Home » » Dhimahi Trailer Launched

Dhimahi Trailer Launched

 నెక్రోమాన్సీ అనగా చనిపోయిన వాళ్ళతో మాట్లాడటం అనే కొత్త కాన్సెప్ట్ వస్తున్నా ధీమహి చిత్రం



ధీమహి చిత్రం ట్రైలర్ విడుదల. అక్టోబర్ 27న విడుదల


కెప్టెన్ కుక్ ఫిలిమ్స్ పతాకంపై 7:11PM  చిత్రం ఫేమ్ సాహస్ పగడాల హీరోగా నటించిన సినిమా 'ధీమహి'. విరాట్ కపూర్, సాహస్ పగడాల సంయుక్తంగా  నిర్మించిన ఈ చిత్రానికి  సాహస్ పగడాల, నవీన్ కంటె దర్శకులు. ఇందులో నిఖిత చోప్రా హీరోయిన్. షారోన్ రవి సంగీతం అందించారు. ఈ చిత్రం అని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల అనగా అక్టోబర్ 27న విడుదల కు సిద్ధంగా ఉంది. అయితే ఈరోజు ఈ చిత్రం యొక్క థియేట్రికల్ ట్రైలర్ ను సోషల్ మీడియా విడుదల చేసారు చిత్ర యూనిట్. 



అనంతరం చిత్ర యూనిట్ మాట్లాడుతూ "మా ధీమహి చిత్రం ఈ నెల అనగా అక్టోబర్ 27న విడుదల అవుతుంది. అయితే ఈరోజు థియేట్రికల్ ట్రైలర్ ను సోషల్ మీడియా విడుదల చేసాం. ట్రైలర్ చాలా బాగుంది అని కామెంట్స్ వస్తున్నాయి. ఈ రెండు నిమిషాల ట్రైలర్  సినిమా పై అంచనాలు పెంచుతుంది. హీరో సాహస్ పగడాల కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తున్నాడు. ఇదివరకు 7:11PM చిత్రం తో టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ ను మరియు ఇప్పుడు ఆత్మల మార్పిడి కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తున్నాడు. విసుల్స్ మరియు సినిమాటోగ్రఫీ బాగున్నాయి, నెక్రోమాన్సీ అనగా చనిపోయిన వాళ్ళతో మాట్లాడటం అనే కొత్త కాన్సెప్ట్ ని ఈ చిత్రంలో పొందుపరిచారు. చిత్రాన్ని మొత్తం ఫారిన్ లోనే షూట్ చేసారు. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో మంచి థ్రిల్లింగ్ అంశాలతో సరికొత్త కథ కథనం తో ఉంటుంది. మా చిత్రం అందరికి నచ్చుతుంది. 


 7:11 చిత్రం లో నటించిన సాహస్ పగడాల ఈ చిత్రం లో నటించి, స్వీయ దర్శకత్వం వహించారు. మా చిత్రం లోని పాటలు జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదల చేస్తాము. అక్టోబర్ 27న విడుదల చేస్తున్నాం, తప్పక చుడండి" అని తెలిపారు. 


చిత్రం పేరు : ధీమహి


నటీనటులు : సాహస్ పగడాల, నిఖిత చోప్రా, విరాట్ కపూర్, జె డి చెరుకూరు, ఆషిక, శ్రీజిత్, గంగాధరన్, సౌజన్య కాసినా, వంశి దావులూరి, తదితరులు 


ఎడిటర్ : సంతోష్ కామిరెడ్డి 


కెమెరా మాన్ : రహ్ శర్మ 


మ్యూజిక్ : షారోన్ రావి


పి ఆర్ ఓ : పాల్ పవన్ 


డిజిటల్ పి ఆర్ ఓ : వంశి (సినీ డిజిటల్)


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చైతు పడిగల 


కో ప్రొడ్యూసర్ : ఎమ్ ఎస్ కార్తీక్, శ్రీధర్ రెడ్డి గూడా 


దర్శకులు : సాహస్ పగడాల, నవీన్ కంటె 


నిర్మాతలు : విరాట్ కపూర్ , సాహస్ పగడాల


Share this article :