Khel Khatam Darwajaa Bandh First Look Unleashed by Rana Daggubati

 వర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి చేతుల మీదుగా వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ ప్రొడక్షన్ నెం.4 సినిమా "ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్" ఫస్ట్ లుక్, టైటిల్ లాంఛ్




"డియర్ మేఘ", "భాగ్ సాలే" వంటి డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నిర్మాణ సంస్థ వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్. అర్జున్ దాస్యన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం తమ ప్రొడక్షన్ నెం.4గా "ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్" చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రాహుల్ విజయ్, నేహా పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. "ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్" సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను వర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి లాంఛ్ చేశారు. టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆకట్టుకుందన్న రానా..మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ అందించారు.

"ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్" సినిమాను హిలేరియస్ ఫన్ రైడ్ గా నూతన దర్శకుడు అశోక్ రెడ్డి కడదూరి రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.


నటీనటులు - రాహుల్ విజయ్, నేహా పాండే, అజయ్ ఘోష్, మురళీధర్ గౌడ్, గెటప్ శ్రీను, రచ్చ రవి, రవివర్మ, గంగవ్వ, జయశ్రీ, తదితరులు

టెక్నికల్ టీమ్
కో డైరెక్టర్ - ఉమేష్ నాగప్పగారి
కాస్ట్యూమ్స్ - స్ఫూర్తి రావు
ఆర్ట్ డైరెక్టర్ - మోహన్ జి
కొరియోగ్రఫీ - ఈశ్వర్ పెంటి
ఎడిటర్ - ఉదయ్ కుమార్ డి
క్రియేటివ్ హెడ్ - బాబ్ సునీల్
డీవోపీ - కార్తీక్ కొప్పెర
మ్యూజిక్ డైరెక్టర్ - సురేష్ బొబ్బిలి
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
ప్రొడ్యూసర్ - అర్జన్ దాస్యన్
డైరెక్టర్ - అశోక్ రెడ్డి కడదూరి

Post a Comment

Previous Post Next Post