స్టార్ హీరో నాగ చైతన్య చేతుల మీదుగా డిఫరెంట్ థ్రిల్లర్ "ఆరంభం" టీజర్ రిలీజ్
మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా "ఆరంభం". ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వి.టి నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్నారు. ఒక డిఫరెంట్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఆరంభం సినిమా టీజర్ ను స్టార్ హీరో నాగ చైతన్య ఇవాళ రిలీజ్ చేశారు. టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉందన్న నాగ చైతన్య మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ అందించారు.
హీరో నాగ చైతన్య మాట్లాడుతూ - థ్రిల్లర్, యాక్షన్ ఎలిమెంట్స్ తో "ఆరంభం" టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కొన్ని క్యారెక్టర్స్ లో గ్రే షేడ్స్ ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ కొత్తగా ఉన్నాయి. టీజర్ బ్యాక్ గ్రౌండ్ లో రామాయణ స్టోరీ నెరేట్ చేస్తూ ఇంటర్ కట్స్ లో వేసిన విజువల్స్ తో టీజర్ డిఫరెంట్ గా కట్ చేశారు. "ఆరంభం" మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.
ఇప్పటిదాకా వినని ఒక కథ చెబుతానంటూ ఒక మహిళ చెప్పే కథతో "ఆరంభం" టీజర్ మొదలైంది. శ్రీరాముడు తన అవతారం చాలించి వైకుంఠానికి వెళ్లే సమయం వస్తుంది. హనుమంతుడు తనను వెళ్లనివ్వడని తెలిసి శ్రీరాముడు తన ఉంగరాన్ని ఒక పుట్టలో జారవిడుస్తాడు. ఆ ఉంగరం తెచ్చేందుకు హనుమంతుడు పుట్టలోకి వెళ్లడం, అలా వెళ్తూ పాతాళలోకం చేరుకుంటాడు.అక్కడ వాసుకి హనుమంతుడికి దారి చూపించడం జరుగుతుంది. హనుమంతుడికి పాతాళలోకంలో అనేక ఉంగరాలు కనిపిస్తాయి. వీటిలో శ్రీరాముడి ఉంగరం ఏదని వాసుకిని హనుమంతుడు అడగగా..ఇవన్నీ శ్రీరాముడివే అని వాసుకి చెబుతుంది. ఈ కథ వాయిస్ ఓవర్ వస్తుండగా..."ఆరంభం" టీజర్ లో జైలు, ఒక కేసు వివరాలు, ఇతర క్యారెక్టర్స్, జరగనివి జరిగినట్లు అనిపించే డెజావు ఏంటి అనే అంశాలు చూపించారు. ఇవన్నీ టీజర్ పై ఆసక్తిని కలిగిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాను థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నారు.
నటీనటులు - మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల, బొడ్డేపల్లి అభిషేక్, సురభి ప్రభావతి తదితరులు
టెక్నికల్ టీమ్
ఎడిటర్ - ఆదిత్య తివారీ, ప్రీతమ్ గాయత్రి
సినిమాటోగ్రఫీ - దేవ్ దీప్ గాంధీ కుండు
మ్యూజిక్ - సింజిత్ యర్రమిల్లి
డైలాగ్స్ - సందీప్ అంగడి
సౌండ్ - మాణిక ప్రభు సిఎస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వినయ్ రెడ్డి మామిడి
సీఈవో - ఉజ్వల్ బీఎం
పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా
బ్యానర్ - ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్
ప్రొడ్యూసర్ - అభిషేక్ వి.టి
దర్శకత్వం - అజయ్ నాగ్ వీ
Post a Comment