Home » » Dipiri Dipiri Song From Keedaa cola Released

Dipiri Dipiri Song From Keedaa cola Released

 తరుణ్ భాస్కర్ దాస్యం, రానా దగ్గుబాటి, విజి సైన్మా 'కీడా కోలా' నుంచి డిపిరి డిపిరి పాట విడుదల



తన తొలి రెండు చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందించిన యంగ్ అండ్ ట్యాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో చిత్రంగా యూనిక్  క్రైమ్ కామెడీ మూవీ 'కీడా కోలా'తో వస్తున్నారు. హీరో రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ఈ చిత్రం  ట్రైలర్ ఇటివలే విడుదలై సినిమాపై అంచనాలని పెంచింది.


ఇప్పుడు మేకర్స్ కీడా కోలా మ్యూజికల్ ప్రమోషన్స్ ని ప్రారంభించారు. వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం నుంచి డిపిరి డిపిరి పాటని విడుదల చేశారు. ఈ పాటని యూనిక్ స్టయిల్ లో కంపోజ్ చేశారు వివేక్.


వోకల్స్, లిరిక్స్, ఇన్స్ట్రుమెంట్స్, సాంగ్ ప్రోగ్రామింగ్ అన్నీ న్యూ ఏజ్ సౌండింగ్ తో చాలా క్యాచిగా వున్నాయి. భరద్వాజ్ గాలి లిరిక్స్ అందించిన ఈ పాటని హనుమాన్ సిహెచ్ పాడిన విధానం చాలా ఎనర్జిటిక్ వుంది. పాటలో వినిపించిన అరబిక్ ర్యాప్ కూడా అలరించింది.


విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎజె ఆరోన్ సినిమాటోగ్రఫీ, ఉపేంద్ర వర్మ ఎడిటర్, ఆశిష్ తేజ పులాల ఆర్ట్ డైరెక్టర్.


కీడా కోలా నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది


తారాగణం: బ్రహ్మానందం, రఘు రామ్, రవీంద్ర విజయ్, జీవన్ కుమార్, విష్ణు, తరుణ్ భాస్కర్, చైతన్య రావు మదాడి, రాగ్ మయూర్ తదితరులు


రచన, దర్శకత్వం : తరుణ్ భాస్కర్ దాస్యం

ప్రొడక్షన్ హౌస్ - విజి సైన్మ

రైటర్స్ రూమ్ - క్విక్ ఫాక్స్

నిర్మాతలు:  కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్ & ఉపేంద్ర వర్మ  

సమర్పణ: రానా దగ్గుబాటి

సంగీతం: వివేక్ సాగర్

సినిమాటోగ్రఫీ: ఏజే ఆరోన్

ఎడిటర్: ఉపేంద్ర వర్మ

ఆర్ట్ డైరెక్టర్: ఆశిష్ తేజ పులాల

కాస్ట్యూమ్స్: పూజిత తాడికొండ

పీఆర్వో: వంశీ-శేఖర్



Share this article :