Classic Movie Manam 10Years Celebrations With Special Shows

 లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, అన్నపూర్ణ స్టూడియోస్ క్లాసిక్ 'మనం' పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు  



లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మనం'.  మే23, 2014న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాదించడంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ క్లాసిక్‌ మూవీ గా నిలిచింది.


'మనం' విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ క్లాసిక్ ఎంటర్‌టైనర్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. మే23న రెండు తెలుగు రాష్ట్రాలలో 'మనం' స్పెషల్ షోలని ప్రదర్శించబోతున్నారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లో ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ చేశారు.    


ఈ మ్యాజికల్ అప్డేట్ ని అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియాలో పంచుకుంటూ #మనం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రం. థియేటర్లలో మరోసారి సెలబ్రేట్ చేసుకుందాం' అని ట్వీట్ చేశారు.


#మనం నా మనసులో చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. 10 సంవత్సరాల వేడుకలను జరుపుకోవడానికి తిరిగి థియేటర్లలోకి తీసుకువస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది #ANRLivesOn'' అని  హీరో నాగ చైతన్య ట్వీట్ చేశారు.


అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మక నిర్మాణంలో, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని మూడు తరాల హీరోలు కలసి తెరపై కనిపించడం ప్రేక్షకుల మనసులో చేరగని ముద్ర వేసింది.


ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ అందించిన ఆల్బమ్ ఎవర్ గ్రీన్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు, ప్రేక్షకులని మరోసారి మెస్మరైజ్ చేయబోతోంది.

Post a Comment

Previous Post Next Post