Home » » Bhagavanth Kesari Pressmeet Held Grandly

Bhagavanth Kesari Pressmeet Held Grandly

‘భగవంత్ కేసరి' ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుంది: గ్రాండ్ ప్రెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ



గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి'. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోషిసున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలు, ట్రైలర్ ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది.


ప్రెస్ మీట్ లో నటసింహ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. దుర్గమ్మ వారి నవరాత్రులు జరుపుకుంటున్న ఈ తరుణంలో నా 108 చిత్రంగా భగవంత్ కేసరి ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా వుంది. దుర్గ అంటే స్త్రీ శక్తి. ఈ సినిమా కథ కూడా స్త్రీ శక్తికి సంబధించినదే. దుర్గమ్మ వాహనం పులి. ఈ సినిమాలో కూడా అమ్మాయిని పులిలా పెంచాలనే మాట వుంది. అలాగే సినిమా పేరు కూడా భగవంతుడితో మొదలైయింది. నేలకొండ భగవంత్ కేసరి హై ఎనర్జీ తో వుంటుంది. అనిల్ రావిపూడి భిన్నమైన సినిమాలు చేశారు. ముందు మా అన్నయ్య గారి అబ్బాయి కళ్యాణ్ రామ్ తో పటాస్ చేశాడు. అందులో కూడా నా పాటని రీమిక్స్ చేశాడు. ఆయన సినిమాలు గమనిస్తే అన్నీ డిఫరెంట్ గా వుంటాయి. చాలా అద్భుతమైన కథతో వచ్చారు. మేమిద్దరం ఈ సినిమా ఒక సవాల్ గా తీసుకున్నాం. చాలా హోం వర్క్ చేశాం. నేను ఏది చేసినా నా అభిమానులని దృష్టిలో పెట్టుకుంటాను. భగవంత్ కేసరి ట్రైలర్ అభిమానులు, ప్రేక్షకులు, అందరినీ ఆకట్టుకుంది. సినిమా ఇంకా గొప్పగా అలరిస్తుంది. నటుల నుంచి, సాంకేతిక నిపుణుల నుంచి తను కోరుకున్నది రాబట్టుకునే దర్శకుడు అనిల్. ఆయన లాంటి దర్శకుడు ఇండస్ట్రీకి ఒక వరం. తమన్ అఖండతో బాక్సులు బద్దలగొట్టాడు. చాలా ప్రతిభావంతుడు. అద్భుతమైన పాటలు నేపధ్య సంగీతం అందించాడు. అలాగే రామ్ ప్రసాద్ గారు అద్భుతమైన డీవోపీ. నా ప్రతి కదలిక తనకి తెలుసు. ఒకరిని ఒకరు పూర్తిగా అర్ధం చేసుకున్నాం. తన కెమరా ద్వారా ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేశారో ప్రేక్షకులు చూస్తారు. కాజల్ అద్భుతమైన నటి. చాలా మంచి పాత్ర చేశారు. ఒక విస్పోటనం జరిగితే గానీ ఇలాంటి కలయిక జరగదు. విస్పోటనం జరిగితేనే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. అలాంటి అద్భుతాల్లో ఒకటి మా భగవంత్ కేసరి. శ్రీలీల బోర్న్ ఆర్టిస్ట్. మా ఇద్దరి మధ్య చాలా బరువైన సీన్స్ వుంటాయి. ఆడమగా అనే తేడా లేకుండా అందరూ చప్పట్లు కొట్టి కన్నీళ్ళతో థియేటర్ నుంచి బయటికి వస్తారు. ప్రతి సన్నివేశానికి లేచి చప్పట్లు కొడతారు. అంత అద్భుతంగా వచ్చింది మా మధ్య కెమిస్ట్రీ. ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించాలనే తనప శ్రీలీల లో వుంది. అందుకు అభినందనలు. అర్జున్ రామ్ పాల్ నటన అదరగొట్టారు. తనే డబ్బింగ్ చెప్పారు. ప్రతి పాత్ర అద్భుతంగా వుంటుంది. సినిమాలో చాలా వుంది. దాచిపెట్టాం. సినిమా చాలా కూల్ మొదలౌతుంది. తర్వాత దబ్బిడి దిబ్బిడే. ప్రేక్షకులందరినీ సినిమాలో కి తీసుకెళ్ళిపోతుంది. నిర్మాతలు  హరీష్, సాహు చాలా అద్భుతంగా సినిమాని నిర్మించారు. వారి నిర్మాణంలో మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు.. అఖండ... ఇలా గుర్తుండిపోయే పాత్రలు చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. భగవంత్ కేసరి పాత్ర కూడా గుర్తుండిపోతుంది. సినిమాతో పాటు ఇందులో పాత్రలు కూడా చిరస్థాయిగా నిలిచిపోతాయి. అంతచక్కగా ఈ ఇందులో పాత్రలని మలిచాడు దర్శకుడు అనిల్ రావిపూడి. తనో మళ్ళీ కలసి పని చేయడానికి ఎదురుచూస్తుంటాను. 19న మా భగవంత్ కేసరి సినిమా విడుదల కాబోతుంది. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం వుంటుంది. అందరికీ ధన్యవాదాలు’’ తెలిపారు.  


అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. నవ్వించేవాడికి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయని అంటారు. ఇది వరకు సినిమాలతో నవ్వించిన వాడు ఈసారి కొంచెం ఎమోషన్ చూపించబోతున్నాడు.  బాలకృష్ణ గారు, శ్రీలీల ఎక్స్ ట్రార్డినరీ పెర్ ఫార్మ్ చేశారు. వారి పాత్రలు చాలా రోజులు గుర్తుపెట్టుకునేలా వుంటాయి. భగవంత్ కేసరి పాత్రని యాక్సప్ట్ చేసిన బాలకృష్ణ గారికి లైఫ్ లాంగ్ రుణపడి వుంటాను. హ్యాట్సప్.. బాలయ్య బాబు.  ప్రయోగాత్మక చిత్రాలు చేయాలన్నా, సవాల్ తో కూడుకున్న పాత్ర చేయలన్నా ముందు వుండేది బాలకృష్ణ గారే. భైరవద్వీపంలో కురూపి పాత్ర ఉహించుకోవడానికే కష్టం .అలాంటి పాత్రలని కూడా చేసిన మెప్పించగల గొప్ప నటుడు బాలకృష్ణ గారు. అలాంటి గొప్ప నటుడికి గొప్ప పాత్ర వచ్చింది. ఆ పాత్రని ఎంత అద్భుతంగా పోషించారో అక్టోబర్ 19న ప్రేక్షకులు చూస్తారు. బాలకృష్ణ గారితో  జర్నీ మెమరబుల్. ఆయనతో మళ్ళీ కలసి పని చేయాలని కోరుకుంటున్నాను. శ్రీలీల పాత్ర ఆమె కెరీర్ లో నిలిచిపోతుంది. నిర్మాతలు సాహు, హరీష్ నెక్స్ట్ లెవల్ లో నిర్మించారు. తమన్  ఎక్స్ ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు.  అర్జున్ రాం పాల్ గారు ఈ సినిమాకి తెలుగు డబ్బింగ్ కూడా చెప్పారు. ఈ సినిమాలో పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ బెస్ట్ విషెస్. సక్సెస్ మీట్ లో వాళ్ళందరి గురించి ప్రత్యేకంగా మాట్లాడతాను.  మా సినిమాతో పాటు విడుదలౌతున్న విజయ్ గారి లియో, రవితేజ గారి టైగర్ నాగేశ్వరరావు కూడా బెస్ట్ విషెస్'' తెలిపారు


