Home » » Ooru Peru Bhairavakona Blockbuster Premieres

Ooru Peru Bhairavakona Blockbuster Premieres

'ఊరు పేరు భైరవకోన' ప్రీమియర్స్ కు యూనిమస్ గా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది:  బ్లాక్ బస్టర్ ప్రీమియర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో సందీప్ కిషన్ & టీంయంగ్ ట్యాలెంటెడ్ సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ 'ఊరు పేరు భైరవకోన'. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్ లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత.  ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇప్పటికే ప్రదర్శించిన ప్రీమియర్స్ కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం శుక్రవారం (ఫిబ్రవరి16) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర బృందం బ్లాక్ బస్టర్ ప్రీమియర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది.


బ్లాక్ బస్టర్ ప్రీమియర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. దాదాపు వంద  ప్రీమియర్ షోలు పడ్డాయి. థియేటర్స్ కి వచ్చిన ప్రతి ఒక్క ఆడియన్ కి థాంక్స్. పాటలు, ట్రైలర్ కు మీరు ఇచ్చిన రెస్పాన్స్, మా మీద మీరు పెట్టుకున్న నమ్మకానికి చాలా రుణపడి వున్నాం. ముందుగా చెప్పినట్లే ప్రిమియర్ షో టికెట్ వున్న వారు ఆ టికెట్ తో 20శాతం డిస్కౌంట్ వివాహభోజనంభు లో రిడీమ్ చేసుకోవచ్చు. ఇది నా తరపున ప్రేక్షకులకు చిరు కానుక. ప్రీమియర్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. నా పెర్ఫార్మెన్స్ ని చాలా మెచ్చుకున్నారు. ఇది చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. మా టీం అందరికీ థాంక్స్.  ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ యూనిమస్ గా సినిమా హిట్, చాలా బావుందని అన్నారు.  చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకూ చూడటానికి ఒక ఫాంటసీ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ని తీశాం. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చూసే సినిమా ఇది. ప్రేక్షకులందరీ రెస్పాన్స్ కోసం ఎదురుచుస్తున్నాం'' అన్నారు      


నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. 'ఊరు పేరు భైరవకోన' ప్రీమియర్స్ అద్భుతమైన స్పంధన వస్తోంది. ఈ స్పంధన ముందే ఊహించాం. సందీప్, ఆనంద్, రాజా.. టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేశారు. సెట్స్ అద్భుతంగా వున్నాయి. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర గొప్ప మ్యూజిక్ ఇచ్చారు. ప్రీమియర్స్ ఈ రేంజ్ లో సక్సెస్ అవ్వడం, ప్రతి ఒక్కరూ సినిమా చాలా అద్భుతంగా వుందని చెప్పడం చాలా పాజిటివ్ సైన్. ప్రీమియర్స్ టార్గెట్ కోటి రూపాయిలకి పైగా హిట్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది. రేపు థియేటర్స్ కూడా అద్భుతంగా వుండబోతుంది'' అన్నారు.


దర్శకుడు విఐ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రీమియర్స్ కు వచ్చిన ఆడియన్స్ అందరికీ థాంక్స్. అన్నీ షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి.  మూవీ చుసిన అందరూ అభినందించడం ఆనందాన్ని ఇచ్చింది. నేను చెప్పిన కథ చూసి మొహంలో ఎక్సయిట్ మెంట్ కోసం దర్శకుడినయ్యాను. ఆ ఎక్సయిట్మెంట్ ని ప్రిమియర్స్ రోజు ప్రతి ఆడియన్ మొహంలో చూశాను. ఇది గొప్ప ఆనందాన్ని ఇచ్చింది.  శుక్రవారం సినిమా విడుదలౌతుంది. తప్పకుండా అందరూ చూడాలి' అని కోరారు.


నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ... రెండున్నరేళ్లు పాటు కష్టపడి ఈ సినిమా చేశాం. ఇదొక డిఫరెంట్ మూవీ. ఈ మధ్య కాలంలో ఫాంటసీ థ్రిల్లర్ తెలుగులో రాలేదు. సినిమా కంటెంట్ పై వున్న నమ్మకంతో వంద షోస్ పెయిడ్  ప్రీమియర్స్ వేశాం. కోటి రూపాయిలు పైన గ్రాస్ రావడం అనేది ఈ సినిమాకి వున్న క్రేజ్ కి నిదర్శనం. ఇంత మంచి సినిమాని నిర్మించే అవకాశం ఇచ్చిన దర్శకుడు విఐ ఆనంద్ గారికి, ఫ్యామిలీ మెంబర్ లా అన్నిట్లో తోడు వుండే అనిల్ గారికి,  హీరో అనిల్ గారికి.. టీం అందరికీ ధన్యవాదాలు. అందరూ సినిమా చూసి పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను''


హీరోయిన్ కావ్యా థాపర్ మాట్లాడుతూ.. ఇది చాలా స్పెషల్ మూవీ. దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. టీం అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. సందీప్ కిషన్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, యాక్టర్. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది'' అన్నారు.


హీరోయిన్ వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ.. ఓ కామన్ ఆడియన్ లా ప్రీమియర్స్ చూశాను. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా యూనిట్ అందరికీ థాంక్స్. అందరూ సినిమాకి సపోర్ట్ చేయాలి' అని కోరారు. ఈ ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.


Share this article :