విక్టరీ వెంకటేష్, శైలేష్ కొలను, వెంకట్ బోయనపల్లి, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘సైంధవ్’ ట్రైలర్ జనవరి 3న విడుదల
విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్‌మార్క్ మూవీ ‘సైంధవ్’ 2024లో విడుదలవుతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో ఒకటి. వెరీ ట్యాలెంటెడ్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.
మేకర్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సైంధవ్’ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ‘సైంధవ్’ ట్రైలర్ జనవరి 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో వెంకటేష్, బేబీ సారా చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.
నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా లాంటి ప్రముఖ నటుల ఈ చిత్రంలో కీలక పాత్రలలో అలరించనున్నారు. ఈ పాన్ ఇండియా మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి భారీ స్థాయిలో నిర్మించగా, కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత.
సెన్సేషనల్ కంపోజర్ సంతోష్ నారాయణన్ ‘సైంధవ్’ కు చార్ట్ బస్టర్ ఆల్బమ్ అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. ఎస్.మణికందన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, గ్యారీ బిహెచ్ ఎడిటర్.
సైంధవ్ జనవరి 13న అన్ని దక్షిణ భారత భాషలు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానుంది.
తారాగణం: వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా, జయప్రకాష్
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: శైలేష్ కొలను
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
బ్యానర్: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: సంతోష్ నారాయణన్
సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు
డీవోపీ: యస్.మణికందన్
సంగీతం: సంతోష్ నారాయణన్
ఎడిటర్: గ్యారీ బిహెచ్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
VFX సూపర్‌వైజర్: ప్రవీణ్ ఘంటా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం (వెంకట్)
పీఆర్వో: వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైనర్: అనిల్ & భాను
మార్కెటింగ్: CZONE డిజిటల్ నెట్‌వర్క్