శ్రీలీల మాట్లాడుతూ... విజ్జి పాప, భగవంత్ కేసరి చాలా స్వచ్ఛమైన అనుబంధం. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన బాలకృష్ణ గారికి, దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాతలు హరీష్ గారు, సాహు గారు చాలా కూల్ గా వుంటారు. కాజల్ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. సినిమా అంతా ఒక పిక్నిక్ చాలా సరదాగా జరిగింది. అంత మంచి పాత్ర ఇచ్చిన అనిల్ గారికి మరోసారి కృతజ్ఞతలు. ఈ సినిమాతో చాలా ఎమోషనల్ కనెక్షన్ వుంది. భగవంత్ కేసరి ఈ సినిమా శానా ఏండ్లు యాదుంటుంది'' అన్నారు.


ఎస్ఎస్ తమన్ మాట్లాడుతూ.. కొన్ని సినిమాలు అద్భుతమైన మ్యూజిక్ ని ఆడుతాయి. గొప్ప ఎనర్జీ ఇస్తాయి. ‘భగవంత్ కేసరి' కూడా అలాంటి సినిమానే. సినిమా అంతా అద్భుతంగా వుంది. దర్శకుడు అనిల్ తన వెన్నెముక నాకు కూడా అతికించారు. నిర్మాతలు చాలా కూల్ గా వుంటారు. అనిల్ అద్భుతంగా పిక్చరైజ్ చేశాడు. తను మంచి లైఫ్ వున్నా ఫిలిం ఇచ్చాడు. ఇందులో పని చేసిన అందరూ దానికి ఆక్సిజన్ నింపారు. అందుకే ఈ సినిమా ఈ రోజు ఇంత ఆనందంగా వుంది. శ్రీలీల కంప్లీట్ యాక్టర్ అద్భుతంగా నటించింది. తనకి ఈ సినిమా మరింత పేరు తీసుకొస్తుంది. నా మొదటి జీతం బాలకృష్ణ గారి సినిమా ( భైరవద్వీపం) నుంచే తీసుకున్నాను. నా తొమ్మిదేళ్ళ వయసులో ఆయన సినిమాకి పని చేశాను. నాకు కడుపునింపిన మనిషిగా బాలకృష్ణ గారితో ఎంతో అనుబంధం వుంది. అఖండ, వీరసింహరెడ్డి.. తర్వాత ఈ సినిమా మా ఇద్దరికి హ్యాట్రిక్. ఇది ఫిక్స్.  ‘భగవంత్ కేసరి' కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడుకున్న బ్యూటీఫుల్ ఎమోషనల్ డ్రామా. కంప్లీట్ ఫిలిం. అందరినీ ఈ సినిమా అలరిస్తుంది'' అన్నారు.


నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. బాలకృష్ణ గారి, అనిల్ రావిపూడి గారి, శ్రీలీల, కాజల్ గారి టీం అందరికీ ధన్యవాదాలు. దసరాకి బాలయ్య బాబు దుమ్ము దులుపుతారు. ఈ సినిమా అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ అలరిస్తుంది. బాలకృష్ణ, శ్రీలీల ఎమోషన్స్ చాలా బాగా వర్క్ అవుట్ అయ్యాయి. ప్రేక్షకులు ఈ సినిమాకి గొప్ప విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను' అన్నారు.  


నిర్మాత హరీష్ పెద్ది మాట్లాడుతూ.. ఇంత గొప్ప అవకాశం కల్పించిన బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు. బాలకృష్ణ గారి కెరీర్ లో ఇది బ్రహ్మండమైన సినిమా అవుతుంది. మా బ్యానర్ లో బిగ్ సినిమా అవుతుంది.మా బ్యానర్ ల ఇంత మంచి సినిమా ఇచ్చిన అనిల్ రావిపూడి గారికి ధన్యవాదాలు. కాజల్,  శ్రీలీల అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. తమన్ గారు వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. టీం అందరికీ పేరుపేరునా థాంక్స్'' తెలిపారు.



Share this article :