Home » » Rudramambapuram movie Jatara song launched by hero srikanth

Rudramambapuram movie Jatara song launched by hero srikanth

మత్స్యకారుల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాతో కూడిన చిత్రం రుద్రమాంబపురం : హీరో శ్రీకాంత్




అజ‌య్ ఘోష్‌, శుభోద‌యం సుబ్బారావు, అర్జున్ రాజేష్, పలాస జనార్దన్, నండూరి రాము, టివి.ఎయిట్ సాయి, శంకర్, డివి.సుబ్బారావు, ప్రమీల, రజిని శ్రీకళ, రత్నశ్రీ, షెహనాజ్, రజిని, సురేఖ, రమణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతోన్న చిత్రం `రుద్ర‌మాంబ‌పురం`. మూల‌వాసుల క‌థ అనేది ట్యాగ్‌లైన్‌. ఎన్‌వీఎల్ ఆర్ట్స్ ప‌తాకంపై నండూరి రాము నిర్మిస్తున్నారు. మ‌హేష్ బంటు ద‌ర్శ‌కుడు. మూల కథ అజయ్ ఘోష్. 


ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ మూవీ నుండి జాతర సాంగ్ ను ప్రముఖ హీరో శ్రీకాంత్ గారు విడుదల చేసారు. ఈ పాటను ఆస్కార్ విజేత  రాహుల్ సిప్లి గంజ్ పాడగా, 

భాష్య శ్రీ సాహిత్యం అందించారు, అలాగే వెంగి సంగీతం సమకూర్చారు. రుద్ర‌మాంబ‌పురం జులై 6నుండి హాట్ స్టార్ లో విడుదల కానుంది. 


ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ...

ఎన్. వి.ఎల్.ఆర్ట్స్ పతాకంపై నిర్మాత నండూరి రాము నిర్మించిన చిత్రం రుద్రమాంబపురం, ములవాసుల కథ. ఇది మత్స్యకారుల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాతో యదార్ధ సంఘటనల ఆధారంగా నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. 


ఈ చిత్రంలో  తిరుపతి పాత్ర లో అజయ్ గోష్, నటిస్తున్నారు, పెద్ద‌కాపు మ‌ల్లోజుల శివ‌య్య పాత్ర‌లో శుభోద‌యం సుబ్బారావు న‌టిస్తున్నారు. వెంగీ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి ఎన్ సుధాక‌ర్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌, బొంతల నాగేశ్వ‌ర్ రెడ్డి ఎడిట‌ర్‌. వెంక‌టేశ్వ‌ర‌రావు ఆర్ట్ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.


సాంకేతిక వ‌ర్గం:

నిర్మాత‌: నండూరి రాము

ద‌ర్శ‌క‌త్వం: మ‌హేష్ బంటు

బ్యాన‌ర్: ఎన్‌వీఎల్ ఆర్ట్స్

క‌థ‌: అజ‌య్ ఘోష్

డిఓపి: ఎన్ సుధాక‌ర్ రెడ్డి

సంగీతం: వెంగీ

ఎడిట‌ర్‌: బొంత‌ల నాగేశ్వ‌ర్ రెడ్డి,

ఆర్ట్‌: వెంక‌టేశ్వ‌ర రావు

ఫైట్స్‌: దేవ‌రాజు

కో- ప్రొడ్యూస‌ర్‌: డి న‌రసింహ‌మూర్తి రాజు

సీఈఓ: అనింగి రాజ‌శేఖ‌ర్‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కారెడ్ల బాలాజీ శ్రీ‌ను

కొరియోగ్రఫీ: జో జో మాస్టర్

పీఆర్ఓ: శ్రీధర్


Share this article :