Kaala Raatri on Aha from August 17th

 'ఆహా' ఓటీటీలో  ఈనెల 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు వస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ "కాళరాత్రి"



బాబు రాజ్, చేంబన్ వినోద్, బిను పప్పు, గణపతి, తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా "కాళరాత్రి". ఈ చిత్రాన్ని హనుమాన్ మీడియా బ్యానర్ పై బాలు చరణ్ నిర్మించారు. మర్ఫీ దేవసి దర్శకత్వం వహించారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందిన కాళరాత్రి సినిమా ఈ నెల 17వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. 


"కాళరాత్రి" సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - 266 ఎకరాలను అతి తక్కువ ధరకు కొనేందుకు వెళ్లిన స్నేహితుల బృందం ఆ తోటలో ఉన్న గెస్ట్ హౌస్ చూసి సర్ ప్రైజ్ అవుతారు. ఎంతో అందంగా ఉన్న ఆ గెస్ట్ హౌస్ లో పార్టీ చేసుకుంటారు. ఆ భవనంలో అనూహ్య ఘటనలు జరుగుతుంటాయి. వారిలో కొందరు చనిపోతారు. ఆ హత్యలకు కారణం ఎవరన్నది అంతు చిక్కదు. ఇలాంటి ఆసక్తికర మలుపులతో ట్రైలర్ ఆకట్టుకుంది. వీళ్లు ఎందుకు చనిపోతున్నారు. ఎలా చనిపోతున్నారు తెలియాలంటే మూవీ చూడాల్సిందే. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు కాళరాత్రి సినిమా బాగా నచ్చుతుంది.



నటీనటులు 

బాబు రాజ్, చేంబన్ వినోద్, బిను పప్పు, గణపతి, తదితరులు 


టెక్నికల్ టీమ్

బ్యానర్ - హనుమాన్ మీడియా

పీఆర్ఓ - పవన్ పాల్

ఓటీటీ - ఆహా

నిర్మాత బాలు చరణ్

రచన, దర్శకత్వం - మర్ఫీ దేవసి

Post a Comment

Previous Post Next Post