. కమల్ హాసన్ గారితో విక్రమ్ చేశాను.మళ్లీ ఇండియన్ 2 చేశాను. ఇండియన్ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ గారు అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. శంకర్ గారు ఈ సినిమాకు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను. జూలై 12న ఇండియన్ తాత రికార్డులు బద్దలు కొడుతున్నాడు’ అని అన్నారు.


బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘శంకర్ గారు చాలా డెడికేటెడ్ పర్సన్. ఇప్పటికీ అదే డెడికేషన్, సిన్సియార్టీతో సినిమా తీశారు. ఇండియన్ సినిమా ఎంత బాగుంటుందో.. ఈ సీక్వెల్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. కమల్ హాసన్ గారు ఎంత గొప్ప నటుడన్నది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనలోని ప్రతీ అణువు నటిస్తుంటుంది. ఆయనతో కలిసి నటించడం గర్వంగా ఉంది. ఇండియన్ 2 పెద్ద విజయాన్ని సాధిస్తుంది’ అని అన్నారు.


ఏ ఎం రత్నం మాట్లాడుతూ.. ‘నేను ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఇండియన్ అనేది చాలా ప్రత్యేకం. ఆ సినిమాతో చేసిన జర్నీని ఎప్పటికీ మర్చిపోలేను. 28 ఏళ్ల తరువాత మళ్లీ సీక్వెల్ వస్తుండటం ఏదో తెలియని కొత్త ఫీలింగ్ వస్తోంది. శంకర్ గారు అద్భుతంగా సినిమాలను తెరకెక్కిస్తారు.  ఆయన ప్రతీ సినిమాలో మంచి సందేశాన్ని ఇస్తారు. ఈ మూవీలోనూ మంచి మెసెజ్ ఇస్తారు’ అని అన్నారు.


బాబీ సింహా మాట్లాడుతూ.. ‘కమల్ హాసన్ గారు లెజెండరీ యాక్టర్. ఆయనలా రాబోయే తరంలో ఎవరు నటిస్తారు? అన్నది చెప్పలేం. ఊహించలేం. ఇండియన్ 2 కోసం ఆయన పడ్డ కష్టం చూశాను. మేకప్‌తో అన్ని గంటలు సెట్స్ మీద ఎలా ఉన్నారో చూశాను. ఈ వయసులోనూ ఇంత డెడికేషన్‌తో పని చేయడం మామూలు విషయం. ఇండియన్ 2 అందరికీ గర్వకారణంగా నిలుస్తుంది’ అని అన్నారు.


గుల్షణ్ మాట్లాడుతూ.. ‘కమల్ హాసన్ గారు ఇండియాలోనే ది బెస్ట్ యాక్టర్. శంకర్ గారు విజనరీ యాక్టర్. లైకా సుభాస్కరన్ గారు భారీ చిత్రాలను నిర్మిస్తున్నారు. ఈ ముగ్గురి కలయికతో రాబోతోన్న ఇండియన్ 2 భారీ హిట్‌ కాబోతోంది’ అని అన్నారు.


రకుల్ ప్రీత్ మాట్లాడుతూ.. ‘కమల్ హాసన్ గారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది. అంత సీనియర్ యాక్టర్ అయి ఉండి కూడా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. శంకర్ గారి దర్శకత్వంలో పని చేయడం సంతోషంగా ఉంది. ఇదొక గొప్ప సినిమా కాబోతోంది’ అని అన్నారు.


కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘ఇండియన్ 2లో నటించడం బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్. శంకర్ గారి దర్శకత్వంలో పని చేయడం గొప్ప విషయం. నా కల నిజమైనట్టుగా అనిపిస్తోంది. కమల్ హాసన్ గారు నటనకు ఇన్‌స్టిట్యూషన్ లాంటి వ్యక్తి. అలాంటి ఆయనతో నటించడం ఎంతో గొప్పగా అనిపిస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన లైకా సుభాస్కరన్ గారికి థాంక్స్. ఈ చిత్రం గొప్ప విజయాన్ని సాధిస్తుంది’ అని అన్నారు.


లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ.. ‘ఇండియన్ 2 అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. శంకర్ గారు, కమల్ హాసన్ గారి కాంబోని మళ్లీ చూడాలని వెయిట్ చేస్తున్నాను. బ్రహ్మాండం అనే పదం శంకర్ గారి సినిమాలకే సెట్ అవుతుంది. మాలాంటి యంగ్ డైరెక్టర్స్‌కి ఆయన సినిమాలే బెంచ్ మార్క్. ఈ సినిమా కోసం ఓ ఆడియెన్‌లా ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.


