శ్రీకాంత్ చేతుల మీదుగా ‘నాతో నేను’ రెట్రో సాంగ్ విడుదల
సాయికుమార్, శ్రీనివాస్‌సాయు, ఆదిత్యా ఓం, దీపాలి రాజపుత్, ఐశ్వర్య రాజీవ్ కనకాల ప్రధాన పాత్రధారులుగా శాంతి కుమార్ తూర్లపాటి (జబర్దస్ట్ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’. ఈ చిత్రంలోని రెట్రో మెలోడీ సాంగ్‌ను శ్రీకాంత్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘ఈ పాట వినగానే మళ్లీ పాత రోజులు గుర్తొచ్చాయి. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్లుగా రెట్రో స్టైల్‌లో ఈ పాటను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్న శాంతికుమార్ సక్సెస్ కావాలి. ఈ చిత్రంలో పని చేసిన అందిరికీ మంచి పేరు రావాలి’’ అని అన్నారు.
శాంతికుమార్ మాట్లాడుతూ ‘‘జబర్దస్త్ కమెడీయన్‌గా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశాను. కథ, మాట, పాటలు నేనే రాసుకుని చక్కని నిర్మాతల సహకారంతో ఈ సినిమా పూర్తి చేశాం. శ్రీకాంత్‌గారితో ఈ పాటను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ పాట చూస్తే 1980లోకి తీసుకెళ్తుంది’’ అని అన్నారు.
‘‘మంచి కథతో తొలి ప్రయత్నం చేసాం. సాయికుమార్ గారు కొత్తగా కనిపిస్తారు. శ్రీకాంత్‌గారితో చాలాకాంలగా పరిచయం ఉంది. ఆయనతో ఓ సినిమా చేయాలనుకున్నా. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తా. మా తొలి ప్రయత్నం ‘నాతో నేను’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని నిర్మాత అన్నారు. మంచి కథతో సినిమా చేశామని నటుడు ఆదిత్యా ఓం అన్నారు.
నటీనటులు:.
సమీర్, సి.వి.ఎల్ నరసింహారావు, గౌతమ్ రాజు ఎమ్మెస్ చౌదరి, భద్రం, సుమన్ శెట్టి తదితరులు
సాంకేతిక నిపుణులు:
కెమెరా: యూ'హ్. మురళి మోహన్ రెడ్డి, సంగీతం: సత్య కశ్యప్, బ్యాక్గ్రౌండ్: ఎస్ చిన్న, ఎడిటింగ్: నందమూరి హరి, ఆర్ట్: పెద్దిరాజు అడ్డాల, పాటలు: రామజోగయ్య శాస్త్రి, శాంతికుమార్, కొరియోగ్రాఫర్: భాను, చంద్ర కిరణ్, ఫైట్స్: నందు, బ్యానర్:శ్రీ భావనేశ్ ప్రొడక్షన్స్, సమర్పణ: ఎల్లలు బాబు టంగుటూరి, పీఆర్వో: మధు విఆర్
Post a Comment