15 years For Arundathi

 అసాధారణ విజయం సాధించిన

"అరుంధతి" విడుదలై 15 ఏళ్ళు!!



దర్శకమాంత్రికుడు కోడి రామకృష్ణ

కెరీర్ లో మరో కలికితురాయిగా

నిలిచిన "అరుంధతి"కి ఒకటిన్నర దశాబ్దం


అప్పటివరకు అందాల ప్రదర్శనకు మాత్రమే పరిమితమవుతూ వచ్చిన అనుష్కలోని అభినయ సామర్ధ్యాన్ని వెలికి తీసి, ఆమె కెరీర్ ను టర్న్ చేసిన చిత్రం "అరుంధతి". అనంతర కాలంలో అనుష్క నటించిన "బాహుబలి, బాగమతి' చిత్రాలకు బీజం వేసిన చిత్రంగానూ "అరుంధతి"ని అభివర్ణించవచ్చు. "అరుంధతి, జేజెమ్మ" పాత్రలలో అనుష్క కనబరిచిన అద్భుత అభినయం ఆబాలగోపాలాన్ని అలరించింది!!


తెలుగు సినిమాకు గ్రాఫిక్స్ మాయాజాలాన్ని పరిచయం చేసిన దర్శక మాంత్రికుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన  ఈ చిత్ర రాజం విడుదలై నేటికి ఒకటిన్నర దశాబ్దం గడిచింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు నందులు కైవసం చేసుకున్న "అరుంధతి" సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజూ జనవరి 16, 2009లో విడుదలై, తెలుగు సినిమా చరిత్రలో ఎన్నటికీ చెరగని ముద్ర వేసింది. అనుష్కకు స్పెషల్ జ్యురి నంది అవార్డు సొంతమయ్యేలా చేసిన "అరుంధతి"... పశుపతిగా మెప్పించిన సోనూ సూద్ కు ఉత్తమ విలన్, ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కు ఉత్తమ కళా దర్శకుడు అవార్డులు గెలిచి పెట్టింది!!


కోడి రామకృష్ణ దర్శకత్వంలో... రాజీ పడడం అన్నది ఎరుగని సుప్రసిద్ధ నిర్మాత ఎం.శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి నేటి రాజమౌళి ఆస్థాన ఛాయాగ్రాహకుడు కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా... కోటి సంగీతం సమకూర్చారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్.

Post a Comment

Previous Post Next Post