'SAAREE' movie heroine Aaradhya Devi Birthday Celebration at RGV DEN

 RGV DEN లో 'శారీ' మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్    



విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డెన్ నుండి 'శారీ' అనే చిత్రం రాబోతుందన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మరియు మళయాళ భాషల్లో ఈ చిత్రం  నవంబర్ లో విడుదల కానుంది.  గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో 'శారీ'ని ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రముఖ వ్యాపారవేత్త  రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. సత్య యాదు, ఆరాధ్య దేవి ముఖ్య పాత్రధారులుగా,  పలు నిజజీవిత సంఘటనల ఆధారాలతో  సైకలాజికల్ థ్రిల్లర్ గా 'శారీ' మూవీ రూపొందుతోంది.


కాగా ఈ సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ ఆరాధ్య దేవి  సెప్టెంబర్ 28న పుట్టిన రోజు. ఆరాధ్య దేవి కేరళకు చెందిన అమ్మాయి- ఇంతకు ముందు శ్రీలక్ష్మి అనే పేరుతో సాగింది. ఈ చిత్రానికి శారీ ధరించే అమ్మాయి పాత్ర కోసం ఆరాధ్య దేవిని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషం!  ఆరాధ్యను రామ్ గోపాల్ వర్మ ఎవరో తనకు ఫార్వర్డ్ చేసిన ఓ ఇన్ స్టా రీల్ లో తొలుత చూశారు. ఈ అమ్మాయి అయితే 'శారీ'లో బాగుంటుందని సూచించారు. ఇన్ స్టాలో ఆయనకు వచ్చిన రీల్ లో తొలుత ఆయన దృష్టిని ఆరాధ్య ఆకర్షించింది. ఈ సినిమా లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.  


ఈ సంద‌ర్భంగా RGV DEN లోఆరాధ్య బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌జ‌రిగాయి.  ఆమెకు బర్త్ డే విశెస్ చెబుతూ వెరైటీగా భారీ కత్తితో  కేక్ కట్ చేయించారు రామ్ గోపాల్ వర్మ.  బర్త్ డే సెలెబ్రేషన్స్ లో శారీ మూవీ టీం సభ్యులైన నిర్మాత రవి వర్మ, దర్శకుడు గిరి కృష్ణకమల్, చిత్ర హీరో సత్య యాదు పాల్గొని ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 

Post a Comment

Previous Post Next Post