Supreme Hero Sai Durgha Tej Completes 10Glorious Years In TFI

 పదేళ్ల జర్నీ పూర్తి చేసుకున్న సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్



సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ తెలుగు చిత్ర పరిశ్రమలో పదేళ్ల జర్నీ పూర్తి చేసుకున్నారు. ఆయన హీరోగా నటించిన పిల్లా నువ్వులేని జీవితం సినిమా రిలీజై ఈ రోజుతో పదేళ్లవుతోంది. 2014, నవంబర్ 14న పిల్లా నువ్వు లేని జీవితం సినిమా తెరపైకి వచ్చింది. తొలి చిత్రంతోనే తన నటన, డ్యాన్సులతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు సాయిదుర్గ తేజ్. ఆయన ఆల్ రౌండ్ పర్ ఫార్మెన్స్ తో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ఆ తర్వాత సుప్రీమ్, చిత్రలహరి, ప్రతిరోజు పండగే, విరూపాక్ష వంటి సూపర్ హిట్ చిత్రాలతో తన స్టార్ డమ్ పెంచుకున్నారు సాయిదుర్గ తేజ్. మేనమామ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి బ్రో చిత్రంలో నటించి తన డ్రీమ్ నెరవేర్చుకున్నారు సాయిదుర్గ తేజ్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 18వ సినిమా ఎస్ డీటీ 18 భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. సాయిదుర్గ తేజ్ కెరీర్ లోనే ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతోంది. తన సినిమాలతో పాటు సేవా కార్యక్రమాలతోనూ ప్రజల మనసులు గెల్చుకున్నారు సాయిదుర్గ తేజ్. ఆయన 10 ఏళ్ల నట ప్రయాణం సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు, సహ నటీనటులు, దర్శక నిర్మాతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post