డైరెక్టర్ నెల్సన్ మాట్లాడుతూ.. ‘శంకర్ గారు తీసిన ఐ, 2.ఓ సినిమా ఈవెంట్లకు నేనే డైరెక్టర్‌గా పని చేశాను. ఆయన హద్దుల్ని ఆయనే చెరిపేస్తుంటారు. అలాంటి దర్శకులు ఉండటం మనకు గర్వ కారణం. తమిళ్ బిగ్ బాస్‌కు బ్యాక్ ఎండ్‌లో పని చేశాను. ప్రతీ విషయాన్ని ఆయన ఎంతో నిశితంగా గమనిస్తుంటారు. సుభాస్కరన్ వంటి వారు మాత్రమే ఇలాంటి భారీ సినిమాను నిర్మించగలరు. ఈ చిత్రం ఓ చరిత్రను సృష్టించబోతోంద’ని అన్నారు.


లైకా ప్రొడక్షన్ హెడ్ తమిళ కుమరన్ మాట్లాడుతూ.. ‘మేకింగ్‌లో సుభాస్కరణ్ ఒక బ్రహ్మాండం.. డైరెక్షన్‌లో శంకర్ గారు ఓ బ్రహ్మండం.. నటనలో కమల్ హాసన్ గారు బ్రహ్మాండం.. మ్యూజిక్‌లో అనిరుధ్ ఒక బ్రహ్మాండం.. ఇంత మంది కలిసి సినిమాను తీస్తే అది ఇంకెంత బ్రహ్మాండంగా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా సమయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. సుభాస్కరన్ గారు ఇచ్చిన సహాకారంతోనే ఇక్కడి వరకు వచ్చాం. ఉదయనిధి స్టాలిన్ గారు ఇచ్చిన సపోర్ట్ ఎప్పుడూ మర్చిపోలేను. ఇండియన్ కంటే ఇండియన్ 2 గొప్ప విజయాన్ని సాధిస్తుంది’ అని అన్నారు.

‘భార‌తీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. సోనీ మ్యూజిక్ ద్వారా ‘భారతీయుడు 2’ పాటలు మార్కెట్లోకి విడుదలవుతున్నాయి.

Committee Kurrollu song Aa Rojulu Malli Raavu brings back old memories

 ‘కమిటీ కుర్రోళ్లు’ నుంచి ‘ఆ రోజులు మళ్లీ రావు’ అంటూ సాగే ఆహ్లాదకరమైన పాట విడుదల


పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధ దామోదర్ స్టూడియో బ్యానర్లపై నిహారిక కొణిదెల సమర్పణలో‘కమిటీ కుర్రోళ్లు’ అనే చిత్రాన్ని పద్మజ కొణిదెల, జయలక్ష్మీ అడపాక నిర్మించారు. ఎద వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. 


ఈ చిత్రం నుంచి ఇప్పటికే వదిలిన పాట, పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఓ ఫీల్ గుడ్ పాటను రిలీజ్ చేశారు. నాటి రోజుల్లోకి తీసుకెళ్లేలా ఉన్న ‘ఆ రోజులు మళ్లీ రావు’ అనే ఈ పాటను సింగర్ కార్తిక్ ఆలపించారు. కృష్ణ కాంత్ రాసిన ఈ పాట మన మూలాల్ని గుర్తు చేసేలా ఉన్నాయి. అనుదీప్ దేవ్ బాణీ ఎంతో క్యాచీగా,వినసొంపుగా, హాయిగా ఉంది. ఈ లిరికల్ వీడియోని చూస్తే మళ్లీ మన ఊర్లోకి వెళ్లాలని అనిపించేలా ఉంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.


ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా రాజు ఎడురోలు వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా అనుదీప్ దేవ్ వ్యవహరిస్తున్నారు. ఎడిటర్‌గా అన్వర్ అలీ పని చేస్తున్నారు.


T-Series ద్వారా "కమిటీ కుర్రోళ్ళు" పాటలు విడుదల

నటీనటులు :

సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య,విషిక, షణ్ముకి నాగుమంత్రి ..ముఖ్య పాత్రల్లో సాయి కుమార్ ,గోపరాజు రమణ,బలగం జయరాం,శ్రీ లక్ష్మి ,కంచెరపాలెం కిషోర్ ,కిట్టయ్య ,రమణ భార్గవ్,జబర్దస్త్ సత్తిపండు తదితరులు


సాంకతిక వర్గం :

సమర్పణ - నిహారిక కొణిదెల, బ్యానర్స్- పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్, నిర్మాతలు - పద్మజ కొణిదెల,జయలక్ష్మి అడపాక,  రచన, దర్శకత్వం - యదు వంశీ, సినిమాటోగ్రఫీ - రాజు ఎడురోలు, మ్యూజిక్ డైరెక్టర్ - అనుదీప్ దేవ్,  ప్రొడక్షన్ డిజైనర్ - ప్రణయ్ నైని, ఎడిటర్ - అన్వర్ అలీ, డైలాగ్స్ - వెంకట సుభాష్  చీర్ల, కొండల రావు అడ్డగళ్ల,  ఫైట్స్ - విజయ్, నృత్యం - జె.డి మాస్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - మన్యం రమేష్, సౌండ్ డిజైన‌ర్‌:  సాయి మ‌ణింద‌ర్ రెడ్డి, పోస్ట‌ర్స్‌:  శివ‌, ఆడియో: T-Series, ఈవెంట్ పార్ట్‌న‌ర్‌:  యు వి మీడియా, మార్కెటింగ్‌:  టికెట్ ఫ్యాక్ట‌రీ, ఆడియో - టి సిరీస్  పి.ఆర్.ఒ- బియాండ్ మీడియా (నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి).

