Rakshit Atluri's "Operation Raavan" Grand Theatrical Release on August 2nd

ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రక్షిత్ అట్లూరి “ఆపరేషన్ రావణ్” సినిమా



రక్షిత్ అట్లూరి హీరోగా రాధికా శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా “ఆపరేషన్ రావణ్”. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య తెలుగు మరియు తమిళ బాషల్లో రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ఆపరేషన్ రావణ్” సినిమా రిలీజ్ డేట్ ను ఈరోజు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు వారు వెల్లడించారు.


“ఆపరేషన్ రావణ్” రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ పై ఓ సైకో స్టోరీ అనే క్యాప్షన్ పెట్టారు. యాక్షన్ సీక్వెన్సులోని హీరో రక్షిత్ అట్లూరి స్టిల్ తో డిజైన్ చేసిన ఈ పోస్టర్  ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. “ఆపరేషన్ రావణ్” సినిమాలో రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, తమిళ నటుడు విద్యా సాగర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా విజయంపై మూవీ టీమ్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.



నటీనటులు: రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్, రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, కెఎ పాల్ రాము, విద్యా సాగర్, టీవీ5 మూర్తి, కార్తీక్ తదితరులు


సాంకేతిక బృందం :

సంగీతం: శరవణ వాసుదేవన్

డైలాగ్స్: లక్ష్మీ లోహిత్ పూజారి

ఎడిటర్: సత్య గిద్దుటూరి

ఆర్ట్: నాని.టి

ఫైట్స్: స్టంట్ జాషువా

కోరియోగ్రఫీ: జేడీ

ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీపాల్ చొళ్లేటి

పిఆర్ఓ: జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

నిర్మాత: ధ్యాన్ అట్లూరి

రచన-దర్శకత్వం: వెంకట సత్య


 

Post a Comment

Previous Post Next Post