Producer Bellamkonda Suresh Met Telangana Cm



 ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా అయ‌న‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి గారితో కాసేపు ముచ్చటించారు.  సినీ పరిశ్రమలో అందరితో కలుపుగోలుగా వుండే మీరు ఈ రోజున ముఖ్యమంత్రి అయ్యారు, పరిశ్రమ అభివృద్ధికి మీ సహాయ సహకారాలు అందించాలని కోరగా అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు.


Post a Comment

Previous Post Next Post