Director Sriram Adittya T Interview About Manamey

 'మనమే' ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో నా ఫేవరట్ మూవీ. బ్యూటీఫుల్ ఎమోషన్స్ వున్న ఫెయిరీ టైల్ లాంటి కథ. డెఫినెట్ గా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది: డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యడైనమిక్ హీరో శర్వానంద్ తన ల్యాండ్‌మార్క్ 35వ మూవీ 'మనమే' తో హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్ ని అందించడానికి రెడీగా వున్నారు. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్‌సే స్టూడియోస్‌ ప్రొడక్షన్ లో నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ అత్యంత గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. 'మనమే' జూన్ 7న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య మూవీ విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.


మనమే స్టొరీ ఐడియా ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ?

-పేరెంటింగ్ ఎమోషన్ గురించి కొంచెం డిఫరెంట్ గా చెప్పాలనే ఐడియా ఎప్పటినుంచో వుంది. అది ఫన్ గా ఫుల్ ఎనర్జీతో చెప్పాలనేది నా ఉద్దేశం. అలాగే పిల్లలతో సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. అందులో తెలియని ఇన్నోసెన్స్ వుంటుంది. ఆ ఇన్నోసెన్స్ టచ్ చేయాలని అనుకున్న కథ.


 బాబు పుట్టాక పెరేటింగ్ గురించి చెయ్యాలనిపించిందా?

- నేను మా పేరెంట్స్ తో చాలా ఎటాచ్ గా వుంటాను. బాబు పుట్టాక ఆ ఎటాచ్ మెంట్ ఇంకా పెరిగింది.


ట్రైలర్ లో వినిపించిన 'ఏడిస్తే ఎవరో ఒకరే ఏడవండి' అనే డైలాగ్ మీ పర్శనల్ ఎక్స్ పీరియన్స్ నుంచి వచ్చిందా ?

- చాలా డైలాగులు రియల్ లైఫ్ నుంచి రిలేట్ చేసుకునేలానే వుంటాయి (నవ్వుతూ).


ఈ సినిమా జర్నీలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజస్ ఏమిటి ?

-లండన్ లో అరవైమంది క్రూ తో వెళ్లి షూట్ చేయడం చాలా ఠఫ్ టాస్క్. లండన్ క్లైమెట్ కూడా అన్ ప్రిడిక్టబుల్ గా వుటుంది. ఒక లొకేషన్ అనుకుని షూట్ స్టార్ట్ చేశాక సడన్ గా వర్షం పడుతుంది. క్లైమెట్, అక్కడ లాజిస్టిక్స్ విషయంలో కొన్ని ఛాలెంజస్ ఎదుర్కొన్నాం.


శర్వానంద్ గారికి ఈ కథ చెప్పిన తర్వాత ఆయన రియాక్షన్ ఏమిటి ?

- తనకి 'మనమే' కథ హోల్ నరేషన్ చెప్పాను. కథ విన్న వెంటనే 'చేసేద్దాం పక్కా' అన్నారు.


మీరు చాలా వరకూ క్రైమ్ థ్రిల్లర్స్ చేశారు కదా. సడన్ గా ఈ జోనర్ రావడం ఎలా అనిపిస్తోంది ?  

-మనమే నా ఫేవరేట్ జోనర్. నాకు హ్యుమర్ చాలా ఇష్టం. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో మనమే నా మోస్ట్ ఫేవరేట్ ఫిల్మ్. మా అబ్బాయి యాక్ట్ చేశాడనే ఒక రీజన్ వుంది కానీ సినిమా చూసినప్పుడు మీరే అర్ధమౌతుంది. ఇందులో చైల్డ్ క్యారెక్టర్ కోసం ఫస్ట్ నుంచి విక్రమ్ ఆదిత్యనే అనుకున్నాం. తను కెమరాకి చాలా బావుంటాడనిపించింది.


ఇందులో దాదాపు 16 పాటలు వున్నాయని తెలుస్తోంది. ఇన్ని పాటలు వుండటం ఆడియన్ ఎలా ఫీలౌతారని భావిస్తున్నారు ?

