Home » » Kismasth Movie Releasing on February 2nd

Kismasth Movie Releasing on February 2nd

 కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ ‘కిస్మత్‌' ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలనరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వ దేవ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న బడ్డీ కామెడీ ఎంటర్ టైనర్ ‘కిస్మత్‌ . కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.


తాజాగా మేకర్స్ ఈ చిత్రం విడుదల తేదిని అనౌన్స్ చేశారు. ‘కిస్మత్‌’ ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వ దేవ్, అవసరాల శ్రీనివాస్. రియా సుమన్ .. సర్ ప్రైజింగ్ ఎక్స్ ప్రెషన్స్ తో చూస్తున్న రిలీజ్ డేట్ పోస్టర్ చాలా క్యురియాసిటీని పెంచింది.


రియా సుమన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాజు నిర్మిస్తున్నారు. సిహెచ్ భానుప్రసాద్ రెడ్డి సహ నిర్మాత.


ఈ చిత్రానికి వేదరామన్ శంకరన్ డీవోపీగా పని చేస్తుండగా, మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు. విప్లవ్ నైషధం ఎడిటర్.


తారాగణం: నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, అవసరాల శ్రీనివాస్, విశ్వ దేవ్, రియా సుమన్, అజయ్ ఘోష్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర, రచ్చ రవి


సాంకేతిక విభాగం:

దర్శకత్వం: శ్రీనాథ్ బాదినేని

నిర్మాత: రాజు

సహ నిర్మాత: సిహెచ్ భానుప్రసాద్ రెడ్డి

బ్యానర్లు: కామ్రెడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్

డీవోపీ: వేదరామన్ శంకరన్

సంగీతం: మార్క్ కె రాబిన్

ఎడిటర్: విప్లవ్ నైషధం

ఆర్ట్: రవి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: భరత్ రెడ్డి

పీఆర్వో: వంశీ-శేఖర్Share this article :