"Yevam" Unveils Bharatraj's Commanding Look as Police Officer Abhiram

 యేవమ్ ,చిత్రంలో పోలీస్‌ఆఫీసర్‌ అభిరామ్‌గా భరత్‌రాజ్‌



 కంటెంట్‌ను నమ్మి చేసిన సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ వుంటుంది. డిఫరెంట్‌ అండ్‌ న్యూ కంటెంట్‌తో రాబోతున్న మా సినిమాపై అందుకే పూర్తి విశ్వాసంతో వున్నాం అంటున్నారు దర్శకుడు  ప్రకాష్‌ దంతులూరి . ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'యేవమ్‌' చాందిని చైద‌రి, వ‌శిష్ట సింహా, భరత్‌రాజ్‌,ఆషు రెడ్డి  ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన చాందిని చౌదరి, ఆషూ రెడ్డి, వశిష్ట సింహా పాత్రలకు సంబంధించిన లుక్స్‌ విడుదల చేశార. తాజాగా ఈ చిత్రంలో మరో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా అభిరామ్‌గా కనిపించనున్న భరత్‌రాజ్‌ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌. పోలీస్‌ గెటప్‌లో గన్‌ను ఎయిమ్‌ చేస్తూ అతని లుక్‌ కనబడుతుంది. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ  ఇటీవల విడుదల చేసిన చాందిని చౌదరి, ఆషు రెడ్డి పాత్ర‌లకు సంబంధించిన లుక్స్‌కు మంచి స్పందన వచ్చింది.  మహిళా సాధికారికతను చాటి చెప్పే నేప‌థ్యంలో ఈ సినిమా వుంటుంది.  ఈ రోజు విడుదల చేసిన అభిరామ్‌ లుక్‌ కూడా అందర్ని అలరిస్తుంది. ఈ పాత్రలో కూడా డిఫరెంట్‌ షేడ్స్‌ వుంటాయి. ఈ చిత్రంలో  ప్ర‌తి పాత్ర‌కు ఒక మార్క్ వుంటుంది. కొత్త కంటెంట్‌తో పాటు ఎంతో డిఫరెంట్‌ నేరేషన్‌తో ఈ సినిమా వుంటుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది' అన్నారు. చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్‌, ఆషురెడ్డి, గోపరాజు రమణ, దేవిప్రసాద్‌, కల్పిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్‌క్ష్మ ఎస్‌వీ విశ్వేశ్వర్‌, సంగీతం కీర్తన శేషు, నీలేష్‌ మందలపు అందిస్తున్నారు. సుజనా అడుసుమిల్లి ఎడిటర్‌గా, రాజు పెన్మెత్స ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


Post a Comment

Previous Post Next Post