తెలుగు రాష్ట్రాల్లో వరదల పరిస్థితి దృష్ట్యా "ధూం ధాం" సినిమా విడుదల వాయిదా, త్వరలోనే కొత్త డేట్ వెల్లడి
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. "ధూం ధాం" సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
"ధూం ధాం" సినిమా నెల 13న విడుదల కావాల్సింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సినిమాను విడుదల చేయడం సరికాదని మేకర్స్ భావించారు. అందుకే "ధూం ధాం" సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు.
"ధూం ధాం" సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన కంటెంట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. గోపీసుందర్ స్వరపర్చిన 'మల్లెపూల టాక్సీ..', 'మాయా సుందరి..', 'టమాటో బుగ్గల పిల్ల..', 'కుందనాల బొమ్మ..' 'మనసున మనసు నువ్వే..' సాంగ్స్ ఛాట్ బస్టర్స్ అయ్యాయి. "ధూం ధాం" సినిమా హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా త్వరలోనే థియేటర్స్ లోకి రాబోతోంది.
నటీనటులు - చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు
టెక్నికల్ టీమ్
డైలాగ్స్ - ప్రవీణ్ వర్మ
కొరియోగ్రఫీ - విజయ్ బిన్ని, భాను
లిరిక్స్ - సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి
ఫైట్స్ - రియల్ సతీష్
పబ్లిసిటీ డిజైనర్స్ - అనిల్, భాను
ఆర్ట్ డైరెక్టర్ - రఘు కులకర్ణి
ఎడిటింగ్ - అమర్ రెడ్డి కుడుముల
సినిమాటోగ్రఫీ - సిద్ధార్థ్ రామస్వామి
మ్యూజిక్ - గోపీ సుందర్
స్టోరీ స్క్రీన్ ప్లే - గోపీ మోహన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - శివ కుమార్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ - శ్రీనివాస్)
ప్రొడ్యూసర్ - ఎంఎస్ రామ్ కుమార్
డైరెక్టర్ - సాయి కిషోర్ మచ్చా