Rural Telangana Backdrop Film in Krishna Direction is Announced

 డైరెక్టర్ కృష్ణ దర్శకత్వం లో తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కనున్న ఫీల్ గుడ్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్..!




మాతంగి మీడియా వర్క్స్ బ్యానర్ పై సరస్వతి మౌనిక నిర్మాత్తగా అండ్ దీప విజయ లక్ష్మి నాయుడు క్రియేషన్స్ బ్యానర్ పై ఆకుల విజయ లక్ష్మి  నిర్మాతగా తెరకెక్కనున్న ప్రోడక్షన్ నంబర్ 1 సినిమాను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విజయదశమి పర్వదిన సందర్బంగా మా సినిమాను స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా అభిమానులతో పాటు, ఆ ఆధిపరాశక్తి దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు కూడా మా చిత్ర యూనిట్ కి దక్కుతాయి అని భావిస్తున్నాము అని తెలిపారు. కాగా ఈ సినిమా తెలంగాణ గ్రామీణ నేపథ్యం లో ఫుల్ లెన్త్ ఎంటర్టైనర్ గా తెరకేక్కిస్తున్నట్టు, ఈ సినిమాకు టెక్నీకల్ టీం కూడా చాలా స్ట్రాంగ్ అవ్వనున్నట్టు తెలిపారు. అయితే ఈ సినిమాలో నటినటులు వివరాలు త్వరలో తెలియజేస్తాం అని చిత్ర యూనిట్ అన్నారు. ఈ సినిమాకు.., కథ - వెంకట్ గౌడ్, డైలాగ్స్ - కర్రా నరేంద్ర రెడ్డి, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ - అనిల్ గొడుగుల.

Post a Comment

Previous Post Next Post