మార్చి 10వ తేదీ వరకు డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో సేవ్ ద టైగర్స్ సీజన్ 1 ఫ్రీ స్ట్రీమింగ్
సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్’ ను మార్చి 10వ తేదీ వరకు ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తోంది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్. ‘సేవ్ ద టైగర్స్’ సీజన్ 2 త్వరలో రాబోతున్న నేపథ్యంలో ఈ ఆఫర్ ఇస్తోంది. ఈ సిరీస్ లో ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించారు. ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్ గతేడాది స్ట్రీమింగ్ కు వచ్చి ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.
భార్యభర్తల మధ్య జరిగే భిన్నమైన కథల ఆంథాలజీగా రూపొందిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది. మహి వి. రాఘవ్, చిన్నా వాసుదేవరెడ్డి నిర్మించిన వెబ్ సిరీస్ కు తేజ కాకుమాను దర్శకత్వం వహించారు. ఫస్ట్ సీజన్ కు వచ్చిన రెస్పాన్స్ తో ‘సేవ్ ద టైగర్స్’ సీజన్ 2 మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా సీజన్ 2 ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. త్వరలోనే ‘సేవ్ ద టైగర్స్’ సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ను డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ అనౌన్స్ చేయనుంది.