Jatadhara First Look Unveiled Grand Release On Mahashivaratri 2025

 నవ దళపతి సుధీర్ బాబు, ప్రేరణ అరోరా, శివిన్ నారంగ్, వెంకట్ కళ్యాణ్ తెలుగు-హిందీ బైలింగ్వల్ మూవీ టైటిల్ జటాధర, ఫస్ట్ లుక్ విడుదల, 2025 మహాశివరాత్రికి గ్రాండ్ రిలీజ్



నవ దళపతి సుధీర్ బాబు పాన్- ఇండియా సినిమాటిక్ యూనివర్స్ లో తన కెరీర్‌ను న్యూ హైట్స్ కి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో శివన్ నారంగ్‌తో పాటు ప్రముఖ నిర్మాత ప్రేరణా అరోరా నిర్మిస్తున్న ఈ మూవీతో సూపర్ నేచురల్ ఫాంటసీ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీకి 'జటాధర' అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు.


జటాధర ఇప్పటికే తెలుగు, బాలీవుడ్ రెండింటిలోనూ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్. మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.


ఫస్ట్ లుక్ పోస్టర్ సుధీర్ బాబుని పవర్ ఫుల్, స్ట్రాంగ్ అవతార్ లో ప్రెజెంట్ చేసింది. సుధీర్ బాబు తన చేతిలో త్రిశూలంతో శివుని రూపం ముందు నిలబడి ఉన్నారు. సిక్స్-ప్యాక్ అబ్స్‌ తో మాచోలా కనిపిస్తున్నారు.

 

రుస్తోమ్, టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్ , పరి లాంటి సూపర్ హిట్స్ అందించిన విజనరీ ప్రొడ్యూసర్ 'ప్రేర్ణ అరోరా' నిర్మాణ భాగస్వామిగా వున్న ఈ ఎక్సయిటింగ్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. షూటింగ్ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.


గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ అందించడానికి టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేయనున్నారు. ప్రేరణ అరోరా, శివిన్ నారంగ్, నిఖిల్ నందా, ఉజ్వల్ ఆనంద్ ఈ చిత్రాన్ని  హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.  


జటాధర 2025 మహాశివరాత్రికి గ్రాండ్ గా రిలీజ్‌ కానుంది.


Post a Comment

Previous Post Next Post