-ఇందులో సాంగ్స్ సినిమా ఫ్లో కి యాడ్ అవుతాయే గానీ ఆపవు. ఇందులో ప్రతి సాంగ్ సినిమాని ఇంకా ఫాస్ట్ గా తీసుకెళుతుంది. నాకు పవన్ కళ్యాణ్ గారి ఖుషి సినిమా చాలా ఇష్టం. అందులో ఆర్ఆర్ ఎక్కువగా వుంటుంది. ఎమోషన్ చక్కగా యాడ్ చేస్తుంది. మనమే కథ అనుకున్నప్పుడే విజువల్ గా ఒక కలర్ టోన్ ఫిక్స్ అయిపోయాను. ఫెయిరీ టైల్ లాంటి సినిమా చేయాలని అనుకున్నాం. అలాంటి సినిమా చేయాలంటే ముజిక్కే ఆ యాడ్ ఆన్ ఇస్తుంది. హేశం చాలా బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు.


కృతిశెట్టి మీరు అనుకున్న క్యారెక్టర్ కి యాప్ట్ అయ్యారా ?

-కృతిశెట్టి నేను అనుకున్న క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. సినిమాలో చాలా బ్రిలియంట్ గా యాక్ట్ చేసింది.


దాదాపు సినిమాని లండన్ లో షూట్ చేశారు కదా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎలాంటి సపోర్ట్ చేసింది?

-ఫెయిరీ టైల్ లాంటి కథ అనగానే లండన్ లో అలాంటి ఆర్కిటెక్చర్ వుంటుంది. అది వుంటనే ఆ మ్యాజిక్ వస్తుంది. అందుకే లండన్ వెళ్లాం. విశ్వప్రసాద్ గారు చాలా సపోర్టివ్. దాదాపు అరవై మంది క్రూతో అక్కడి వెళ్లాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మించారు. విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు చాలా సపోర్టివ్. సినిమాకి కావాల్సిన ప్రతీదీ ఎక్కడా రాజీపడకుండా సమకూర్చారు.


ఇందులో శర్వా, కృతి వైఫ్ అండ్ హస్బెండ్ గా కనిపిస్తారా ?

-ఇది సర్ ప్రైజ్. ఇప్పుడు చెప్పకూడదు. అయితే సినిమా మొదలైన పదినిమిషాలకు ఆడియన్స్ కి తెలిసిపోతుంది. సినిమా అంతా చాలా హై వుంటుంది.


ఇందులో శర్వానంద్ గారి క్యారెక్టర్ ఎలా వుంటుంది.

- ఇందులో తనది చాలా చిల్ క్యారెక్టర్. సినిమా అంతా ఆయన క్యారెక్టర్ చాలా లైవ్లీ గా వుంటుంది. అసలు ఈ సినిమా మొదలుపెట్టినప్పుడే ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని శర్వాని చూపించాలని అనుకున్నాను.  రన్ రాజా రన్ ఎనర్జీకి మించి వుంటుంది. సినిమా చూడండి. చాలా సర్ ప్రైజ్ అవుతారు. శర్వా చాలా ఎనర్జిటిక్ గా వుంటారు. పడిపడి లేచే మనసు సినిమా చూసినప్పుడు ఆయన ఓ చోట పవన్ కళ్యాణ్ గారిలా కనిపిస్తారు. ఆ ఎనర్జీని చూపించాలని అనుకున్నాను.  


శివ కందుకూరిని తీసుకువడానికి కారణం ?

-శివ గురించి ఇప్పుడే ఎక్కువ మాట్లాడకూడదు. సినిమా చూసినప్పుడు ఆ సర్ ప్రైజ్ ని ఆడియన్స్ ఫీల్ అవ్వాలి. నేను అనుకున్న పాత్ర కోసం గుడ్ లుకింగ్ వుండే బ్యాలెన్స్ యాక్టర్ కావాలి. ఆ పాత్రలో శివ బావుంటాడని ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది.


ఇందులో లవ్ స్టొరీ ఎలా వుండబోతుంది ?

-టామ్ అండ్ జెర్రీలా వుంటుంది( నవ్వుతూ) ఖుషిలో పవన్ కళ్యాణ్ గారు, భూమిక క్యారెక్టర్స్ మధ్య వుండే ఎనర్జీ ఇందులో వుంటుంది. ఇందులో శర్వా కృతి మధ్య వుండే రేపోని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.


ఇందులో ఇద్దరు డీవోపీలు పని చేయడానికి కారణం ?

-విష్ణు లండన్ లో షూట్ చేశారు, ఇక్కడి వచ్చాక తనకి వేరే ప్రాజెక్ట్ ఉండింది.  అప్పుడు జ్ఞాన శేఖర్ గారు మిగతా పోర్షన్ షూట్ చేశారు.


అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ?

- నెక్స్ట్ ఒక ఇంట్రస్టింగ్ స్టొరీ వుంది. ఇది యాక్షన్ కామెడీ జోనర్ లో వుంటుంది.


