15 Years Of Chay In TFI: A Pleasant Brand-New Poster From Thandel Released

 15 ఇయర్స్ ఆఫ్ నాగ చైతన్య ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ: 'తండేల్' నుంచి ప్లజెంట్ బ్రాండ్- న్యూ పోస్టర్ రిలీజ్



యువ సామ్రాట్ నాగ చైతన్య 2009లో జోష్‌తో సినిమాస్ లో అడుగుపెట్టి మోస్ట్ సక్సెస్ ఫుల్ యాక్టర్ గా ఎదిగి, స్ట్రాంగ్ ఇంపాక్ట్ ని చూపించారు. విలక్షణమైన పాత్రలలో అనేక సూపర్ హిట్‌లను అందించిన నాగ చైతన్య తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా, నాగ చైతన్య మోస్ట్ ఎవైటెడ్ మూవీ తండేల్ మేకర్స్ బ్రాండ్ న్యూ పోస్టర్‌ను విడుదల చేశారు.


పోస్టర్‌లో రగ్గడ్ అవతార్‌లో కనిపించిన నాగ చైతన్య తన చిరునవ్వుతో కట్టిపడేశారు. చైతు సముద్రం దగ్గర  ఫిషింగ్ బోట్ మీద నిలబడి కనిపించిన ఈ పోస్టర్ అదిరిపోయింది.


చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ సినిమాని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.  నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.  

 

హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.


నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, షామ్‌దత్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు విన్నర్ నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్.


తారాగణం: నాగ చైతన్య, సాయి పల్లవి

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: చందూ మొండేటి

సమర్పణ అల్లు అరవింద్

నిర్మాత: బన్నీ వాస్

బ్యానర్: గీతా ఆర్ట్స్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

డీవోపీ: షామ్‌దత్

ఎడిటర్: నవీన్ నూలి

ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షో

Post a Comment

Previous Post Next Post