"#69 సంస్కార్ కాలనీ" ఫిబ్రవరి 3వ వారంలో విడుదల
రొమాంటిక్ క్రైమ్ కథ సినిమాతో యావత్తు యువతను తనవైపు తిప్పుకున్న దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి. ఆ తర్వాత గల్ఫ్, వలస, హనీ ట్రాప్ లాంటి మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా మరో కొత్త కంటెంట్ తో "#69 సంస్కార్ కాలనీ" చిత్రాన్ని రూపొందిస్తున్నారు. లక్ష్మీ పిక్చర్స్, ఆదిత్య సినిమా పతాకంపై ఎస్తర్ నోరోన్హా,అజయ్ ప్రధాన పాత్రలుగా పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో బి బాపిరాజు, ముతికి నాగ సత్య నారాయణ సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రం "#69 సంస్కార్ కాలనీ . అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 3వ వారంలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.
చిత్ర నిర్మాత బాపిరాజు గారు మాట్లాడుతూ.. ఎక్కడో ఉన్న నన్ను నిర్మాతగా చేసి ఇండస్ట్రీలో నిలబెట్టిన సునీల్ కుమార్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. 1982 నుంచి ఇప్పటివరకు ఫిల్మ్ ఇండస్ట్రీలో నా ప్రయాణం 40 సంవత్సరాలు. ఈ ప్రయాణంలో నన్ను అందరూ ఎంతో ఆదరించారు వారందరికీ నా ధన్యవాదాలు.నేను, సునీల్ గారు ఒక సినిమా సెన్సార్ పనిమీద ముంబయి వెళ్ళినప్పుడు అక్కడ
మాకు ఎదురైన కొన్ని సంఘటన లతో పాటు పేపర్ లోనూ సోషల్ మీడియాలో వచ్చిన యదార్థ సంఘటన లను తీసుకుని ఈ సినిమా చేయడం జరిగింది. గతంలో మేము చేసిన ఒక రొమాంటిక్ ప్రేమ కథ, గంగ పుత్రులు తరహాలో ఈ చిత్రం ఉంటుంది. మంచి కథ మంచి మెసేజ్ తో సినిమాను నిర్మించాము. నేను ఏ సినిమా తీసినా గత 40 సంవత్సరాలు నాగ సత్యనారాయణ గారి దగ్గరె ఫైనాన్స్ తీసుకుంటాను. తను డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గా ఫైనాన్సర్ గా ఇలా మూడు శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న గొప్ప వ్యక్తి. ఈ సినిమా ఫైనాన్స్ కోసం తన దగ్గరకు వెళ్ళిన నాకు ఈ సినిమాకు కథ విన్న తను అక్షర్య పోయి తను ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. ఎంతోమంది నటీనటులకు ఈ సినిమా కథను చెప్తే చేయడానికి ముందుకు రాలేదు. మా కథను నమ్మి చేసిన నటీనటులు ధన్యవాదాలు. పుష్ప ఆచార్య సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా అజయ్ గారు ఈ చిత్రంలో
నటిస్తున్నందుకు వారికి మా ధన్యవాదాలు. ఇమ్మడి ప్రవీణ్ అందించిన మ్యూజిక్ బాగుంది. ఇందులో ఉన్న నాలుగు పాటలు అద్భుతంగా ఉన్నాయి. శివరాం గారి కెమెరా పనితనం సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. ఫిబ్రవరి మూడవ వారంలో "#69 సంస్కార్ కాలనీ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. ఇంతకు ముందు మేము తీసిన సినిమాల ఆదరించినట్లే ఈ సినిమాను కూడా ఆదరించాలని ప్రేక్షకులను మనస్పూర్తిగా కోరుతున్నాను అన్నారు.
చిత్ర దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ..మోడ్రన్ సమాజంలో జరుగుతున్న ఎన్నో పాయింట్స్ ను బాపిరాజు గారు చెప్పడం జరిగింది. సమాజంలో వస్తున్న డైల్యూట్స్ పాయింట్ తీసుకొని సినిమా చేస్తున్నాము. స్వాతి నాకు మంచి కథను ఇచ్చింది. ఒక అమ్మాయి ఇలాంటి సెన్సిటివ్ సబ్జెక్ట్ ను హ్యాండిల్ చేస్తే కథకు న్యాయం జరుగుతుందిజరుగుతుంది. ఇంతకు ముందు నేను చేసిన రస్టిక్, డేరింగ్ ఫిల్మ్ "క్రిమినల్ ప్రేమకథ" కు కూడా అర్చన అనే అమ్మాయి ద్వారా ఎడిటింగ్ చేయించడం జరిగింది. ఎందుకంటే ఫీమేల్ సెన్సిటివ్స్ ఇలాంటి సబ్జెక్ట్ కు అవసరం అవుతుంది. టెక్నీషియన్స్ అందరూ ఎంతో బాధ్యతగా పని చేసారు. కమర్షియల్ గా హిట్ చేయాలనే ఇంటెన్షన్ తో కాకుండా సోషల్ రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రం చేయడం జరిగింది.
రొమాంటిక్ క్రిమినల్స్, క్రిమినల్ ప్రేమకథ సినిమాలు ఎంత హార్డ్ హిట్టింగ్ ఉంటాయో ఈ చిత్రం కూడా అలాంటి హార్డ్ హిట్టింగ్ సినిమా. యూత్ తో పాటు అందరినీ సినిమా అలరిస్తూ ఆలోచింపజేస్తుంది. ఫిబ్రవరి మూడవ వారంలో విడుదల అవుతున్న మా చిత్రాన్ని అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామని అన్నారు
కథా రచయిత గాయత్రి స్వాతి మంత్రిప్రగడ మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చిన సునీల్ కుమార్ రెడ్డి గారికి బాపి రాజు గారికి నా ధన్యవాదాలు.
సొసైటీలో జరిగే సంఘటనలను సినిమా ద్వారా చెప్పటం జరిగింది. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు
ఎడిటర్ కృష్ణ మాట్లాడుతూ.. ఈ కథ చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. సినిమా బాగా వచ్చింది ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు
నటీనటులు
ఎస్తర్ నోరోన్హా, అజయ్, భద్రం,శిల్ప ,రమన్, Fm బాబాయ్,సముద్రం వెంకటేష్ తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : లక్ష్మీ పిక్చర్స్
డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : పి.సునీల్ కుమార్ రెడ్డి
ప్రొడ్యూసర్స్ : బి బాపిరాజు, ముతికి నాగ సత్యనారాయణ స్టోరీ : గాయత్రీ స్వాతి మంత్రిప్రగడ
మ్యూజిక్ : ప్రవీణ్ ఇమ్మడి
డి ఓ పి : ఎస్ వి శివరాం
ఎడిటర్ : కృష్ణ మండల
లిరిక్స్ : గమన శ్రీ ,ఎక్కాలి రవీంద్రబాబు
సింగర్స్ : ఎస్తర్, శ్రీ ప్రసన్న , శ్రీనివాస్ యాదవ్
విఎఫ్ఎక్స్ : శ్యామ్ కుమార్ పి
కాలమిస్ట్ : పురుషోత్తం
సౌండ్ ఇంజనీర్ : విష్ణువర్ధన్ కాగిత
పి ఆర్ ఓ : పాల్ పవన్