ఆల్ ది బెస్ట్

-థాంక్ యూ


Kubera Major Action Schedule Commences

ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల 'కుబేర' మేజర్ యాక్షన్ షెడ్యూల్ ప్రారంభంసూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ శేఖర్ కమ్ముల మోస్ట్ అవైటెడ్ మైథలాజికల్ పాన్-ఇండియన్ మూవీ 'కుబేర' మెయిన్ యాక్షన్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హైదరాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్స్‌లో షూటింగ్ జరుగుతోంది.


మొత్తం నటీనటులతో కూడిన హ్యుజ్ షెడ్యూల్ ఇది. ప్రస్తుతం జరుగుతున్న ఈ షెడ్యూల్‌లో ధనుష్, నాగార్జున ఇద్దరూ కొన్ని బ్రీత్ టేకింగ్ స్టంట్స్ పెర్ఫార్ చేస్తున్నారు. ఈ మాగ్నమ్ ఓపస్ ధనుష్ , నాగార్జునలను ఫస్ట్ లుక్ పోస్టర్‌లలో చూపిన విధంగా డిఫరెంట్ క్యారెక్టర్స్ లో ప్రెజెంట్ చేస్తోంది.


ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు టాకీ పార్ట్‌లు పూర్తయ్యాయి. రష్మిక మందన్న, జిమ్ సర్భ్ ఇతర ప్రముఖ పాత్రల్లో కనిపించనున్న ఈ హై-బడ్జెట్ సోషల్ డ్రామా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి.


సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్‌ని డైరెక్టర్ చేయడం, ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లీడ్ లో నటించడం, ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించడంతో కుబేర ఇప్పటికే దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.


శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘శేఖర్ కమ్ముల కుబేర’ పాన్-ఇండియా మల్టీ లాంగ్వేజ్ మూవీ. తమిళం, తెలుగు,  హిందీ భాషల్లో ఏకకాలంలో షూట్ చేస్తున్నారు.

 

Deeksha Movie Talkie Part Completed

ప్రతాని రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకత్వం వహిస్తున్న ‘దీక్ష’ మూవీ టాకీ పార్ట్ పూర్తిఆర్‌.కె. ఫిలింస్‌, స్నిగ్ధ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై ప్రముఖ దర్శక, నిర్మాత, తెలంగాణ ఫిలిమ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘దీక్ష’. పినిశెట్టి అశోక్‌ కుమార్‌, మదాడి కృష్ణారెడ్డి నిర్మాతలు. కిరణ్‌కుమార్‌, అలేఖ్యరెడ్డి జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రోగ్రెస్ ను తెలిపే కార్యక్రమంలో పాల్గొన్నారు ఆర్ కే గౌడ్, హీరో కిరణ్, నటి తులసి. ఈ సందర్భంగా


ఆర్‌.కె.గౌడ్‌ మాట్లాడుతూ - మా ‘దీక్ష’ సినిమా షూటింగ్ టాకీ పార్ట్ పూర్తయ్యింది. వచ్చే వారం ఓ సాంగ్ షూట్ చేయబోతున్నాం. టాకీ పార్ట్ లో ఫైట్ మాస్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించాం. ఈ ఫైట్ లో హీరో కిరణ్ చేసిన స్టంట్స్ హైలైట్ అవుతాయి. మా మూవీలో సింగర్ మధు ప్రియ పాడిన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో కిరణ్ ‘దీక్ష’ చిత్రంలో భీముడి గా కనిపించే సీన్స్ బాగా వచ్చాయి. ఈ సినిమాలో భీముడు, ఆంజనేయుడు వంటి గెటప్స్ లో ఆకట్టుకునే సీన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్  ను పరిచయం చేస్తున్నాం. ‘దీక్ష’ సినిమాను పూర్తి చేసి త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాం. ‘దీక్ష’ మూవీ పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాం. అలాగే మహిళా కబడ్డీ అనే మరో చిత్రాన్ని రూపొందిస్తున్నా. ఈ సినిమాను 18 భాషల్లో తెరకెక్కంచబోతున్నాం. కబడ్డీ ఆడగల యంగ్ హీరోయిన్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మహిళా కబడ్డిలో నటించే హీరోయిన్స్ కు నేషనల్ కబడ్డీ జట్టు కోచ్ తో శిక్షణ ఇప్పిస్తాం. అన్నారు


