ఈ నెల 9వ తేదీన హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న"తిమ్మరాజుపల్లి టీవీ" మూవీ ట్రైలర్ రిలీజ్
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. "తిమ్మరాజుపల్లి టీవీ" చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ రోజు "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా ట్రైలర్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా ట్రైలర్ ఈనెల 9వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్ పై మూవీ లవర్స్ లో మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి.
నటీనటులు - సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్, తదితరులు
టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్స్ డిజైనర్ - విశాల్య
ఆర్ట్ డైరెక్టర్ - సుధీర్ మాచర్ల
బిజినెస్ హెడ్ అండ్ మార్కెటింగ్ - చౌహాన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ - రితికేష్ గోరక్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - కేఎల్ మదన్
డీవోపీ - అక్షయ్ రామ్ పొదిశెట్టి
మ్యూజిక్ - వంశీకాంత్ రేఖన
సీఈవో - రహస్య కిరణ్
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
కో ప్రొడ్యూసర్ - తేజ వేల్పుచర్ల
ప్రొడ్యూసర్ - కిరణ్ అబ్బవరం
రచన, ఎడిటింగ్, దర్శకత్వం - వి. మునిరాజు


إرسال تعليق