Home » » Surabhi 70MM Releasing on February 18th

Surabhi 70MM Releasing on February 18th

ఫిబ్రవరి 18 న థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న " సురభి 70 ఎం ఎం(హిట్టు బొమ్మ ) "




అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులని అలరించిన నూతన దర్శకుడు గంగాధర వై కె  అద్వైత దర్శకత్వం లో రూపొందిన " సురభి 70 ఎం ఎం " సినిమా ఈ నెల 18 వ తేదీన థియేటర్స్ లో విడుదల కానుంది .

"సురభి 70 ఎం ఎం హిట్టు బొమ్మ   ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీ, సినిమా అనేది ప్రతి తెలుగువాడి నరనరాల్లో ఉన్న ఎమోషన్ , సినిమా థియేటర్ ని కాపాడుకోవాలి అనే ఒక మంచి కథతో గ్రామీణ నేపధ్యం లో పూర్తి సహజమైన పాత్రలతో  తెరకెక్కించిన సురభి 70 ఎం ఎం సినిమా లో ప్రేమ కథలు , ఫామిలీ కథలు ఉన్నాయ్ అని    సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధం అయింది" అని చిత్ర దర్శకుడు గంగాధర్ వై కె అద్వైత అన్నారు .

ఇప్పటికే  మెగా స్టార్ చిరంజీవి గారి ట్రిబ్యూట్ సాంగ్ ఐన "చిట్టి చిట్టి కన్నుల్లో " అనే పాట మెగాస్టార్ చిరంజీవి గారి వరకు చేరి సురభి 70 ఎం ఎం టీం ని అభినందించడం కూడా జరిగింది .

బాబీ ఫిలిమ్స్ , జె ఎస్ ఆర్ పిక్చర్స్ సంయుక్తన్గా నిర్మించిన ఈ సినిమా ని  కె కె చైతన్య ప్రొడ్యూస్  చేసారు . అక్షత శ్రీనివాస్ , వినోద్ , అనిల్ , చందు , మహేష్ ,ఉషాంజలి ,శ్లోక , యోగి ఖత్రి, అనీష్ రామ్, సూర్య ఆకొండి ప్రధానపాత్రలు పోషించిన ఈ చిత్రానికి డెన్నిస్ నార్టన్ సంగీతాన్ని అందించారు . 

టెక్నికల్ టీమ్:

సమర్పణ :బాబీ ఫిలిమ్స్ 

పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా

సినిమాటోగ్రఫీ: శేఖర్ , గోపాల్ ఎస్ ఎస్ వి , భరత్ సి కుమార్ 

ఎడిటర్ : నాగిరెడ్డి , కంజర్ల యాదగిరి 

మ్యూజిక్: డెన్నిస్ నార్టన్ 

సహా నిర్మాత : శేషి రెడ్డి జంగా

నిర్మాత: కె కె చైతన్య  

రచన-దర్శకత్వం: గంగాధర వై కె అద్వైత


Share this article :