హీరో కిరణ్ మాట్లాడుతూ - నలభై సినిమాలకు దర్శకత్వం వహించిన రామకృష్ణ గౌడ్ గారు ‘దీక్ష’ మూవీతో మళ్లీ మెగాఫోన్ పట్టడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నేను హీరోగా నటిస్తున్నాను ఆర్ కే గౌడ్ గారు ఈ మూవీ కథ చెప్పినప్పుడు థ్రిల్ అయ్యాను. దీక్ష ఉంటే ఏదైనా సాధించగలం అనే పాయింట్ తో మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి యంగ్ డైరెక్టర్స్ లా చాలా అప్డేటెడ్ గా, ప్లానింగ్ తో ఆర్ కే గౌడ్ గారు ‘దీక్ష’ మూవీ రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో నాకు మంచి పేరుతో పాటు అవార్డ్స్ వస్తాయని ఆశిస్తున్నాను. మా మూవీ టాకీ పార్ట్ కంప్లీట్ అయ్యింది. రియలిస్టిక్ గా ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ చేశాం. స్టంట్ మాస్టర్ రవికుమార్ చాలా బాగా ఆ ఫైట్ చేయించారు. ఒక నిమిషం పాటు ఉండే డైలాగ్ ఒకటి ఈ మూవీలో నాతో చెప్పించారు. ఆ డైలాగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. నా లాంటి యంగ్ హీరోలకు అవకాశాలు ఇస్తున్న ఆర్ కే గౌడ్ గారికి థ్యాంక్స్, అలాగే మా ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. మహిళా కబడ్డీ సినిమాను ఆర్ కే గౌడ్ గారు 18 భాషల్లో రూపొందిస్తున్నారు. ఆ మూవీ కూడా బాగా రావాలని కోరుకుంటున్నా. అన్నారు.


నటి తులసి మాట్లాడుతూ - ఈ సినిమాలో హీరో కిరణ్, హీరోయిన్ అలేఖ్యరెడ్డి తో పాటు మరో లీడ్ రోల్ లో నేను నటించాను. నాకు మంచి డైలాగ్స్ ఉంటాయి. కథ కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. ‘దీక్ష’ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

Yevam Releasing on June 14th

 జూన్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న 'యేవమ్‌'  రొటిన్ భిన్నంగా, కొత్త కంటెంట్‌తో చేసిన సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ వుంటుంది. డిఫరెంట్‌ అండ్‌ న్యూ కంటెంట్‌తో రాబోతున్న మా సినిమాపై అందుకే పూర్తి విశ్వాసంతో వున్నాం అంటున్నారు దర్శకుడు ప్రకాష్‌ దంతులూరి . ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'యేవమ్‌' చాందిని చైద‌రి, వ‌శిష్ట సింహా, భరత్‌రాజ్‌,ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రానికి సంబంధించి విడుద‌ల చేసిన ప్ర‌తి ప్ర‌చార చిత్రానికి మంచి స్పంద‌న వచ్చింది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్‌. జూన్‌ 14న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా  ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ మ‌హిళ సాధికారికతను చాటి చెప్పే నేప‌థ్యంలో ఈ సినిమా వుంటుంది. చిత్రంలోని ప్ర‌తి పాత్ర ఎంతో మినింగ్‌ఫుల్‌గా, కొత్త‌గా వుంటుంది. ఈ చిత్రంలో ప్ర‌తి పాత్ర‌కు ఒక మార్క్ వుంటుంది. కొత్త కంటెంట్‌తో పాటు ఎంతో డిఫరెంట్‌ నేరేషన్‌తో ఈ సినిమా వుంటుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది' అన్నారు. చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్‌, ఆషురెడ్డి, గోపరాజు రమణ, దేవిప్రసాద్‌, కల్పిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌క్ష్మ ఎస్‌వీ విశ్వేశ్వర్‌, సంగీతం కీర్తన శేషు, నీలేష్‌ మందలపు అందిస్తున్నారు. సుజనా అడుసుమిల్లి ఎడిటర్‌గా, రాజు పెన్మెత్స ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

FNCC Held Bumper Tambola Event and Distributed Mercedes Benz as Prize

ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో బంపర్ తంబోలా ను, అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. శ్రీమతి నందమూరి వసుంధర గారి చేతుల మీదగా మెర్సిడీస్ బెంజ్ బహుమతి ప్రదానోత్సవంఎఫ్. న్. సి. సీ  సభ్యులు ,కుటుంబ సభ్యులు ,అతిధులు మరియు మహిళలు అధిక సంఖ్యలో ఈ బంపర్ తంబోలాలో పాల్గొన్నారు . ఈ బంపర్ తంబోలాలో గెలిచినా వారికీ 5 రౌండ్స్ ఐదు కార్లు ఆల్టో , సెలెరియో,టాటా టియాగో ,టొయోట గ్లాంజా మరియు బంపర్ ప్రైజ్ మెర్స్డ్స్ బెంజ్ ఎ క్లాస్ అందజేశారు. బెంజ్ గెలిచిన విన్నర్స్ సత్నం కౌర్ మరియు డి. సాయికిరణ్. బంపర్ తంబోలా విన్నర్స్ కు సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, వైస్ ప్రెసిడెంట్ తుమ్మల రంగ రావు, మరియు నందమూరి వసుంధర గారి చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కాజా సూర్యనారాయణ, శైలజ జుజాల, బాలరాజు, గోపాల రావు, ఏడిద రాజా, మోహన్ వడ్లపట్ల, సామ ఇంద్రపాల్ రెడ్డి, తంబోలా కమిటీ సభ్యులు స్వరూప, చేతనా, రోహిణి, శైలజ, హకీమ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ నవనామి - మెగాలియో, డి ఎస్ ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, సన్ షైన్ డెవలపర్స్, మెర్సిడీస్ బెంజ్ సిల్వర్ స్టార్, శ్రీ మిత్ర టౌన్షిప్స్, కిమ్స్ హాస్పిటల్స్, ప్రజ్ఞ హాస్పిటల్స్, ఎన్ఎస్ఎల్ ఇన్ఫ్రాటెక్, హర్ష ఆటో, మందిర్, ప్రకృతి ఎవెన్యూస్ & వంశీరాం బిల్డర్స్ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా సెక్రటరీ ముళ్లపూడి మోహన్ గారు మాట్లాడుతూ : గతంలో కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాం. అప్పుడున్న కమిటీ ప్రస్తుత కమిటీ సపోర్ట్ ద్వారానే ఇది అంతా జరుగుతోంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మెంబెర్స్కు రిలాక్సేషన్ లభిస్తుంది. ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎఫ్ ఎన్ సి సి ని ఇండియా లోనే నెంబర్ వన్ క్లబ్ గా తీర్చిదిద్దుతాం. కమిటీ సభ్యుల సహారంతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తాం. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అలాగే స్పాన్సర్ చేసిన స్పాన్సర్స్ కి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చి సపోర్ట్ చేసిన నందమూరి వసుంధర గారికి నా తరఫున మా కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అన్నారు.

