Sharvari gets ready to start shooting for #Alpha!

 ఆల్ఫాకి సిద్ధమవుతున్న శార్వరి.. మండే మోటివేషన్‌ చూశారా?



రెయిజింగ్‌ స్టార్‌ శార్వరి తన కెరీర్‌ బెస్ట్ మూవీ ఆల్పా షూటింగ్‌కి సిద్ధమవుతున్నారు. యష్‌రాజ్‌ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్‌ సినిమాగా తెరకెక్కుతోంది ఆల్ఫా. ఆలియా భట్‌ ఈ సినిమా సెట్స్ లో ఆల్రెడీ జాయిన్‌ అయ్యారు. ఇప్పుడు శార్వరి వంతు వచ్చింది. శార్వరి సోషల్‌ మీడియాలో హాట్‌ మండే మోటివేషన్‌ని పోస్ట్ చేశారు.

 Check out Sharvari’s post here: https://www.instagram.com/p/C9bo32rt8c9/?igsh=aG41dDVtbTFvbW5i

తాను చేస్తున్న వర్కవుట్స్ గురించి చెప్పడమే కాదు, తన ఫ్యాన్స్ ని, జనాలను కూడా మోటివేట్‌  చేసేలా ఉంది శార్వరి పోస్ట్. సోమవారం రోజు వర్కవుట్స్ ని అస్సలు మిస్‌ కావద్దంటూ ఆమె పెట్టిన పోస్టుకు లైకుల పరంపర కొనసాగుతోంది. అంతే కాదు, ప్రతి రోజూ వర్కవుట్‌ చేస్తే ఎంత ఫిట్‌గా ఉంటారో ఆమె పోస్ట్ చేసిన పిక్స్ చెప్పకనే చెబుతున్నాయి.

 

శార్వరి ప్రస్తుతం నిఖిల్‌ అద్వానీ వేదాలో నటిస్తున్నారు. ది రైల్వే మెన్‌ ఫేమ్‌ శివ్‌ రవైల్‌ దర్శకత్వంలో యష్‌రాజ్‌ఫిల్మ్స్  పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఆల్ఫాలో కెరీర్‌ బెస్ట్ రోల్‌  చేస్తున్నారు.


Post a Comment

Previous Post Next Post