K. Raghavendra Rao launches HONEYMOON EXPRESS - Title song

Maverick Director K. Raghavendra Rao launches HONEYMOON EXPRESS - title songHoneymoon Express, a Kalyani Malik musical, has already released three beautiful songs, which are trending on T-Series. Today, Maverick Director K. Raghavendra Rao has released the title song of Honeymoon Express, completing the movie’s full album of four songs.

K. Raghavendra Rao garu has invited writer/director Bala Rajasekharuni, and young composer & singer Spoorthi Jitender to his office in RK Cineplex, Banjara Hills.

Bala, being a faculty of film & theater from the US,  Rao and he discussed about the kind film training offered in the US and India for the younger generations to come.

Later, Bala has shown the 4th lyrical video, the final song to complete the album of HONEYMOON EXPRESS to Sri Rao.Veteran director, a romantic himself, enjoyed the youthful upbeat composition by Spoorthi Jitender, who has been offered to ‘guest compose’ the title song of the movie, by it’s Music Director Kalyani Malik.

Rao spoke about how he knew Bala from his frequent Los Angeles visits, and later as the Dean of Annapurna Studios film institute. He praised the fusion nature of the song in which Spoorthi has penned fun Spanish lines, experimenting with lyrics, with a blend of Telugu & Spanish poetry.

Honeymoon Express title song is co-written by Spoorthi Jithender & Kittu Vissapragada. Spoorthi, has around 100 songs and many of them being hits in Telugu, is also emerging as an international pop singer.

K. Raghavendra Rao blessed Honeymoon Express team for a successful run of the movie.


BANNERS:

Presenters: NRI Entertainments (USA)

Produced by: New Reel India Entertainments Pvt. Ltd.

Produced by: KKR & Bala Raj.

Written & Directed by: Bala Rajasekharuni.

Starring: Chaitanya Rao, Hebah Patel, Tanikella Bharani, Suhasini, Ali, Arvind Krishna, Surekha Vani, Ravi Varma et al.

Music: Kalyani Malik

Background Score: RP Patnaik.

Guest Composer: Spoorthi Jithender.

Cinematography: Sistla VMK

Editing: Umashankar G (USA) & Srikrishna Attaluri.

Digital PRO: Cinedigital, Vamsi Krishna.

PRO: Paul Pavan. 

Preminchoddu Trailer Launched

 ప్రతి విద్యార్థి చూడాల్సిన చిత్రం ‘ప్రేమించొద్దు’... ట్రైలర్ విడుదల చేసిన చిత్ర యూనిట్ 

శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందింది. బ‌స్తీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ ప్రేమ కథాంశమిది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.  పాన్ ఇండియా చిత్రంగా 5  భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌‌ని  జూన్ 7న  విడుదల చేస్తున్నారు.ఆ తర్వాత, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌టానికి కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా ఆదివారం నాడు మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.ఇది వరకు రిలీజ్ చేసిన టీజర్,పోస్టర్, సాంగ్స్‌తో సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. తెలిసీ తెలియని వయసులో ప్రేమించొద్దు అనే కాన్సెప్ట్‌తో రియల్ ఇన్సిడెంట్‌ల ఆధారంగా ఈ మూవీని రా అండ్ రస్టిక్‌గా తెరకెక్కించారని అర్థం అవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌ను చూస్తే పూర్తి కథను వివరించినట్టుగా తెలుస్తోంది.

స్కూల్, కాలేజ్ ఏజ్ లవ్ స్టోరీలు, ప్రేమ అంటూ చదువుల్ని నిర్లక్ష్యం చేయడం, తెలిసీ తెలియని వయసులో ప్రేమిస్తే ఎదురయ్యే పరిణామాలను చూపించారు.ఇక ట్రైలర్‌లోని విజువల్స్, డైలాగ్స్ ఎంతో నేచురల్‌గా ఉన్నాయి. సమాజాన్ని తట్టిలేపేలా ఈ చిత్రం ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. 


నటీనటులు:

అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస, యశ్వంత్ పెండ్యాల, సంతోషి తాళ్ల, సోనాలి గర్జె, లహరి జులురి, శ్రద్ధా సాయి, వల్లీ శ్రీగాయత్రి, లక్ష్మీకాంత్ దేవ్ తదితరులు


సాంకేతిక వర్గం: 

రచన, ఎడిటింగ్, నిర్మాత, దర్శత్వం - శిరిన్ శ్రీరామ్, మ్యూజిక్ ప్రోగ్రామింగ్ - జునైద్ కుమార్, బ్యాగ్రౌండ్ స్కోర్ - కమ్రాన్, సాంగ్స్ కంపోజింగ్ - చైతన్య స్రవంతి, సినిమాటోగ్రఫీ అండ్ కలర్ - హర్ష కొడాలి, స్క్రీన్ ప్లే - శిరిన్ శ్రీరామ్, రాహుల్ రాజ్ వనం, అసోసియేట్ డైరెక్టర్ - సోనాలి గర్జె, పబ్లిసిటీ డిజైన్ - అజయ్(ఏజే ఆర్ట్స్), వి.ఎఫ్.ఎక్స్- వి.అంబికా విజయ్, సౌండ్ : సింక్ సినిమా, చెన్నై, సూపర్‌వైజింగ్ ప్రొడ్యూస‌ర్‌:  నిఖిలేష్ తొగ‌రి, పి.ఆర్.ఒ - చంద్ర వట్టికూటి, మోహన్ తుమ్మల.

"Passion" Team is Preparing for Second Schedule

 ఫస్ట్ షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కు సిద్ధమవుతున్న "పేషన్" మూవీసుధీష్ వెంకట్, అంకిత సాహ, శ్రేయాసి షా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "పేషన్". ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ నేపథ్యంగా సాగే ప్రేమ కథా చిత్రమిది. ఈ సినిమాను బిఎల్ ఎన్ సినిమా, రెడ్ యాంట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై డాక్టర్ అరుణ్  కుమార్ మొండితోక, నరసింహ యేలె, ఉమేష్ చిక్కు నిర్మిస్తున్నారు.  "పేషన్" చిత్రంతో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ జోషువా దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఆయన స్టార్ డైరెక్టర్స్ శేఖర్ కమ్ముల, మదన్, మోహన కృష్ణ ఇంద్రగంటి వంటి వారి వద్ద పనిచేశారు.


ప్రస్తుతం "పేషన్" మూవీ రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. హైదరాబాద్ లోని కొన్ని పాషన్ కాలేజీలలో 20 రోజుల పాటు తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరిపారు. రెండో  షెడ్యూల్ కు మూవీ టీమ్ రెడీ అవుతోంది. ఈ సందర్భంగా


దర్శకుడు అరవింద్ జోషువా మాట్లాడుతూ - హైదరాబాద్ లోని కొన్ని ఫ్యాషన్ కాలేజీలలో 20 రోజులపాటు సినిమాలోని కొన్ని ప్రధాన సన్నివేశాలని చిత్రించాం. ఇప్పుడు రెండవ షెడ్యూల్ కి సిధ్ధమవుతున్నాం. ఫ్యాషన్ ప్రపంచానికి సంబంధించి ఇంతకుముందు ఎపుడూ రానటువంటి ఒక సమగ్రమైన, సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఈ తరహాలో వస్తున్న మొట్టమొదటి భారతీయ సినిమా "పేషన్" అని చెప్పుకోవచ్చు. ప్రేమ, ఆకర్షణకి సంబంధించి యువతలో ఉన్న అనేకమైన ప్రశ్నలకి ఈ సినిమా సమాధానం అవుతుంది. అన్నారు.


నటీనటులు - సుధీష్ వెంకట్, అంకిత సాహ, శ్రేయాసి షా తదితరులు


టెక్నికల్ టీమ్


ఆర్ట్ డైరెక్టర్ - గాంధీ నడికుడికర్

సినిమాటోగ్రఫీ - సురేష్ నటరాజన్

ఎడిటర్ -నాగేశ్వరర్ రెడ్డి

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

బ్యానర్ - బిఎల్ ఎన్ సినిమా, రెడ్ యాంట్ క్రియేషన్స్

నిర్మాతలు -  డాక్టర్ అరుణ్ కుమార్ మొండితోక, నరసింహ యేలె, ఉమేష్ చిక్కు

రచన, దర్శకత్వం -  అరవింద్ జోషువా